BigTV English

Influencer Vamshi: AMB మాల్ లో ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ ఓవరాక్షన్, పోలీసులు అరెస్టు చేసినా బుద్ది రాలేదా నాయనా?

Influencer Vamshi: AMB మాల్ లో ఇన్ స్టా ఇన్ ఫ్లూయెన్సర్ ఓవరాక్షన్, పోలీసులు అరెస్టు చేసినా బుద్ది రాలేదా నాయనా?

సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది ఫన్నీగా ఆకట్టుకునే వీడియోలు చేస్తుంటే, మరికొంత మంది డేంజరస్ స్టంట్లు చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు చేసే పిచ్చి పనులు ప్రాణాల మీదికి తెస్తున్న సందర్భాలున్నాయి. అయితే, కొంత మంది డబ్బులు ఎవరగా వేసి క్రేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిలో ఒకడు వంశీ. ‘ఇట్స్ మీ పవర్ వంశీ’ పేరుతో ఇన్ స్టా ఫ్లూయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న తను.. ఇప్పటికే పలుమార్లు పిచ్చి వేశాలు వేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయినా, తన తీరు మారడం లేదు.


ఫాలోవర్స్ కు డబ్బులు ఇస్తానంటూ AMB మాల్ లో హల్ చల్

తాజాగా హైదరాబాద్ AMB మాల్ లో వంశీ ఓ రేంజ్ లో అతి చేశాడు. తనతో పాటు ఆరుగురు బౌన్సర్లు వెంటేసుకుని మాల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఓ బౌన్సర్ చేతిలో బ్రీఫ్ కేసు పట్టుకొని వచ్చాడు. తాను ప్రస్తుతం AMB మాల్ సెకెండ్ ఫ్లోర్ లో ఉన్నానని, తన ఇన్ స్టా ఫాలోవర్లు అక్కడికి వస్తే, వారందరి పేర్లు రాసి ఓ బాక్స్ లో వేసి, అందులో నుంచి ఓ చీటీ తీస్తానని, వాళ్లకు దానిలో ఎంత అమౌంట్ రాసి ఉంటే అంత ఇస్తానంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టాడు. ఈ వీడియో కాసేపట్లోనే వైరల్ అయ్యింది. అక్కడికి ఆయన ఫాలోవర్స్ రావడం మొదలు పెట్టారు. మాల్ లోనూ తన బౌన్సర్లతో కలిసి హల్ చల్ చేశాడు. అతడి తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గతంలో వంశీపై కేసు నమోదు

ఇప్పటికే ఓసారి వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. KPHBలో బైక్ మీద వెళ్తూ డబ్బులు వెదజల్లాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అతడిని గుర్తించి అరెస్టు చేశారు. మరోసారి ఇలాంటి సంఘటన రిపీట్ అయితే సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. అయినప్పటికీ, వంశీ తన తీరు మార్చుకోలేదు.  సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చి వేశాలు వేస్తూనే ఉన్నాడు.

Read Also:పెళ్లి కూతురు ఇంటిపై డబ్బుల వర్షం.. విమానాన్ని అద్దెకు తీసుకుని మరీ..

పోలీసులు చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు

మరోవైపు పబ్లిక్ పేస్ లో సోషల్ మీడియా రీల్స్, వీడియోలు అంటూ ఓవరాక్షన్ చేసే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు నెటిజన్లు. కొన్నిసార్లు నెట్టింట ఫేమస్ అయ్యేందుకు కొంత మంది చేసే పనులు చిరాకు కలిగిస్తున్నాయంటున్నారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టకూడదంటున్నారు. కొంత మందిని లోపల వేస్తేనే చాలా మందికి బుద్ది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఇలాంటి వారిపై కాస్త ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.

Read Also: కారు డ్రైవింగ్ చేస్తూ ముద్దులతో రెచ్చిపోయిన జంట, చివరికి..

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×