E-Paper
Advertisement

ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..

ఆర్గానిక్ అంత్యక్రియలు.. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఏం చేస్తారంటే..
Advertisement

Human Composting: మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది? సాధారణంగా మృతుదేహాన్ని కననం చేస్తాం. లేదంటే దహనం చేస్తాం. కానీ,  కొన్ని సంస్కృతుల్లో ప్రకృతికి వదిలేస్తారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరం నేరుగా మొక్కలకు ఉపయోగపడే మట్టిగా మారితే ఎలా ఉంటుంది? వినడానికి కాస్త వింతగా ఉన్నా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే జరుగుతుంది. దీని పేరు హ్యూమన్ కంపోస్టింగ్. మృతదేహాన్ని కాల్చకుండా సంప్రదాయ పద్ధతిలో పాతి పెట్టకుండా సహజంగా కుల్లిపోయేలా చేసి పోషకాలు ఉన్న పదార్థంగా మార్చే విధానం ఇది. అసలు ఇది ఎలా సాధ్యం..? దీనివల్ల పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుంది..? మన దేశంలోనూ ఇది సాధ్యమేనా..? అనేది ఇప్పుడు చూద్దాం.

అసలేంటి హ్యుమన్ కంఫోస్టింగ్..

Advertisement

ముందుగా మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. హ్యూమన్ కంపోస్టింగ్ అంటే మనిషిని చెత్తలా కంపోజ్ చేయడం కాదు. దీన్ని టెక్నికల్ గా నాచురల్ ఆర్గానిక్ రిడక్షన్ లేదా సహజ సేంద్రియ క్షయకరణం అంటారు. టెరమేషన్ అనే పేరుతోను ఈ పద్ధతిని పిలుస్తారు. మనిషి శరీరం కూడా ఇతర జీవుల్లాగే సహజంగా కులిపోతుంది. అలా కులిపోయే టైంలో సూక్ష్మజీవులు శరీరంలోని సేంద్రియ పదార్థాలను విచ్చినం చేస్తాయి. అయితే ఈ ప్రక్రియను ప్రకృతికి వదిలేయకుండా నియంత్రిత వాతావరణంలో వేగంగా జరిగేలా చేశారు. అంటే శరీరం సహజంగా కూలిపోవడానికి అవసరమైన పరిస్థితులను మనమే కల్పిస్తామ అన్నమాట. మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది..? అది ఇప్పుడు చూద్దాం..

ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది..?

Advertisement

మొదట మరణించిన వ్యక్తి శరీరాన్ని ప్రత్యేకమైన స్టీల్ కంటైనర్ లో ఉంచుతారు. ఆ తర్వాత శరీరాన్ని సహజమైన బట్టతో చుట్టి చుట్టూ చెక్క ముక్కలు గడ్డి ఆల్ఫా ఆల్ఫా వంటి సేంద్రియ పదార్థాలను వేస్తారు. అక్కడే అసలైన ప్రొసీజర్ మొదలవుతుంది. కంటైనర్ లో తగినంత ఆక్సిజన్ వేడి ఉండేలాగా చూస్తారు. సాధారణంగా 130 నుంచి 160°ల ఫారెన్హీట్ టెంపరేచర్ ను మెయింటైన్ చేస్తారు. ఇలాంటి వాతావరణంలో శరీరంలోనూ సేంద్రియ పదార్థాల్లోనూ ఉండే సూక్ష్మజీవులు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి. దీనికి రిజల్టే శరీరంలోని సేంద్రియ పదార్థాలు క్రమంగా విచ్చిన్నం అవ్వడం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా ఉంది. శరీరంలోని ప్రతీది పూర్తిగా మట్టిగా మారిపోదు. ఎముకలు దంతాలు పూర్తిగా విచ్చిన్నం కావడానికి మరింత టైం పడుతుంది. ఇవన్నీ చేసే ముందు మృతదేహంలో ఉన్న మెటల్ ఇంప్లాంట్లు సర్జికల్ స్క్రోల్ జాయింట్ రిప్లేస్మెంట్లు సిలికాన్ ఇంప్లాంట్మెంట్లు ఇలా ఆర్టిఫిషియల్ గా ఉన్నాయన్నీ తీసేయాలి. ఇలా మొత్తం ప్రొసీజర్ ను జాగ్రత్తగా నిర్వహిస్తే నార్మల్ గా 30 నుంచి 45 రోజుల్లో కంపోస్ట్ లాంటి పదార్థం రెడీ అవుతుంది. ఒక వ్యక్తి శరీరం నుంచి సుమారు 90 నుంచి 120 కిలోల వరకు కంపోస్ వస్తుందని ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ లో తేలింది. అయితే మనిషి సైజు ను బట్టి మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ని బట్టి ఇది మారుతుంది. ఇక ఇలా వచ్చిన మట్టిని మొక్కల పెంపకానికి భూమికి పోషకాలకు అందించడానికి ఉపయోగించొచ్చు.

ఈ పద్ధతికి ప్రధానంగా రెండు కారణాలు..

అయితే దాని వినియోగం స్థానిక నిబంధనలపై డిపెండ్ అయి ఉంటుంది. శుభ్రంగా అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంత ప్రత్యేకమైన పద్ధతిని ఎందుకు తీసుకొస్తున్నారు..? దీనికి ప్రధారణంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది దహనం సంప్రదాయ దహనంలో ఇంధనం అవసరమవుతుంది. దాంతో కార్బన్ డైక్సైడ్ తో పాటు ఇతర కాలుష్య పదార్థాలు కూడా విడుదల అవుతాయి. రెండవది ఖనం. నగరాల్లో జనాభా పెరుగుతున్న కొద్ది స్మశాన వాటికలకు స్థలం కేటాయించడం చాలా సవాలుగా మారుతోంది. హ్యూమన్ కంపోస్టింగ్ లో సంప్రదాయ దహనంతో పోలిస్తే ఇంధన వినియోగం కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే పెద్ద మొత్తంలో స్మశాన స్థలాన్ని దీర్ఘకాలికంగా ఆక్రమించాల్సిన అవసరాన్ని కూడా కొంచెం తగ్గించొచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఇది పూర్తిగా పర్యావరణ ప్రభావం లేని పద్ధతి కాదు. కంటైనర్ల మెయింటనెన్స్ టెంపరేచర్ ను కంట్రోల్ చేయడం వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడం పర్యావరణ ప్రభావాలు కూడా ఉంటాయి. అందుకే సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే ఇది ఎంతవరకు మెరుగైనదో అంచనా వేయడానికి కూడా ఇంకొంచెం టైం పడుతుంది. ఇక్కడో ప్రశ్న రావచ్చు మీకు నాకు కూడా అదే వచ్చింది.

ఈ కొత్త పద్ధతి ఎందుకు..?

మృతదేహాన్ని నేలలో పాతి పెడితే కూడా అది సహజంగానే కూలిపోతుంది కదా.. మరి ఈ కొత్త పద్ధతి ఎందుకు..? నిజమే సంప్రదాయ ఖననంలో మృతదేహాన్ని సాధారణ భూమిలో పాతిపెడతారు. అక్కడ నేలలోని సూక్ష్మ జీవులు, తీమ, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ వంటి పరిస్థితులను బట్టి శరీరం క్రమంగా విచ్చిన్నం అవుతుంది. అయితే ఈ ప్రక్రియకు పట్టే సమయం కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. ఫర్ ఎగజాంపుల్ ఉత్తర ఇటలీలోని స్మశాన వాటికల నుంచి వెతికి తీసిన 408 మానవ అవశేషాలపై జరిగిన ఒక స్టడీలో ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. మూసివేసిన రాతి సమాహదుల్లో ఉంచిన మృతదేహాలు అస్తిపంజరాలుగా మారడానికి 40 ఏళ్ల కంటే ఎక్కువ టైం పట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇసుక లేదా కంకార నేలలో పాతిపట్టిన మృతదేహాలు 10ఏళ్ల లోపే అస్తి పంజరాలుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అంటే శరీరం కులిపోయే వేగాన్ని నిర్ణయించేది కేవలం సమయం మాత్రమే కాదు దాని చుట్టూ ఉన్న వాతావరణం కూడా హ్యూమన్ కంపోస్టింగ్ లో ఈ పరిస్థితులను నియంత్రించడం వల్ల ప్రక్రియను తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఎట్ ది సేమ్ టైం సారవంతమైన మట్టి కూడా వస్తుంది.

Also Read: దుబాయ్‌లో ఐఫోన్ చౌక అని కొంటున్నారా? ఈ తప్పు చేస్తే మీ డబ్బులు గోవిందా

ఈ పద్ధతికి ప్రపంచవ్యాప్తంగా అనుమతి ఉందా..?

మరి ఈ పద్ధతికి ప్రపంచవ్యాప్తంగా అనుమతి ఉందా అనేది అసలు క్వశ్చన్. దీనికి ఆన్సర్ లేదు అనే చెప్పాలి. అన్ని దేశాల్లోనూ దీనికి చట్టపరమైన అనుమతి లేదు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అనుమతించాయి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో కూడా ఈ పద్ధతికి సంబంధించిన చట్టాన్ని ఆమోదించింది. అయితే చట్టాలు అమలు తేదీలు అనుమతుల పరిధి రాష్ట్రాన్ని బట్టి మారుతాయి. భారత్లోనూ ఈ పద్ధతిని అమలు చేయాలంటే అంత్యక్రియలకు సంబంధించిన చట్టాలు ప్రజారోగ్య నిబంధనలు మానవ అవశేషాల నిర్వహణ పర్యావరణ ప్రమాణాలు వంటి అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది. అంటే సాంకేతిక అందుబాటులో ఉండడం ఒకటైతే దానికి చట్టపరమైన అనుమతి ఉండడం మరో విషయం. ప్లస్ దీనికి మన వాళ్ళ సెంటిమెంట్ కూడా యాడ్ అవుతుంది.

అందరూ అంగీకరిస్తారా అనేది ప్రశ్న..

మన దగ్గర అంత్యక్రియలకు మతం కుటుంబ సంప్రదాయాలు వ్యక్తిగత నమ్మకాలు చాలా ముఖ్యమైనవి. హిందూ సంప్రదాయాల్లో దహన సంస్కారాలు కనిపిస్తాయి. మరికొన్ని మతాల్లో కననం ప్రధాన పద్ధతి. ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహాన్ని కంపోజ్ గా మార్చడం అందరూ అంగీకరిస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఇక్కడ పర్యావరణం మాత్రమే కాదు మతపరమైన నమ్మకాలు కుటుంబ సభ్యుల అభిప్రాయాలు చట్టపరమైన అనుమతులు కూడా కీలకం. మొత్తానికి మరణం తర్వాత మన శరీరం ప్రకృతిలో కలిసిపోవడం కొత్త విషయం కాదు. కానీ ఆ సహజ ప్రక్రియను స్పీడ్ అప్ చేసి తక్కువ వనరులతో పర్యావరణ ప్రభావాన్ని తగ్గించేలా చేయడం మాత్రం కొత్త ఆలోచన కదా ఒకవైపు సంప్రదాయాలు మరోవైపు పర్యావరణ అవసరాలు ఈ రెండింటి మధ్య హ్యూమన్ కంపోస్టింగ్ ఒక ప్రత్యాన్య అంతక్రియల విధానంగా ముందుకు వస్తుంది.

Tags

Related News

యాపిల్ నుంచి మరో సంచలనం.. కేవలం 5.2 మిమీ మందంతో వస్తున్న iPhone Air 2!

ఫిలిప్స్ పార్టీ స్పీకర్ లాంచ్..ఇక నుంచి ఇంట్లోనే డీజే మజా!

అలర్జీలు,దుమ్ముకు చెక్ పెట్టే..హానివెల్ ఎయిర్ ప్యూరిఫైయర్

రాళ్లలో ఇయర్‌బడ్ మిస్.. AI చేసిన మ్యాజిక్ చూస్తే అవాక్కే.. ఇది కదా చాట్‌జీపీటీ పవర్ అంటే!

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ పనిచేయకపోతే.. మొదటి 24 గంటల్లో ఏం జరుగుతుంది?

115 ఇంచుల బిగ్ స్క్రీన్..సినిమా థియేటర్‌ను తలపించే ఎల్జీ టీవీ లాంచ్

బుర్రలోని ఆలోచనలను టెక్స్ట్‌గా మార్చే విచిత్ర గ్యాడ్జెట్.. జొమాటో సీఈఓ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

Big Stories

Advertisement
×