Sanjay Gupta: సూర్యదేవర నాగవంశీ.. ఈ పేరు ప్రస్తుతం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. మొదటి నుంచి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న నాగవంశీ .. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ను ఒక్క చేత్తో లాక్కొస్తున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో సగం సినిమాలు సితార నుంచి వచ్చినవే. ఎలాంటి భయాలకు లొంగకుండా.. సినిమాలను రిలీజ్ చేయడం దగ్గరనుంచి ప్రమోషన్స్ లో హీరో కన్నా ఎక్కువ పాల్గొనే నిర్మాత ఎవరైనా ఉన్నారు అంటే అది నాగవంశీ మాత్రమే.
భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఇండస్ట్రీ మర్చిపోదు. అప్పుడు పవన్ సినిమా అని టికెట్ రేట్లు తగ్గించాలనుకున్నా.. సినిమాను అసలు రిలీజ్ కూడా చేయమని బెదిరించినా.. ఏమాత్రం బెదరకుండా సినిమాను రిలీజ్ చేశాడు. ఇక అప్పటినుంచి ఆయన ప్రతి సినిమాకు వివాదాలు సర్వ సాధారణంగా మారిపోయాయి. ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యవచ్చినా దానిపై నాగవంశీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటాడు.
Brahmanda Movie: విడుదలకు సిద్ధమైన ఆమని మూవీ.. ఎప్పుడంటే..?
ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యనే నాగవంశీ గలాటా ప్రొడ్యూసర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో నాగవంశీ సౌత్ నుంచిపాల్గొన్నాడు. ఇందులో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ చర్చల్లో నాగవంశీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా బోనీకపూర్ కి ఇచ్చిపడేశాడు. సర్ మీ హిందీ సినిమాను మా తెలుగు సినిమా మళ్లీ రీడిఫైన్ చేసింది. చాలా గొప్ప సినిమాలు రీసెంట్ టైమ్స్ లో మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, అనిమల్ ఇవన్నీ సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక దానిపై బోనీ కపూర్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు కానీ, నాగవంశీ మాటలకూ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. ఇక నాగవంశీ అలా పొగరుగా మాట్లాడడంపై మరో బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత సంజయ్ గుప్తా అతనిపై ఫైర్ అయ్యాడు. ఎక్స్ వేదికగా పరుష పదజాలంతో నాగవంశీపై మండిపడ్డాడు.
Ram Charan: బాలయ్య షోలో రామ్ చరణ్ వేసుకున్న బ్లాక్ హుడీ రేటు ఎంతో తెలుసా.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
“బోనీ జీ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన ఫేక్ ఘనతతో అతన్ని ఎగతాళి చేస్తున్న ఈ అసహ్యకరమైన వ్యక్తి ఎవరు? అతని బాడీ లాంగ్వేజ్ మరియు అసహ్యకరమైన వైఖరి చూడండి. ఏదో నాలుగైదు హిట్స్ ఇస్తే బాలీవుడ్ కి బాప్ అయిపోతారా..? ” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా వరుస ట్వీట్స్ తో అతని ఉక్రోషం బయటపెట్టాడు.
“అల్లు అరవింద్ సర్ లేదా సురేష్ బాబు సర్ వంటి సీనియర్ నిర్మాతల ముందు కూర్చుని వారి ముఖంలోకి వేళ్లు చూపిస్తూ ఈ విధంగా మాట్లాడే దమ్ము ఆయనకు ఉందా.. సక్సెస్ కు ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి..గొప్ప దక్షిణాది చిత్ర నిర్మాతలతో కలిసి పనిచేసి వినయం మరియు క్రమశిక్షణ నేర్చుకున్నాం. అలాంటివారి నుంచి ఇలాంటి అహంకారమైన అసహ్యకరమైన ప్రవర్తన మేము ఊహించలేదు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ ట్వీట్స్ పై నాగవంశీ ఎలా స్పందిస్తాడో చూడాలి.
The first thing we learnt working with the great Southern Film Producers was HUMILITY and DISCIPLINE.
An obnoxious show of arrogance is the very last thing you would expect from them. https://t.co/seip5FSX4N— Sanjay Gupta (@_SanjayGupta) December 31, 2024
Who is this obnoxious guy sitting next to a senior producer like Boney Ji and deriding him with his fake vanity?
Look at his body language and disgusting attitude.
4/5 hits dene se yeh Bollywood ke baap nahin bane na banienge. https://t.co/WhG232dG5r— Sanjay Gupta (@_SanjayGupta) December 31, 2024