IND vs BAN Test Series: టెస్టు మ్యాచ్ ల సిరీస్ మొదలవబోతోంది. మొన్నటి వరకు టీ 20 ప్రపంచకప్ హడావుడి ముగిసింది. తర్వాత శ్రీలంక పర్యటనలో వన్డే, టీ 20 సిరీస్ అయిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ తో సెప్టెంబరు 19 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ లు, 3 టీ 20లు ఆడనుంది. తొలిటెస్ట్ చెన్నయ్ లో, రెండో టెస్ట్ కాన్పూర్ లో జరగనుంది.
ఇప్పుడు బంగ్లాదేశ్ టూర్ కి ఇద్దరు కీలకమైన టెస్టు ప్లేయర్ల స్థానంలో ఎవరిని ఉంచాలనే అంశంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఛతేశ్వర్ పుజారా, ఆజ్యింకా రెహానె ఇద్దరూ కీలకంగా ఆడేవారు. మ్యాచ్ ని నిలబెట్టేవారు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైశ్వాల్ వస్తారు. ఫస్ట్ డౌన్ గిల్, సెకండ్ డౌన్ విరాట్ కొహ్లీ, తర్వాత కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లేదా హార్దిక్ పాండ్యా తర్వాత నుంచి ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, తర్వాత బౌలర్లు వస్తుంటారు.
ఇప్పుడు పైన చెప్పుకున్న పుజారా, రహానే ఇద్దరికి చోటు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మరి వారిద్దరి ప్లేస్ రీప్లేస్ చేసేది ఎవరనే అంశంపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది.
Also Read: పాకిస్తాన్ కు.. మరో అవమానం తప్పదా?
ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ దీనికి ఒక పరిష్కారాన్ని కనిపెట్టాడు. వీరిద్దరిలో ప్లేస్ లో శుభ్ మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్ లను ఎంపిక చేస్తారని భావిస్తున్నట్టు తెలిపాడు. ఎందుకంటే ఇద్దరికి ఇంగ్లండ్ జట్టుతో ఆడిన అనుభవం ఉంది. నిజానికి బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.
అందుకోసం త్వరలో జరగబోయే టెస్టు మ్యాచ్ ల్లో ప్రయోగాలు చేయనున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆజ్యింకా రహానె కౌంటీ చాంపియన్ షిప్ లో అదరగొడుతున్నాడు. లీసెస్టర్ షైర్ తరఫున ఆడుతూ సెంచరీ చేశాడు. ఇప్పుడు బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద పని చెప్పాడని అంటున్నారు.
దినేశ్ కార్తీక్ చెప్పినట్టు ఆలోచిస్తే.. శుభ్ మన్ గిల్ ఇప్పటివరకు 25 టెస్టులు ఆడి 1492 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. సర్ఫరాజ్ ఖాన్ అయితే మూడు టెస్టుల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయడమే కాదు, మొత్తంగా 200 పరుగులు చేసి ఉన్నాడు. అందువల్ల సర్ఫరాజ్ ని ఎక్స్ ట్రా ప్లేయర్ గానైనా తీసుకుంటారని అంటున్నారు.