UnStoppable With NBK Ram Charan Episode : నందమూరి హీరో బాలయ్య హోస్ట్ చేస్తున్న ఏకైక టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్ ను మొదలు పెట్టేసింది. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇక ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో కి గత ఎపిసోడ్ కు విక్టరీ వెంకటేష్ వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా ఈ షోకి రామ్ చరణ్ రాబోతున్నట్లు ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ షోకి రామ్ చరణ్ వచ్చాడు. అందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ షోలో రామ్ చరణ్ అకీరా, పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేశారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం..
గేమ్ ఛేంజర్ మూవీ..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూల్తో పాటుగా కొన్ని షోలకు వెళ్తూ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ వచ్చారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షో షూటింగ్‌కి వచ్చారు.. ఈ షూటింగ్ లో ఎన్నో ప్రశ్నలను అడిగారని తెలుస్తుంది.. ఈ సందర్బంగా రామ్ చరణ్ అకీరా గురించి కొన్ని విషయాలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది..
పవన్ కళ్యాణ్, అకీరా లో ఉన్న సేమ్ క్వాలిటీస్..
ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ గురించి కేవలం హీరోగా మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆయన కొడుకు అకీరా గురించి చాలా మందికి తెలియదు.. పెద్దగా అకీరా మీడియా ముందు కనిపించడు. త్వరలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే విషయం గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో అకీరా, పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చింది. పవన్ కొడుకు అకీరా గురించి చరణ్ మాట్లాడుతూ..
కళ్యాణ్ బాబాయిలానే అకీరా కూడా నిశ్శబ్ద వ్యక్తి. అతను పుస్తకాలతో సమయం గడపడం ఇష్టపడతాడు. నేను సాధారణంగా చదవను, కానీ అకీరా నాకు పుస్తకాలను బహుమతిగా ఇస్తాడు, కాబట్టి నేను వాటిని చదవడానికి ప్రయత్నిస్తాను. అతను పియానో కూడా బాగా వాయిస్తాడు. అని అన్‌స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది.. ఎంతైన తండ్రికి తగ్గ తనయుడు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చి బాబు, సుకుమార్ లతో సినిమా చేస్తున్నాడు.