iQ00 13 : iQ00 13 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంఛ్ అయింది. ఈ మెుబైల్ ఫీచర్స్ అదిరేలా ఉన్నాయి. ధర సైతం అందుబాటులోనే ఉంది. అయితే అసలు లాంఛ్ అయ్యాక మెుబైల్ టాక్ ఏంటి? ఫీచర్స్ కు ధర తగినట్లు ఉందా? అసలు ఐక్యూ ప్రియులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ఇండియాలో iQOO 13 లాంఛ్ అయ్యి దాదాపు నెలరోజులు గడిచిపోతుంది. అయితే సరికొత్త Oryon CPU, Adreno GPU, Snapdragon 8 Elite చిప్ సెట్ తో వచ్చేసింది. AMOLED డిస్‌ప్లే, అదిరే కెమెరా సెటప్ ఇందులో ఉంది. Snapdragon 8 Elite ప్రాసెసర్ Qualcomm Oryon CPU దాని ముందున్న వాటితో పోలిస్తే ప్రాసెసింగ్ పవర్‌లో 45% బెటర్ గా ఉన్నాయనే చెప్పాలి. 4D గేమ్ వైబ్రేషన్, గేమ్ సూపర్ రిజల్యూషన్, ఎస్పోర్ట్స్ మోడ్ లాంటి టాప్ ఫీచర్స్ ఈ మెుబైల్ లో ఉన్నాయి. ఇక కాల్కమ్ నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చిన స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 చిప్ సెట్ తో వచ్చేసిన ఫస్ట్ స్మార్ట్ ఫోన్ iQ00 13.
iQ00 13 డిజైన్ – ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ డిజైన్ అత్యద్భుతంగా ఉంది. ఫ్లాట్ డిజైన్ తో నాలుగు వైపులా బెజెల్స్ తో ఈ ఫోన్ వచ్చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ లో వాల్యూమ్ రాకర్ తో పాటు స్క్రీన్ కుడి వైపున పవర్ బటన్, మెటల్ ఫ్రేమ్ ఫ్లాట్ ఉంది. 2K రిజల్యూషన్ డిస్ప్లేతో రాబోతున్న ఈ ఫోన్ లో డిస్ ప్లే తో అధునాతనంగా తీర్చిదిద్దారు. iQ00 13 144hz రిఫ్రెష్ రేట్, 6.7 అంగుళాలు స్క్రీన్ తో వచ్చేసింది. గేమింగ్ సెషన్‌లలో కూడా 7K VC కూలింగ్ సిస్టమ్ ఉంది. Qualcomm AI ఇంజిన్ మల్టీమోడల్ Gen AIతో ఎక్కువ ఇన్‌పుట్‌లకు మద్దతు ఇస్తుంది.
కెమెరా – iQOO 13 ట్రిపుల్ కెమెరా సెటప్‌లో వైడ్, టెలిఫోటో, అల్ట్రా వైడ్ స్నాపర్ ఉన్నాయి. ఇందులో మూడు 50MP సెన్సార్లు ఉన్నాయి. ఇది మొబైల్ ఫోటోగ్రఫీలో బెస్ట్ గా నిలుస్తుంది. కానీ Snapdragon 8 Elite AI- పవర్డ్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ (ISP) తో అత్యధ్బుతంగా ఉంది.
కాల్కమ్ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ చిప్ సెట్ తో ఈ ఫోన్ వచ్చేసింది. స్నాప్ డ్రాగన్ 4 లేదా స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ గా పిలిచే సరికొత్త చిప్స్ సెట్ తో వచ్చేసింది. ఇక 16 GB వరకు RAM ఎక్స్టెండ్ చేసుకునే సదుపాయం ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ – బ్యాటరీ లైఫ్ మరొక హైలైట్. స్నాప్‌డ్రాగన్ సామర్థ్యం 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. టాప్-అప్‌ల కోసం 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. ఇక కనెక్టివిటీ పరంగా చూస్తే AI 5G, Wi-Fi 7 ఫీచర్స్ సైతం ఉన్నాయి. iQOO 13 Android 15 ఆధారంగా Funtouch 15 OS తో వచ్చేసింది. నాలుగు ప్రధాన Android OS అప్‌డేట్‌లు, ఐదు సంవత్సరాల భద్రతా ప్యాచ్‌లతో వచ్చేసింది.
ఇక అందుబాటు ధరలోనే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా లాంఛ్ అయిన ఈ మెుబైల్ ను కొనాలనుకుంటే మీరూ ట్రై చేసేయండి.