E-Paper
Advertisement

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!

కారు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారుతున్నాయా? వేలల్లో నష్టాన్ని తప్పించుకోండిలా!
Advertisement

Sunroof Water Leakage: కారులో సన్‌ రూఫ్ ఉండటం చాలామందికి ఇష్టం. ముఖ్యంగా పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న కార్లకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. అయితే, వర్షాకాలంలో ఇదే సన్‌రూఫ్ కారు యజమానులకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. భారీ వర్షం పడినప్పుడు సన్‌రూఫ్ నుంచి నీళ్లు కారడం, సీట్లపై పడటం, కారు లోపల తడి వాసన రావడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే, చాలామంది అనుకున్నట్లు సన్‌రూఫ్ గ్లాస్ పగలడం వల్లే ఈ సమస్య రావడం లేదు. చాలా సందర్భాల్లో డ్రైనేజీ హోల్స్ మూసుకుపోవడమే అసలు కారణం. ఇంతకీ ఈ సమస్య ఎందుకు వస్తుంది? కారును ఎలా కాపాడుకోవాలంటే..

సన్‌రూఫ్‌లోకి నీళ్లు ఎలా వస్తాయి?

కారు సన్‌రూఫ్ పూర్తిగా వాటర్‌ప్రూఫ్‌గా ఉండదు. గ్లాస్ చుట్టూ ఉన్న రబ్బర్ సీల్‌ను దాటి కొంత నీరు లోపలికి వెళ్లేలా డిజైన్ చేస్తారు. అయితే, ఆ నీరు క్యాబిన్‌లోకి రాకుండా సన్‌రూఫ్ ఫ్రేమ్ చుట్టూ ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. నాలుగు మూలల్లో ఉండే చిన్న రంధ్రాల ద్వారా నీరు ప్రత్యేక పైపుల్లోకి వెళ్లి కారు బయటకు చేరుతుంది. ఈ రంధ్రాలు మూసుకుపోయినప్పుడు నీరు బయటకు వెళ్లలేక క్యాబిన్‌ లోకి వస్తుంది.

డ్రైనేజీ రంధ్రాలు ఎందుకు మూసుకుపోతాయి?

Advertisement

కారు రూఫ్ మీద పేరుకునే దుమ్ము, చెట్ల ఆకులు, పూలు, చిన్న చిన్న చెత్త ముక్కలు డ్రైనేజీ రంధ్రాల్లోకి చేరుతాయి. వర్షం పడినప్పుడు ఇవన్నీ బురదలా మారి నీరు వెళ్లే మార్గాన్ని అడ్డుకుంటాయి. అంతేకాకుండా, కార్ వాష్ సమయంలో ఎక్కువ ఒత్తిడితో వాటర్ ను స్ప్రే చేయడం వల్ల కూడా మురికి లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది.

సన్‌రూఫ్ లీక్ అయితే ఎలాంటి నష్టం?

సన్‌ రూఫ్ నుంచి వచ్చే నీరు మొదట కారు రూఫ్ కు అమర్చిన ఫ్యాబ్రిక్ లైనింగ్‌ను తడిపేస్తుంది. దీంతో మరకలు ఏర్పడటమే కాకుండా అది కిందకు వేలాడే అవకాశం ఉంటుంది. దీని రిపేర్ కోసం వేల రూపాయలు ఖర్చవుతాయి. అంతేకాకుండా నీరు క్యాబిన్ లైట్లు, సన్‌ రూఫ్ మోటార్, ఎలక్ట్రికల్ కనెక్షన్లపై పడితే షార్ట్ సర్క్యూట్ సమస్యలు రావచ్చు. ఫ్లోర్ మ్యాట్ల కింద నీరు చేరితే దుర్వాసన, బూజు ఏర్పడటంతో పాటు కారు బాడీ తుప్పు పట్టే అవకాశం ఉంటుంది.

ఇంట్లోనే సన్‌రూఫ్ డ్రెయిన్లను ఎలా చెక్ చేయాలి?

Advertisement

సన్‌రూఫ్ తెరిచి నాలుగు మూలల్లో ఉన్న డ్రైనేజీ హోల్స్ ను పరిశీలించాలి. కొద్దిగా నీటిని డ్రెయిన్ ఛానెల్‌ లో పోసి చూడండి. నీరు త్వరగా కారు కిందకు వెళ్లాలి. నీరు నిలిచిపోతే లేదంటే నెమ్మదిగా బయటకు వస్తే డ్రెయిన్ మూసుకుపోయినట్లు భావించాలి.

ఈ జాగ్రత్తలు పాటిస్తే లీకేజీ సమస్య ఉండదు!

⦿ సన్‌రూఫ్ మూలల్లో పేరుకున్న ఆకులు, దుమ్మును రెగ్యులర్ గా తొలగించాలి.

⦿ డ్రెయి హోల్స్ శుభ్రం చేయడానికి షార్ప్ ఐరన్ వస్తువులు ఉపయోగించకూడదు.

⦿ హై ప్రెజర్ తో గాలిని పంపించి డ్రెయిన్ పైపులను శుభ్రం చేయకూడదు.

⦿ రబ్బర్ సీల్స్‌ ను ఆరు నెలలకు ఒకసారి శుభ్రం చేసి, అవసరమైతే ఆటోమోటివ్ సిలికాన్ కండిషనర్ ఉపయోగించాలి.

⦿ భారీ వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు సన్‌రూఫ్ డ్రైనేజీ సిస్టమ్ ను చెక్ చేయించాలి.

⦿ సన్‌రూఫ్ లీకేజీని మొదట్లోనే గుర్తిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చు. నీరు కారుతున్నట్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించడం మంచిది.

Read Also: కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

Tags

Related News

కారు వైర్లను ఎలుకలు కొరికేస్తున్నాయా? లక్షల్లో ఖర్చు కాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి!

తక్కువ ధర.. ఎక్కువ రేంజ్.. భారత్‌లో బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

లాంగ్ డ్రైవ్‌ల కోసం బెస్ట్ 5 డీజిల్ SUVలు.. వీటి పవర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

మారుతి బ్రెజ్జా టర్బో 1,200 కి.మీ. రివ్యూ.. మైలేజ్ ఎంత? పనితీరు ఎలా ఉందంటే?

హోండా నుంచి రెండు కొత్త SUVలు.. ఒకటి హైబ్రిడ్, మరొకటి ఎలక్ట్రిక్!

కొత్త ఇన్నోవా టీజర్ విడుదల.. హైక్రాస్ లుక్ కంప్లీట్ గా మారిపోనుందా?

కళ్లుమూసి తెరిచేలోపే వందల కిలోమీటర్ల వేగం.. ప్రపంచంలో టాప్ 5 ఫాస్టెస్ట్ కార్లు ఇవే!

Big Stories

Advertisement
×