BigTV English

Tobacco chewing: బీహార్‌లో అంతే.. వారి ‘ఉమ్ములు’ వెనుక అంత కథ ఉందా?

Tobacco chewing: బీహార్‌లో అంతే.. వారి ‘ఉమ్ములు’ వెనుక అంత కథ ఉందా?

Big Tv Originals: దేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రం ఏది అని లిస్ట్ తీస్తే కచ్చితంగా బీహార్ పేరు వినపడుతుంది. నిరక్షరాశ్యతలో, క్రైమ్ రేటులో బీహార్ టాప్ పొజిషన్ లో ఉంటుంది. అలాంటి బీహార్ ఇంకో విషయంలో కూడా టాపేనండోయ్. పొగాకు వాడకంలో బీహార్ ఇండియాలోనే టాప్ ప్లేస్ లో ఉంది. పాగొకు ఉత్పత్తులు నమలడం, తర్వాత ఉమ్మివేయడంలో బీహారీయులు తమ రికార్డుల్ని తామే బ్రేక్ చేసుకుంటున్నారు. బీహార్ లోని ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా గోడలన్నీ ఖైనీ మరకలతో కంపు కొడుతుంటాయి. ఇక రోడ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ఖైనీ, గుట్కాలు తిని ఉమ్మివేస్తుంటారు బీహారీయులు. ఆ అలవాటుని మాన్పించేందుకు ప్రభుత్వాలు ఎంత కృషి చేస్తున్నా ఫలితం శూన్యం. అంతెందుకు.. ప్రజలకు చెప్పాల్సిన ప్రజా ప్రతినిధులు కూడా ఆ అలవాటుని మానుకోలేని పరిస్థితి. ఎమ్మెల్యేలలో కూడా చాలామందికి ఈ అలవాటు ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధుల విషయానికొస్తే సగానికంటే ఎక్కువమందికి పొగాకు నమిలే అలవాటు ఉంది.


పొగాకు వినియోగదారులు రెండు రకాలుగా ఉంటారు. చుట్ట, బీడీ, సిగరెట్.. ఇలా పొగతాగే అలవాటు ఉండేవారు మొదటి రకం. వీళ్లు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉంటారు. ఫలానా రాష్ట్రంలో ఎక్కువ, ఇంకోచోట తక్కువ అనే భేదాలు ఉండవు. ఇక రెండో రకం పొగాకు ఉత్పత్తులను వాడటం. అంటే గుట్కా, ఖైనీ, తంబాకు, పాన్ మసాలా.. ఇలా పొగాకు ఉప ఉత్పత్తులను తీసుకుని మత్తుకి అలవాటు పడటం. దీనివల్ల మరింత ఎక్కువ ప్రమాదం ఉంటుంది. పొగ తాగితే లంగ్ క్యాన్సర్ వస్తుంది, పొగాకు ఉత్పత్తుల్ని తీసుకుంటే నోటినుంచి మొదలు పెడితే, శరీరంలో అన్ని భాగాలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.

సామాజిక దురలవాటు..
ఇక బీహారీల విషయానికొస్తే అక్కడ పొగాకు నమలడం ఓ సామాజిక అలవాటు. అసలా అలవాటు లేనివారిని అక్కడ వింతగా చూస్తారంటే నమ్మండి. అందుకే టీనేజ్ వచ్చిన వారంతా దీనికి అలవాటు పడతారు, ఆ తర్వాత దీన్ని మానేయమన్నా వారు మానలేరు. ప్రభుత్వ ఆరోగ్య సర్వేల ప్రకారం బీహార్ జనాభాలో 25నుంచి 30శాతం మంది పొగాకు వినియోగిస్తారు. ఇందులో పురుషుల సంఖ్య కాస్త ఎక్కువ. మహిళల్లో కూడా ఈ అలవాటు విపరీతంగా ఉంది. బీహార్ లో ప్రతి ఇద్దరు పురుషుల్లో ఒకరికి ఈ అలవాటు ఉందంటే అతిశయోక్తి కాదు. పొగాకు ఉత్పత్తుల్ని తీసుకునే వీరు ఎక్కడపడితే అక్కడ వాటిని ఉమ్మివేస్తుంటారు. రోడ్లపై, గోడలపై, ప్రభుత్వ భవనాలపై ఈ మరకలు బీహార్ కి మాయని మచ్చలా మారాయి.


అవగాహన లేమి..
బీహార్ లో ఇది సర్వసాధారణ అలవాటుగా మారడానికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో మొదటిది ఇది ఒక సామాజిక అలవాటు. అంటే ఒకరిని చూసి ఇంకొకరు దీన్ని నేర్చుకుంటున్నారు. ఇది తప్పు అని వారికి అస్సలు అనిపించదు. ఇద్దరు ముగ్గురు కలసిన చోట.. గుట్కా, ఖైనీ షేర్ చేసుకోవడం ఇక్కడ కామన్. పెద్దలయినా, పిల్లలయినా, చివరకు తమ కుటుంబ సభ్యులయినా కూడా వారికి మొహమాటాలేవీ ఉండవు. అందరూ సామూహికంగా వీటిని వినియోగిస్తారు. రెండో కారణం అవగాహన లేమి. చాలామందికి ఇది తప్పు అని తెలియదు. దానివల్ల వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన లేదు. ఒకవేళ తెలిసినా, లైట్ తీసుకుంటారు. దాన్ని పెద్ద ప్రమాదంగా గ్రహించరు. దానివల్ల కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోతుందనే విషయం కూడా వారికి అవగాహన ఉండదు. అందుకే గుట్కా అలవాటుని వారు కొనసాగిస్తున్నారు.

నిషేధం ఉన్నా..
మన దగ్గర కూడా గుట్కా, ఖైనీపై నిషేధం ఉంది. కానీ ప్రతి బడ్డీ కొట్టులోనూ, కిరాణా షాప్ లోనూ ఇవి లభిస్తాయి. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ నిషేధాన్ని అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవడంతో గుట్కా ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. బీహార్ లాంటి చోట్ల కూడా చట్టాలు ఉన్నా వాటి అమలు శూన్యం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం చట్టవిరుద్ధం, జరిమానాలు కూడా ఉంటాయి. అయినా కూడా బీహార్ లో ఎవరూ వాటిని పట్టించుకోరు. మనలాగా కాదు, బీహార్ లో ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్ వంటివి తక్కువ రేటుకే విచ్చలవిడిగా దొరుకుతాయి. అందుకే వాటి వాడకం కూడా ఎక్కువ.

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా కూడా ఫలితం శూన్యం. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించడంతోపాటు, జరిమానాలు విధిస్తున్నా కూడా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. చివరకు ప్రభుత్వమే దీనిపై ఫోకస్ తగ్గించింది. బీహారీయులకు ఉన్న ఈ అలవాటు రాష్ట్ర ప్రతిష్టను మాత్రం దెబ్బతీస్తోంది. గుట్కా, ఖైనీ మరకలున్న రోడ్లు, గోడలు, ప్రభుత్వ భవనాలు బీహార్ కి మాయని మచ్చలా మారాయి.

పరువు తీసేస్తున్నారు..
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఈ తుపుక్ తుపుక్ అలవాటుతోనే భారతీయులు ఇతర దేశాల్లో చాలా చోట్ల అవకాశాలు కోల్పోతున్నారట. ఉదాహరణకు కువైట్, దుబాయ్ లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరం. కానీ మనోళ్లు ఊరికే ఉండరు కదా. గుట్కా అలవాటుని మానుకోలేరు, ఎవరూ చూడట్లేదని నిర్థారించుకున్న తర్వాత రోడ్డుపై ఉమ్మివేసే అలవాటుని కూడా వదిలిపెట్టలేరు. అందుకే ఇండియన్స్ అందర్నీ ఇదే గాటన గట్టేసి.. ఆయా దేశాల్లో అవకాశాలివ్వడానికి వెనకాడుతున్నారట. కొన్ని దేశాల్లో ఎక్కడైనా ఉమ్ములు కనిపిస్తే.. కారణం కచ్చితంగా ఇండియనే అని అనుమానిస్తారట. అలా మన గౌరవాన్ని విదేశాల్లో కూడా మంటగలుపుతున్నారు ఈ గుట్కావీరులు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×