Watch Video: భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ తన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతమున్న యువ క్రికెటర్లలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన క్రికెటర్లలో రిషబ్ పంత్ కూడా ఒకరు. 2022 డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చి మరీ 15 నెలలపాటు క్రికెట్ కి దూరంగా ఉండి.. మళ్లీ గ్రౌండ్ లో తన భీకర బ్యాటింగ్ తో పరుగులు రాబడుతున్న పంత్ అంటే చాలామందికి స్ఫూర్తిదాయకం.
Also Read: Ayodhya Cricket Stadium: అయోధ్యలో సిద్ధమైన అంతర్జాతీయ స్టేడియం..కేపాసిటీ ఎంతంటే ?
రిషబ్ పంత్ తన ఆటతోనే కాదు అప్పుడప్పుడు తన సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేస్తుంటాడు. అయితే తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు పంత్. ప్రస్తుతం టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్ట్ లు పూర్తయ్యాయి. ఇక నాలుగో టెస్ట్ డిసెంబర్ 26 న ఉదయం నుంచి మేల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రారంభం కాబోతోంది.
ఈ బాక్సింగ్ డే టెస్ట్ కోసం భారత ఆటగాళ్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే క్రమంలో రిషబ్ పంత్ కోసం మైదానానికి వచ్చిన దివ్యాంగ బాలుడిని చూసిన పంత్.. అతడిని కలిసేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పంత్ ని చూసిన బాలుడు నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ పరుగులు తీశాడు. ఇక ఆ బాలుడిని దగ్గరకు తీసుకున్న పంత్ ఫోటో దిగి.. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని అతడితో చెప్పాడు. దీంతో ఆ కుర్రాడితో పంత్ ముచ్చటించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Also Read: Ben Stokes Injury: ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ జట్టు నుంచి ఔట్
ఇక ఆసిస్ తో జరిగిన మూడవ టెస్ట్ లో రిషబ్ పంత్ తన అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడవ టెస్ట్ లో పంత్ మొత్తం 9 క్యాచ్ లు పట్టాడు. తొలి ఇన్నింగ్స్ లోనే నాలుగు క్యాచ్ లు అందుకున్న పంత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఐదుగురిని అవుట్ చేయడంలో భాగమయ్యాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ తో రాణించలేకపోయినప్పటికీ వికెట్ల వెనక చురుగ్గా కదిలాడు. ఇక ఐపీఎల్ 2025 సీజన్ కి రిషబ్ పంత్ ని లక్నో సూపర్ జాయింట్ ఏకంగా 27 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా పంత్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ 27 కోట్లలో ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం పంత్ అందుకున్న 27 కోట్లలో 8.1 కోట్లు టాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.
Ek hi dil hai Rishabh bhai 🥹💙 pic.twitter.com/vICEiQDvXD
— Lucknow Super Giants (@LucknowIPL) December 24, 2024