E-Paper
Advertisement

రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!

రూ.500 లోపు బెస్ట్ టైప్-సి, 3.5ఎంఎం ఇయర్ ఫోన్స్.. వీటికి ఇప్పుడు మార్కెట్లో ఫుల్ డిమాండ్!
Advertisement

Best Budget Earphones: ఇప్పుడంతా చాలామంది చేతుల్లో వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్ బడ్సే కనిపిస్తున్నాయి. అయితే, ఛార్జింగ్ టెన్షన్ లేకుండా, ఎప్పుడైనా సరే ఫోన్ లేదా లాప్‌టాప్‌కి ప్లగ్ చేసి వాడుకునేలా వైర్డ్ ఇయర్ ఫోన్స్ వాడితే వచ్చే ఆ మజానే వేరు. ముఖ్యంగా స్టూడెంట్స్‌కి, రోజువారీ ప్రయాణాలు చేసేవాళ్లకు ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. పైగా తక్కువ ధరలో మంచి బ్రాండ్స్ దొరుకుతుండటంతో వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. పాత ఫోన్ అయితే 3.5ఎంఎం జాక్ మోడల్స్, కొత్త ఫోన్ అయితే టైప్-సి పోర్ట్ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.500 లోపు ధరలో లభించే బెస్ట్ ఆప్షన్స్ కొన్ని చూద్దాం.

boAt Bassheads 100

తక్కువ బడ్జెట్‌లో మంచి సౌండ్ కోరుకునే వాళ్లకు బోట్ బాస్‌హెడ్స్ 100 ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో 10ఎంఎం డ్రైవర్ ఉండటం వల్ల మంచి బేస్ వస్తుంది. కాల్స్ మాట్లాడటానికి మైక్ కూడా ఇస్తారు. స్టాండర్డ్ హెడ్‌ఫోన్ జాక్ ఉండే పాత లేదా సాధారణ ఫోన్లు వాడేవాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

JBL C50HI

Advertisement

మంచి ఆడియో బ్రాండ్ కావాలనుకునే వారికి జేబీఎల్ సీ50హెచ్ఐ మంచి ఆప్షన్. ఇందులో 8.6ఎంఎం డ్రైవర్, కాల్స్ కోసం ఇన్‌లైన్ మైక్ ఉంటాయి. వీటితో పాటు వేర్వేరు సైజుల్లో ఇయర్ టిప్స్ వస్తాయి. కాబట్టి.. చెవులకు కంఫర్ట్‌గా సెట్ అవుతాయి. రోజూ పాటలు వినేవాళ్లకు ఇది చక్కగా సరిపోతుంది.

Also Read: క్యాష్, కార్డుల టెన్షన్ వదిలేయండి.. విదేశాల్లోనూ ఇకపై PhonePeతో చిటికెలో పేమెంట్స్!

Portronics Conch Theta C

Advertisement

కొత్త తరం స్మార్ట్‌ఫోన్లలో హెడ్‌ఫోన్ జాక్ పోయి కేవలం టైప్-సి పోర్ట్ మాత్రమే వస్తోంది. అలాంటి ఫోన్ల కోసం పోర్ట్రోనిక్స్ కోంచ్ థీటా సీ ఉపయోగపడుతుంది. దీనికి ఎలాంటి అడాప్టర్ అవసరం లేకుండా నేరుగా ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. పెద్ద 14.2ఎంఎం డ్రైవర్ ఉండటం వల్ల సౌండ్ క్లారిటీ బాగుంటుంది. కేబుల్ కూడా త్వరగా చిక్కుపడకుండా ఉంటుంది.

Philips TAE2146

టైప్-సి పోర్ట్ ఉన్న ఫోన్ల కోసం ఫిలిప్స్ నుంచి వస్తున్న మరో మంచి బడ్జెట్ ఇయర్ ఫోన్ ఇది. దీనిలో 10ఎంఎం డ్రైవర్, మైక్ ఉంటాయి. తక్కువ ధరలో పేరున్న బ్రాండ్ కావాలనుకునేవాళ్లు దీనిని నిరభ్యంతరంగా ఎంచుకోవచ్చు. ఇది రోజువారీ వాడకానికి చాలా బాగుంటుంది.

Skullcandy Jib

స్కల్‌కాండి బ్రాండ్ అంటేనే యూత్‌కి చాలా ఇష్టం. దీని వైర్డ్ వెర్షన్ 3.5ఎంఎం కనెక్టర్ తో వస్తుంది. చెవులకు బాగా సెట్ అయ్యి బయటి శబ్దాన్ని కొంతవరకు తగ్గించే డిజైన్ దీని సొంతం. ఈ ఇయర్ ఫోన్‌లో కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ధర ఆన్‌లైన్‌లో కాస్త మారుతుంటుంది. కానీ, తీసుకుంటే మాత్రం మంచి అనుభూతిని ఇస్తుంది.

Also Read: వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

Tags

Related News

పార్టీలకు ఊపు తెచ్చే.. కొత్త స్పీకర్ లాంచ్! మీరూ ఓ లుక్కేయండి

బడ్జెట్ ధరలో థియేటర్ ఫీల్, 43 ఇంచుల టీవీపై భారీ డిస్కౌంట్

క్యాష్, కార్డుల టెన్షన్ వదిలేయండి.. విదేశాల్లోనూ ఇకపై PhonePeతో చిటికెలో పేమెంట్స్!

వైరల్ 1980s ఏఐ ఫొటో ట్రెండ్ వెనుక అసలు ప్రమాదం ఇదే.. ఈ యాప్స్‌తో జాగ్రత్త!

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

Big Stories

Advertisement
×