BigTV English

Rs 39,000 Discount on iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.39వేల తగ్గింపు!

Rs 39,000 Discount on iPhone 15 Pro: ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.39వేల తగ్గింపు!

Rs 39,000 Discount on iPhone 15 Pro and iPhone 12: యాపిల్ ఐఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి కొత్త సిరీస్ వస్తుందంటే ఫోన్ ప్రియులు ఎగబడి కొనేస్తారు. ధర ఏ లక్షల్లో ఉన్నా కొనేందుకు ఏ మాత్రం ఆలోచించరు. అయితే మరికొందరు మాత్రం ఐఫోన్‌పై డిస్కౌంట్లు ఆఫర్లు ప్రకటించినప్పుడు కొనుక్కోవచ్చని ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.


తాజాగా ఐఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపుతో ఐఫోన్లను ఇప్పుడు కొనుక్కోవచ్చు. మరి ఆ తగ్గింపు ఎంత?. ఎందులో కొనుక్కోవాలో తెలుసుకుందాం.

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఐపోన్ 15 ప్రో పై అద్భుతమైన డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,34,900 గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఉంది. ఐఫోన్ 15 ప్రో మోడల్‌పై ఏకంగా రూ.38,962 వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ తగ్గింపుతో ఈ ఫోన్‌ను ఇప్పుడు కేవలం రూ.95,938కే సొంతం చేసుకోవచ్చు.


Read More: ఐఫోన్​ 16 సిరీస్ వచ్చేస్తుంది.. 5 మోడల్స్ ధరలు ఇవే..!

బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఈఎంఐ లావాదేవీలపై రూ.3000 తగ్గింపును పొందుతారు. వీటితో పాటు భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది.

ఏకంగా రూ.61,500 వరకు భారీ ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ తగ్గింపు ఆఫర్ అనేది ఫోన్ మోడల్, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆఫర్స్ ఐఫోన్ 15 ప్రో వైట్ టైటానియం 128జీబీ మొబైల్‌పై మాత్రమే అందుబాటులో ఉంది.

ఐఫోన్ 12 పై భారీ తగ్గింపు:

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 పై కూడా అద్భుతమైన ఆఫర్ ఉంది. ఈ మోడల్‌పై కూడా మంచి డిస్కౌంట్ పొందవచ్చు. అందువల్ల ఈ ఫోన్‌ను కొనుక్కోవాలనుకునే వారు ఈ ఆఫర్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

Read More: 5జీ స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఈ ఆఫర్ పోతే మళ్లీరాదు గురూ..!

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 అసలు ధర రూ.49,900గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఈ ఫోన్‌పై 9 శాతం తగ్గింపును అందిస్తోంది. ఇక ఈ తగ్గింపు ఆఫర్‌తో వినియోగదారులు ఐఫోన్ 12 మోడల్‌ను కేవలం రూ. 44,990కి కొనుగోలు చేసుకోవచ్చు. కాగా ఈ తగ్గింపు ఆఫర్ ఐఫోన్ 12 వైట్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది.

Tags

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×