Infinix Note 50 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ ఈ ఏడాది కొత్త మొబైల్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2025లో మరో కొత్త మొబైల్ ను తీసుకురాటానికి సన్నాహాలు చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 50 (Infinix Note 50) పేరుతో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలన్నీ ఇప్పటివరకు ఎన్నో కొత్త మొబైల్స్ ను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ ఏడాది యాపిల్, సామ్సాంగ్, వన్ ప్లస్, రెడ్ మీ, రియల్ మీ తమ కొత్త బ్రాండ్స్ ను లాంఛ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ సైతం ఇన్ఫినిక్స్ నోట్ 40 మొబైల్ (Infinix Note 40) ను తీసుకువచ్చింది. మీడియా టెక్ వీడియో ప్రాసెసర్ తో వచ్చేసిన ఈ మొబైల్ కు మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. దీంతో మరో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఇన్ఫినిక్స్ అధికారికంగా వెల్లడించినప్పటికీ.. తాజాగా FCC లో లిస్ట్ అవడంతో ఈ మొబైల్ ఫీచర్స్ తో పాటు వేరియంట్స్ సైతం లీక్ అయ్యాయి.
భారతీయ మొబైల్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ త్వరలోనే కొత్త మొబైల్ ను లాంఛ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ లిస్టింగ్ లో ఇన్ఫినిక్స్ నోట్ 50 (Infinix Note 50) పేరుతో కొత్త మొబైల్ లిస్ట్ కావటంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఇన్ఫినిక్స్ నోట్ 50 పేరుతో రాబోతున్న ఈ మొబైల్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. క్వాడ్ రియల్ కెమెరా సెటప్ తో రెండు డిఫరెంట్ కలర్స్ లో ఈ మొబైల్ రాబోతుంది. ఇక FCC వెబ్‌సైట్‌లో చూసినట్లుగా Infinix Note 50 మోడల్ నంబర్ X6858తో వస్తుందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్రీన్, పింక్‌తో సహా రెండు వేర్వేరు రంగు వేరియంట్స్ లో రాబోతుంది. కెమెరా ఆక్టాగోనల్ డిజైన్ తో రాబోతుంది. LED ఫ్లాష్ యూనిట్‌తో పాటు బ్యాక్ ప్యానెల్‌లో నాలుగు సెన్సార్‌లు ఉన్నాయి.
ఇక Infinix Note 50 మెుబైల్ 2G, 3G, 4G LTE కనెక్టివిటీ సపోర్ట్ తో డ్యూయల్ బ్యాండ్ WiFi (2.4GHz – 5GHz) తో పనిచేస్తుంది. సుమారు 163.2 x 74.4 తో 9 mmతో రాబోతుంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద బ్యాటరీతో వచ్చేస్తుంది. ఈ సిరీస్‌లో నాలుగు మెుబైల్స్ రాబోతున్నాయని.. నోట్ 50X, నోట్ 50 ప్రో, నోట్ 50 ప్రో ప్లస్, వెనిలా వేరియంట్ గా రానున్నట్లు తెలుస్తుంది.
ఇన్ఫినిక్స్ నుంచి ఇంతకు ముందు వచ్చిన మెుబైల్ Infinix Note 40. ఈ మెుబైల్ MediaTek Helio G99 ప్రాసెసర్, హై కెపాసిటీ ర్యామ్ తో వచ్చేసింది. రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇందులో 108MP ప్రైమరీ షూటర్, 2MP డెప్త్ షూటర్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పైన XOS 14తో Android 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
ALSO READ : వచ్చే వారమే గెలక్సీ S25 లాంఛ్! ధర, ప్రీ బుకింగ్ డీటెయిల్స్ ఇవే