E-Paper
Advertisement

శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ స్టార్ట్.. నింగిలోకి GSLV-F18!

శ్రీహరికోటలో కౌంట్‌డౌన్ స్టార్ట్.. నింగిలోకి GSLV-F18!
Advertisement

GSLV-F18 Rocket: శ్రీహరికోటలోని షార్‌ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. అమెరికా GPSపై ఆధారపడకుండా భారత్‌ సొంతంగా అభివృద్ధి చేస్తున్న నావిక్‌ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు NVS-03 ఉపగ్రహాన్ని GSLV-F18 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి పంపేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. రాత్రి 11:51 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుండగా.. 24 గంటల పాటు కొనసాగనుంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగం విజయవంతమైతే దేశంలోనే కాకుండా సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధి వరకు మరింత ఖచ్చితమైన నావిగేషన్‌ సేవలు అందించే సామర్థ్యం పెరగనుంది.

భారత్‌ సెల్ఫ్‌ రిలయన్స్‌

Advertisement

అంటే ఇది కేవలం మరో ఉపగ్రహ ప్రయోగం కాదు.. దేశ రక్షణ, రవాణా, కమ్యూనికేషన్‌, అత్యవసర సేవలకు అవసరమైన నావిగేషన్‌ వ్యవస్థలో భారత్‌ సెల్ఫ్‌ రిలయన్స్‌కు మరో అడుగు. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్‌ వి. నారాయణన్‌ శాస్త్రవేత్తలతో కలిసి చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. తిరుమలలోనూ రాకెట్‌ నమూనాకు ప్రత్యేక పూజలు చేశారు. మరి NVS-03 విజయంతో నావిక్‌ సేవలు ఎంత బలోపేతం కానున్నాయి? అమెరికా GPSకు ప్రత్యామ్నాయంగా భారత్‌ సొంత నావిగేషన్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఎప్పుడు నిలబడనుంది? అనే ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి.

Tags

Related News

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం షాపులు మూసివేత.. 3 రోజులు చుక్క లేనట్లే!

వామ్మో దొంగలంటే వీళ్లే రా బాబోయ్.. ఒకే రాత్రి 4 ఇళ్లు ఊడ్చేసి ఎలా పారిపోయారంటే?

ఎమ్మెల్యే రేంజ్ ఆస్తులు.. జెడ్పీటీసీగా పోటీ! ఎవరీ మమతశ్రీ?

చంద్రబాబుకి పబ్లిక్ స్టంట్లు తప్ప వరద బాధితులపై పట్టింపు లేదు: బొత్స సత్యనారాయణ

గుంటూరు మేయర్‌ అభ్యర్థి, నా చెల్లిని గెలిపించాలని ఓటర్లకు నటుడు జగపతిబాబు విజ్ఞప్తి

తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. ఆటోను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. ఇద్దరు దుర్మరణం!

‘ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందే’.. ఏపీ ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం!

Big Stories

Advertisement
×