E-Paper
Advertisement

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే

IND vs SL: నేడు శ్రీలంక‌తో మ్యాచ్‌…టీమిండియాకు మంచి ప్రాక్టీస్…బ‌లాబ‌లాలు ఇవే
Advertisement

IND vs SL:  ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. ఈ చివరి రసవత్తర పోరులో టీమిండియా వర్సెస్ శ్రీలంక తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ లో 18వ మ్యాచ్ ఇది. ఇప్పటికే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయింది. అటు టీమిండియా ఫైనల్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అంటే ఇవాళ నామమాత్రపు మ్యాచ్ మాత్రమే కానుంది. ఇందులో ఎవరు గెలిచినా పెద్ద ప్రయోజనం ఉండదన్నమాట.

Also Read: Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

టీమిండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ ఎప్పుడు అంటే

Advertisement

ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో భాగంగా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం 8 గంటల ప్రాంతంలో సోనీ లీవ్ లో ప్రసారం కానుంది. అయితే ఈ మ్యాచ్ ను ఎప్పటిలాగే దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా… నిర్వహిస్తున్నారు. శ్రీలంకతో మ్యాచ్ను ప్రాక్టీస్ కోసం వాడుకుంటుంది టీమిండియా. ఎందుకంటే ఆదివారం రోజున టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఇలాంటి నేపథ్యంలో శ్రీలంక లాంటి బలమైన జట్టుతో టీమిండియా ఆడటం చాలా బెనిఫిట్ కానుంది. శ్రీలంక మ్యాచ్ను ప్రాక్టీస్ కింద తీసుకొని… టీమిండియా ముందుకు వెళ్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

టీమిండియా వర్సెస్ శ్రీలంక ఇరు జట్ల బలా బలాలు

శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఇప్పటివరకు జరిగిన టి20 మ్యాచ్ల రికార్డు ఒకసారి పరిశీలిస్తే… టీమిండియా పై చేయి సాధించింది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 31 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 21 మ్యాచ్ లలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అలాగే… శ్రీలంక కేవలం 9 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఒకే ఒక్క మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగ ముగిసింది. అంటే దీన్ని బట్టి చూస్తే రెండు జట్లలలో.. టీమిండియా బలంగా కనిపిస్తోంది. ఇది ఇలా ఉండ‌గా…సెప్టెంబ‌ర్ 28వ తేదీన టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ‌ధ్య సెప్టెంబ‌ర్ 28వ తేదీన ఫైన‌ల్స్ జ‌రుగ‌నుంది. దుబాయ్ వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతుంది.

Advertisement

Also Read:  Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

టీమిండియా వ‌ర్సెస్ శ్రీలంక మ్యాచ్ వివ‌రాలు

భారత్ అంచ‌నా: 1 అభిషేక్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్, 3 సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), 4 సంజు శాంసన్ (కీప‌ర్‌), 5 రింకూ సింగ్/జితేష్ శర్మ, 6 శివమ్ దూబే, 7 హార్దిక్ పాండ్యా, 8 అక్షర్ సింగ్ పటేల్, 9 హర్షిత్ రాణా, 10 కుల్‌దీప్.

శ్రీలంక అంచ‌నా: 1 పాతుమ్ నిస్సాంక, 2 కుసల్ మెండిస్ (కీప‌ర్‌), 3 కుసల్ పెరెరా, 4 చరిత్ అసలంక (కెప్టెన్), 5 కమిందు మెండిస్, 6 దసున్ షనక, 7 వనిందు హసరంగా, 8 చమిక కరుణరత్నే/ కమిల్ మిషార, 9 మహీర థేక్వాన్, 9 మహీర థేక్‌వాన్10 తుషార.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×