iPhone 18 Pro : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ యాపిల్ కొద్ది నెలల క్రితమే ఐఫోన్ 16 సిరీస్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఇప్పటికే గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ఇప్పటి నుంచే టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ వచ్చే ఏడాది అక్టోబర్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 సిరీస్ ఫీచర్స్ లీక్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
2026లో యాపిల్ కంపెనీ తీసుకురాబోతున్న iPhone 18 సిరీస్ గురించిన పుకార్లు ఊపందుకున్నాయి. ఇటీవల TF సెక్యూరిటీస్ ఇంటర్నేషనల్ అనలిస్ట్ మింగ్-చి కువో ఐఫోన్ 18 లైనప్‌తో ఆపిల్ శక్తివంతమైన కొత్త ఐఫోన్ కెమెరా టెక్నాలజీని తీసుకురాబోతుందని తెలిపింది. ఇది ఇమేజ్ నాణ్యతను గణనీయంగా మెరుగుపరుస్తుందని… కుపెర్టినో-ఆధారిత కంపెనీ 2026 ఐఫోన్ 18 లైనప్‌లో వేరియబుల్ ఎపర్చర్‌ను అందిస్తుందని లీక్ చేసింది.
ఇక ఈ పోస్ట్ లో Kuo అనలిస్ట్ Apple తీసుకొస్తున్న iPhone 18 Pro గురించిన కొన్ని లీక్స్ పంచుకుంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్ వేరియబుల్ ఎపర్చర్ కెమెరాతో రాబోతుందుని తెలిపింది. BE సెమీకండక్టర్ (BESI) ఎపర్చర్ లెన్స్ ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఐఫోన్ 18 ప్రో దాని ప్రధాన కెమెరాలో వేరియబుల్ ఎపర్చర్‌ను పొందుపరిచిన మొదటి యాపిల్ ఐఫోన్ గా మారనుంది. వేరియబుల్ ఎపర్చరు లెన్స్‌తో లైటింగ్ ను సెట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే Xiaomi 14 Ultra, Honor Magic 7 Pro తో సహా Android స్మార్ట్‌ఫోన్‌లు ఈ DSLR శైలి ఎపర్చరు లెన్స్ ను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే Samsung Galaxy S9 సిరీస్‌తో 2018లో మెయిన్ కెమెరా కోసం వేరియబుల్ ఎపర్చరు ఫీచర్‌ను పరిచయం చేసింది.
Samsung Galaxy S24 – స్మార్ట్ ఆన్ డివైస్ AIతో అల్టిమేట్ కెమెరా ఫోన్ –
Apple M5 సిరీస్ చిప్‌లు TSMC అధునాతన N3P నోడ్‌తో పనిచేస్తాయని Kuo నివేదిక తెలిపింది. ఇక యాపిల్ తీసుకొస్తున్న కొత్త చిప్స్ M5, M5 Pro, Max, M5 అల్ట్రా చిప్స్ 2025 ప్రారంభంలో సగం, రెండో భాగంలో సగం తయారు కానున్నట్లు తెలుస్తుంది. ఇక 2026లో రాబోతున్న ఐఫోన్ 18 సిరీస్ లో కొత్త చిప్ సెట్స్ సైతం రాబోతున్నాాయి. వీటి తయారీ కూడా త్వరలోనే జరిగే అవకాశం కనిపిస్తుంది.
iPhone 17 Pro Camera –
2025లో ఐఫోన్ 17 సిరీస్‌లో యాపిల్ కొత్త అండర్ డిస్‌ప్లే ఫేస్ ఐడి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేస్తుంది. iPhone 17 Pro మోడల్‌లు యాపిల్ A19 Pro చిప్‌తో పాటు 12GB RAMతో పనిచేస్తాయని తెలుస్తుంది. అయితే ప్రామాణిక iPhone 17, iPhone 17 Air సైతం 8GB RAM సపోర్ట్ తో A18 లేదా A19 చిప్‌లో రన్ అవుతాయని తెలుస్తుంది. ఇందులో రాబోతున్న 4 ఐఫోన్స్ 24 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటాయి. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లు వచ్చే ఏడాది 5x ఆప్టికల్ జూమ్‌తో 5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను రాబోతున్నాయి.
ALSO READ : కొత్త చిప్ సెట్ కు యాపిల్ గ్రీన్ సిగ్నల్.. ఇకపై ప్రాసెసర్ మరింత వేగంగా!