E-Paper
Advertisement

కిష‌న్‌రెడ్డికి అన‌వ‌స‌ర హైప్‌! రేవంత్ పుణ్య‌మా అని.. వార్తల్లో కేంద్ర బిందువుగా కేంద్ర మంత్రి!

కిష‌న్‌రెడ్డికి అన‌వ‌స‌ర హైప్‌! రేవంత్ పుణ్య‌మా అని.. వార్తల్లో కేంద్ర బిందువుగా కేంద్ర మంత్రి!
Advertisement

ఓ కాంగ్రెస్ లీడ‌ర్ ఇలా అన్నాడు. సీఎం ఎందుకు అంత‌లా కిష‌న్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు. అత‌నో బ‌ల‌హీనుడు. పెద్ద లీడ‌రేం కాదు. రేవంత్ రెడ్డే బ‌లంవంతంగా బ‌ద్ద‌లు క‌ట్టి ఆయ‌న్ను బ‌ల‌వంతుడైన లీడ‌ర్ల స‌ర‌స‌న చేర్చుతున్నాడు అని. అవును. దాదాపు అంద‌రిలోనూ ఇదే ఫీలింగు ఉంది. కిష‌న్‌రెడ్డిపై ఎన్ని అభండాలు వేసినా.. ఆరోప‌ణ‌లు చేసినా.. బీజేపీకి ఇక్క‌డ వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఎందుకంటే.. ఆ పార్టీకి అంత సీన్ లేదు. అది లేవ‌దు. కానీ రేవంత్‌రెడ్డి ఇచ్చే అన‌వ‌సర హైప్ వ‌ల్ల ఓ బండి సంజ‌య్‌, ఓ ఈట‌ల రాజేంద‌ర్ తో స‌మాన‌మైన నేత‌గా జెండాకెక్కించాడ‌నే భావ‌న‌లో కాంగ్రెస్ లీడ‌ర్లున్నారు. నిత్యం వార్త‌ల్లో కేంద్ర‌బిందువుగా మార్చ‌డం మూలంగా కిష‌న్‌రెడ్డి ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తున్నాడు.

కిష‌న్‌రెడ్డిని తిట్టడం మూలంగా ఆయ‌న కేంద్రంతో మ‌రింత గ్యాప్ పెంచుకోవ‌డమే కాకుండా కిష‌న్‌రెడ్డికి అన‌వ‌స‌ర బూస్టింగ్ ఇస్తున్నార‌నే అభిప్రాయాల‌ను ఆ పార్టీ నేత‌లే వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ఇట్ల‌నే తిట్టీ తిట్టి త‌ను ప‌లుచనైన అంశాన్ని కూడా ఈ సంద‌ర్బంగా గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు కేసీఆర్ లేపిండు.. ఇప్పుడు రేవంత్ అంత‌కు రెట్టింపు లేప్తుండు.. అనే కామెంట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కామ‌న్ టాపిక్‌గా మారింది.

Advertisement

తిట్టుడు తిట్టుడే.. క‌లుసుడు క‌లుసుడే.. అని మొన్న మ‌నం చెప్పుకున్నాం. ఇక్క‌డ కిష‌న్‌రెడ్డిని తుక్కు తుక్కు తిట్టాలె. అక్క‌డ మోడీని పోయి క‌లిసి విన‌తులు ఇవ్వాలె. ఈ ప‌ద్ధ‌తి బాగానే ఉంది.. కానీ కిష‌న్‌రెడ్డిని తిడితే మోడీ వింట‌డా? అస‌లు మోడీకి తెలంగాణ‌కు నిధులివ్వాల‌నే ఆలోచ‌న ఉందా? రేవంత్‌రెడ్డినే త‌మ పార్టీలోకి వ‌స్తే నిధులు మ‌స్తు వ‌స్తాయ‌ని ఇండికేష‌న్ ఇచ్చే రాజ‌కీయాల‌ను ప్లే చేసే ఈ మోడీ పై న‌మ్మ‌కం ఉందా? కిష‌న్‌రెడ్డిని తిట్టినా.. బీజేపీని టార్గెట్ చేసినా.. అక్క‌డ కేంద్రం ఏమీ ఇవ్వ‌దు. ఆ విష‌యం రేవంత్‌కు కూడా తెలుసు.

వైజాగ్‌కు కూడా మెట్రో ఇచ్చారు. మ‌రి ఇక్క‌డ ఎందుకు మెట్రో గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు.. అన్నాడు రేవంత్‌రెడ్డి. ఇలా నిల‌దీయ‌డం మూలంగానైనా బీజేపీ నేత‌ల‌కు బుద్ది వ‌చ్చి.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతార‌ని రేవంత్ వ్యూహం కావొచ్చు. కానీ ఇక్క‌డ ఈ నేత‌లు మొండికి దిగారు. అక్క‌డ మోడీ ఇంత‌క‌న్నా జ‌గ‌మొండి. రేవంత్ వేద‌న ఈ విష‌యంలో అర‌ణ్య రోద‌నే. ఆయ‌న ఎంత తిట్టినా ఆ నేత‌పై పూలు జ‌ల్లిన‌ట్టేగానీ.. ఫ‌లితం శూన్యం!

Advertisement

కేసీఆర్ కూడా బీజేపీకి బూస్టింగ్ ఇచ్చాడు ఇలాగే తిట్టీ తిట్టీ. ఇప్పుడు రేవంత్ కూడా అదే చేస్తున్నాడ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీని వ‌ల్ల రెండు పార్టీల‌ను ఇరుకున పెడుతున్నాన‌నే వ్యూహం రేవంత్‌ది కావొచ్చు. కానీ దీన్నిరేవంత్ అస‌మ‌ర్థ‌త‌గా జ‌నాలు భావిస్తే.. కాంగ్రెస్ కావ‌డం వ‌ల్లే ఏమీ ప‌నులు కావడం లేదు అనే భావ‌న బ‌లంగా వెళ్తే.. ఇది కూడా పార్టీకి ప్ర‌మాద‌మే… అనే కోణంలో కూడా చ‌ర్చ జ‌రుగుతోంది కాంగ్రెస్ పార్టీలో.

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

బీఆర్‌ఎస్‌ సర్వేలో రేవంత్ సర్కార్‌కు పాస్‌ మార్కులు.. ! పాలనపై అసంతృప్తి లేదు.. సంతృప్తీ లేదు..

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

Big Stories

Advertisement
×