SSMB29 :తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ చేస్తే అవి కూడా కోట్లలో కలెక్షన్స్ వసూలు చేస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలకు తెలుగు ఆడియన్స్ ఏవిధంగా బ్రహ్మరథం పడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ (Trivikram Srinivas) దర్శకత్వంలో చేసిన గుంటూరు కారం (Guntur Karam) సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మహేష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వలన ఆ సినిమా మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది.
మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిజినెస్ మెన్ (Businessman) సినిమాలో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఒక డైలాగ్ లో చెప్తాడు. మిల్క్ బాయ్ లా ఉన్నాడు ఈయన భాయ్ ఏంటి అని. ఇకపోతే మహేష్ బాబు తన కెరియర్లో మొదటిసారి ఎస్ఎస్ రాజమౌళితో పనిచేస్తున్నారు. మహేష్ కెరియర్ లో వస్తున్న 29 (SSMB29) వ సినిమా ఇది. ఈ సినిమా పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పడుతుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. బాహుబలి (Bahubali) సినిమా తర్వాత రాజమౌళి స్థాయి పూర్తిగా మారిపోయింది. రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.
Also Read : Kalki Movie : కల్కి లో మహాప్రస్థానం కవితా ఎందుకు చెప్పించా అంటే..
రాజమౌళి (Rajamouli) తో ఒక హీరో పని చేస్తున్నాడు అంటే కొన్ని రోజులు బయట కనిపించకుండా వర్కౌట్ చేయటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే మహేష్ పలుసార్లు ఎయిర్పోర్ట్స్ లో దర్శనం ఇచ్చాడు. ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా హెయిర్ పెంచారు. కేవలం హెయిర్ మాత్రమే కాకుండా మహేష్ బాబు తన కెరీర్లో మొదటిసారి గడ్డాన్ని కూడా పెంచారు. అయితే కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడం మొదలయ్యాయి.ఈ ఫోటోలో మహేష్ బాబును చూస్తే సినిమా మీద అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి అని చెప్పాలి. లాంగ్ హెయిర్ తో గుబురు గడ్డంతో ఒక హాలీవుడ్ హీరోను తలపించే రేంజ్ లో ఉన్నాడు మహేష్.దీంతో చాలామంది అసలు రాజమౌళి ఏం ప్లాన్ చేసాడో అంటూ చర్చించడం మొదలుపెట్టారు. సినిమా గురించి సరైన అప్డేట్స్ లేకపోయినా కూడా మహేష్ ను ఇలా చూడటం, ఆయన అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పాలి. మొత్తానికి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వకుండానే బాబు లుక్ రీవీల్ అవడంతో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపు అయిపోయాయి.
Also Read: Allu Arjun: క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్.. ఏకంగా బ్లాంక్ చెక్ లతో..