E-Paper
Advertisement

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా

నిన్నటిదాకా స్టార్ హీరోయిన్… ఇప్పుడు ఉండటానికి ఇల్లు కూడా లేదు… ఎమోషనల్ కామెడీ డ్రామా
Advertisement

Misty Green OTT: గ్లామర్ ఇండస్ట్రీ వెనుక ఉండే లైఫ్ ఎంత కలర్‌ఫుల్ గా ఉంటుందో, ఒక్కసారి సక్సెస్ గ్రాఫ్ పడిపోతే అంతే చీకటిగా మారుతుంది. సెలబ్రిటీల లైఫ్ లో ఉండే ఈ లగ్జరీ అండ్ సడన్ ఫెయిల్యూర్ ని చాలా ఫన్నీగా, అంతే ఎమోషనల్ గా చూపెట్టిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ‘Misty Green’. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సరికొత్త ఇంటర్నేషనల్ డ్రామా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. కెరీర్‌ పడిపోయి, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని ఒక నటి పడే స్ట్రగుల్ ని ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించారు. ఇందులో లీడ్ రోల్ లో రోసలిండ్ ఎలియజర్ జీవించేసింది.

కథలోకి వెళ్తే…

మిస్టీ గ్రీన్ (రోసలిండ్ ఎలియజర్) ఒకప్పుడు ఎమ్మీ అవార్డు గెలుచుకున్న నటి. హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కెరీర్‌ ఇప్పుడు పూర్తిగా మందగిస్తుంది. అవకాశాలు తగ్గిపోవడంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఆమె ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది మరణించిన తన మాజీ ప్రియుడికి చెందిన ఇల్లు కావడంతో, అక్కడి నుంచి బయటకు వెళ్లడానికి ఆమెకు కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంటుంది.

Advertisement

చేతిలో సరైన పని లేదు.. ఉండటానికి సొంత ఇల్లు లేదు.. మళ్లీ నటిగా నిలదొక్కుకోవాలనే ఆశ మాత్రం ఇంకా చావలేదు. దీంతో ఆ ఏడు రోజుల్లోనే ఉద్యోగం సంపాదించడానికి, తన జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడానికి మిస్టీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు గతంలో పరిచయమైన వ్యక్తులు ఎదురవుతారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రముఖ దర్శకుడు జోర్డాన్ గ్రీన్ (క్రిస్ రాక్) నుంచి ఆమెకు ఒక అవకాశం దక్కే సూచనలు కనిపిస్తాయి. అది తన కెరీర్‌ను మళ్లీ నిలబెట్టుకునే మార్గమవుతుందా? లేక గతంలో ఎదురైన సమస్యలే మరోసారి అడ్డుపడతాయా? అన్నది ఆసక్తికరంగా మారుతుంది. హాలీవుడ్‌ గ్లామర్‌ వెనుక ఉండే అసలు పరిస్థితులు, అవకాశాల కోసం నటీనటులు పడే ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.

ఒక గ్లామర్ క్వీన్ సామాన్య లోకల్ లైఫ్ కి అలవాటు పడే ప్రాసెస్ లో చేసే పనులు, పడే తంటాలు థియేటర్ లెవెల్ హ్యూమర్ ని జనరేట్ చేస్తాయి. డబ్బుతో పాటు మనుషులు కూడా దూరం అయిపోయిన ఆ కఠిన సమయంలో, ఆమె లైఫ్ లో కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ఎలాంటి పోరాటం చేసింది అనేది చాలా హార్ట్ టచింగ్ గా డైరెక్ట్ చేశారు. రోసలిండ్ ఎలియజర్ నటన ఈ కథకు హైలెట్ గా నిలుస్తుంది. నవ్విస్తూనే ఆలోచింపజేసే ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడేవారికి, వీకెండ్ లో రిలాక్స్ అవ్వడానికి ఇదొక బెస్ట్ ఛాయిస్.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ 

Advertisement

ఈ చిత్రంలో రోసలిండ్ ఎలియజర్ మిస్టీ గ్రీన్‌గా నటించగా, ఆడమ్ డ్రైవర్, డేనియల్ కలూయా, అన్నా కేండ్రిక్, క్రిస్ రాక్, టోఫర్ గ్రేస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను క్రిస్ రాక్ నిర్వహించారు. A24 నిర్మించిన ఈ చిత్రం నిడివి 1 గంట 43 నిమిషాలు. 2026 అక్టోబర్ 9న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. నవంబర్ 9 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో ప్రస్తుతం అందుబాటులో లేదు.

Read Also: 70s మైసూర్ వైబ్స్… అటు ట్రెడిషన్స్ ఇటు లవ్… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన మూవీ

Tags

Related News

ఉదయం కాలేజ్ క్లాసెస్, రాత్రి డార్క్ బిజినెస్… ఈ డ్యూయల్ లైఫ్ గేమ్ నెక్స్ట్ లెవెల్ మావా

‘రణబాలి’ నుంచి ‘జైలర్ 2’ వరకు… ఈ వారం ఓటీటీలో రాబోతున్నమోస్ట్ అవైటింగ్ తెలుగు సినిమాలు ఇవే

అపార్ట్‌మెంట్‌లోని అందరికీ కోట్ల రూపాయల ఆఫర్‌… బిల్డర్‌ కు బిగ్ ట్విస్ట్ ఇచ్చే రిటైర్డ్‌ టీచర్‌

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గరివిడి లక్ష్మీ’ ..స్ట్రీమింగ్ డేట్ లాక్!

150 ఏళ్ల చరిత్ర ఉన్న దుకాణాన్ని కూల్చేయాలని ప్లాన్… సిస్టమ్‌పై సామాన్యుడి దండయాత్ర

తాతల నాటి రెస్టారెంట్ తెరవడానికి స్టార్ హీరోయిన్ పడ్డ పాట్లు… రియాలిటీ డాక్యుమెంటరీ

రక్తదాహంతో ఉండే దేవతను పూజించే రహస్య తెగ… ప్రేయసి కోసం జ్యోతిష్యుడి డేంజరస్ అడ్వంచర్

Big Stories

Advertisement
×