IPL 2025 Recharge Plans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఈరోజు నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా క్రికెట్ లవర్స్ కోసం టెలికాం సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలో జియో, ఎయిర్‌టెల్, వీఐ వంటి ప్రముఖ టెలికాం సంస్థలు వినియోగదారులకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచాయి. ఈ నేపథ్యంలో మీ అవసరాలకు అనుగుణంగా సరైన ప్లాన్‌ను ఎంచుకుని, క్రికెట్ మజాను ఆస్వాదించండి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
జియో వినియోగదారులకు ఉచితంగా ఐపీఎల్
జియో వినియోగదారుల కోసం రూ. 949 ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో సాధారణ డేటా, కాలింగ్ ప్రయోజనాలతో పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అదనంగా, ఇప్పటికే యాక్టివ్ ప్లాన్ ఉన్న వినియోగదారులు రూ.100 డేటా ప్యాక్‌తో జియో హాట్‌స్టార్‌కు 90 రోజుల పాటు ఉచిత యాక్సెస్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో 5జీబీ డేటా అందుబాటులో ఉంది. అయితే వాయిస్ కాలింగ్, SMS సౌకర్యం మాత్రం అందించడం లేదు.
JioHotstar అంటే ఏమిటి?
JioCinema Disney+ Hotstar విలీనంతో ఏర్పడిన JioHotstar ఇప్పుడు భారతదేశంలోని ప్రధాన OTT స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. IPL 2025 ప్రసారం పూర్తిగా JioHotstar ద్వారా జరుగుతుండటంతో, ఎక్కువ మంది టెలికాం యూజర్లు తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఈ స్ట్రీమింగ్ సర్వీస్‌ను పొందేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, Airtel, Vi కొత్త అదనపు ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి.
Read Also: Air cooler Offer: రూ.2500కే 40 లీటర్ల టవర్ ఎయిర్ కూలర్..
ఎయిర్‌టెల్ వినియోగదారులకు
ఎయిర్‌టెల్ కూడా తన వినియోగదారులకు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. రూ.100, రూ.195 విలువైన ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా ఐపీఎల్ ప్రేక్షకుల కోసం రూపొందించబడ్డాయి.
అదనంగా ఎయిర్‌టెల్ రూ.549 విలువైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. ఇందులో కాలింగ్, డేటా సౌకర్యాలతో పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
రూ.100 ప్లాన్: 30 రోజుల చెల్లుబాటుతో 5జీబీ డేటా, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్ లేదా SMS సౌకర్యం లేదు.
రూ.195 ప్లాన్: 90 రోజుల చెల్లుబాటుతో 15జీబీ డేటా, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా వాయిస్ కాలింగ్ లేదా SMS సౌకర్యం ఉండదు.
వీ వినియోగదారులకు ఐపీఎల్ స్ట్రీమింగ్ ఆఫర్
వీ (వోడాఫోన్ ఐడియా) కూడా తన వినియోగదారులకు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. రూ.101 విలువైన ఈ ప్లాన్‌లో 5జీబీ డేటా, 3 నెలల జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. కానీ ఈ ప్లాన్‌లో వాయిస్ కాలింగ్ లేదా SMS సౌకర్యం లభించదు.
రూ.239 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా
-అపరిమిత కాలింగ్
-2GB డేటా
-300 SMS
-JioHotstar 28-రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్
-ఇది స్వతంత్ర ప్లాన్ – అదనంగా బేస్ ప్లాన్ అవసరం లేదు
రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ (హై-స్పీడ్ డేటా యూజర్ల కోసం)
-అపరిమిత కాలింగ్
-రోజుకు 2GB డేటా
-రోజుకు 100 SMS
-JioHotstar 28-రోజుల ఉచిత సబ్‌స్క్రిప్షన్
-28 రోజుల చెల్లుబాటు
-ఇది కూడా స్వతంత్ర ప్లాన్ – అదనపు బేస్ ప్లాన్ అవసరం లేదు