iPhone 16e vs OnePlus 13s vs Vivo X200 FE| రూ. 80,000 లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఐఫోన్ 16ఈ, వన్‌ప్లస్ 13ఎస్, వివో ఎక్స్200 ఎఫ్‌ఈ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫోన్లలో ఈ మూడు ఈ ధరలో మంచి ఆప్షన్లు. అయితే ఈ మూడింటిలో కూడా ఏది టాప్ అనే ప్రశ్నకు సమాధానం కోసం వీటి ఫీచర్లను పోల్చి చూద్దాం.
ధర
ఐఫోన్ 16ఈ: రూ. 52,990 (128GB), రూ. 61,900 (256GB), రూ. 78,990 (512GB)
వన్‌ప్లస్ 13ఎస్: రూ. 51,399 (12GB/256GB), రూ. 57,436 (12GB/512GB)
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: రూ. 54,999 (12GB/256GB), రూ. 59,999 (16GB/512GB)
డిస్‌ప్లే
ఐఫోన్ 16ఈ: 6.1-అంగుళాల OLED, సూపర్ రెటినా XDR, 2532×1170 రిజల్యూషన్
వన్‌ప్లస్ 13ఎస్: 6.32-అంగుళాల LTPO AMOLED, 2640×1216 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: 6.31-అంగుళాల AMOLED, 2640×1216 రిజల్యూషన్, 120Hz, 5000 నిట్స్ బ్రైట్‌నెస్
వివో డిస్‌ప్లే అత్యధిక బ్రైట్‌నెస్‌తో ఎండలో స్పష్టంగా కనిపిస్తుంది. వన్‌ప్లస్ సాఫీగా స్క్రోల్ అవుతుంది. ఐఫోన్ రంగులు సహజంగా ఉంటాయి.
ప్రాసెసర్
ఐఫోన్ 16ఈ: ఆపిల్ A18 6-కోర్ చిప్
వన్‌ప్లస్ 13ఎస్: స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ (ఆక్టా-కోర్)
వన్‌ప్లస్ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లో పవర్ ఫుల్ పర్‌ఫామెన్స్ అందిస్తుంది. ఐఫోన్ సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌తో మంచి స్పీడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. వివో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఐఫోన్ 16ఈ: iOS 18
వన్‌ప్లస్ 13ఎస్: ఆండ్రాయిడ్ 15తో ఆక్సిజన్‌ఓఎస్ 15
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: ఆండ్రాయిడ్ 15తో ఫన్‌టచ్ ఓఎస్ 15
ఐఫోన్ 6-7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తుంది. వన్‌ప్లస్ 4 సంవత్సరాలు, వివో 3 సంవత్సరాలు అప్‌డేట్‌లకు హామీ ఇస్తుంది.
ర్యామ్, స్టోరేజ్
ఐఫోన్ 16ఈ: 128GB, 256GB, 512GB (ర్యామ్ వివరాలు లేవు)
వన్‌ప్లస్ 13ఎస్: 12GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: 12GB/16GB ర్యామ్, 256GB/512GB స్టోరేజ్
వివో 16GB ర్యామ్ ఆప్షన్‌తో ఎక్కువ సామర్థ్యం అందిస్తుంది. వన్‌ప్లస్ UFS 4.0తో వేగవంతమైన స్టోరేజ్‌ను ఇస్తుంది.
కెమెరా
ఐఫోన్ 16ఈ: 48MP రియర్, 12MP ఫ్రంట్
వన్‌ప్లస్ 13ఎస్: 50MP మెయిన్ + 50MP టెలిఫోటో, 32MP ఫ్రంట్
వివో ఎక్స్200 ఎఫ్‌ఈ: 50MP మెయిన్ + 8MP వైడ్ + 50MP పెరిస్కోప్, 50MP ఫ్రంట్
వివో ట్రిపుల్ కెమెరా, జీస్ ఆప్టిక్స్‌తో అద్భుతమైన ఫోటోలను ఇస్తుంది. వన్‌ప్లస్ డైనమిక్ రేంజ్‌లో రాణిస్తుంది. ఐఫోన్ వీడియో రికార్డింగ్‌లో ది బెస్ట్.
బిల్డ్, కనెక్టివిటీ
మూడు ఫోన్‌లు డ్యూయల్ సిమ్, GPS, Wi-Fi 7 (ఐఫోన్, వన్‌ప్లస్), USB టైప్-సి (ఐఫోన్ మినహా) అందిస్తాయి. అన్నీ సన్నగా ఉంది, పాకెట్ లో పొట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉన్నాయి. వివో IP68/IP69 రేటింగ్‌తో ఎక్కువ రక్షణ ఇస్తుంది.
Also Read: ఆగస్టులో విడుదల కాబోయే స్మార్ట్‌ఫోన్లు.. పిక్సిల్ 10, పోకో 7 అల్ట్రా ఇంకా..
ప్రీమియం iOS అనుభవం కావాలంటే ఐఫోన్ 16ఈ ఉత్తమం. అధిక రిఫ్రెష్ రేట్, శక్తివంతమైన పనితీరు కోసం వన్‌ప్లస్ 13ఎస్ గెలుస్తుంది. అద్భుతమైన కెమెరా, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ కోసం వివో ఎక్స్200 ఎఫ్‌ఈ గొప్ప ఎంపిక. మీ ప్రాధాన్యతలు, పనితీరు, కెమెరా, లేదా ఈకోసిస్టమ్ ఆధారంగా ఎంచుకోండి.