Shahid Afridi: టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 Tournament) భాగంగా ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య ఆరవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన టీమిండియా విక్టరీ సాధించింది. పాకిస్తాన్ మహిళల జట్టుపై ఏకంగా 64 పరుగులు తేడాతో టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే పాకిస్తాన్ పైన టీమిండియా విజయాన్ని జీర్ణించుకోలేక ఆ దేశ క్రికెటర్లు, మాజీలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. టీమిండియా తొండాట ఆడిందని ఆగ్రహిస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా ఈ మ్యాచ్ పై స్పందించారు. స్మృతి, రీచా ఘోష్ బ్యాట్లల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయిందంటూ సంచలన ఆరోపణలు చేశారు షాహిద్ అఫ్రిది. దీనిపై విచారణ జరుగాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఐసీసీకి లేఖ రాస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రిజల్ట్ పై షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన స్మృతి మందాన, రిచా ఘోష్ ల బ్యాట్లను చెక్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ బ్యాటలో చిప్ లు ఉన్నాయని అందుకే అద్భుతంగా రాణించారని ఆరోపణలు చేశారు. ఇదంతా బీసీసీఐ కనుసన్నల్లోనే జరుగుతోందని బాంబు పేల్చారు. ఇలా ప్రతి మ్యాచ్ లోను తొండాట ఆడటం వల్ల టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతూ వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్న ఐసీసీ చీమకుట్టనట్టుగా వ్యవహరిస్తుందని ఆగ్రహించారు. నిన్నటి మ్యాచ్ పైన ఐసీసీ ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఐసిసికి లేఖ రాస్తానని కూడా వెల్లడించారు.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ జట్టుపై 64 పరుగుల తేడాతో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఇండియా 170 పరుగులు చేసింది. ఈ సందర్భంగా స్మృతి మందాన 68 పరుగులతో రెచ్చిపోగా చివరలో రీచా ఘోష్ 34 పరుగులతో రాణించారు. ఇక ఇండియా విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విఫలమైన పాకిస్తాన్, 106 పరుగుల వద్ద కుప్పకూలింది.