Allu Arjun: పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఘటన గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఆ ఘటన ఇప్పుడు రోజుకు ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. పుష్ప 2 సినిమా చూడటానికి వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందడం. అలానే తన కొడుకు శ్రీతేజ్ ఇప్పటికీ హాస్పిటల్లో ఉండటం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొద్దిపాటి బాధను మిగిల్చింది. ఇక తమ వలన నష్టపోయిన కుటుంబానికి దాదాపు 25 లక్షల వరకు విరాళంగా ప్రకటిస్తున్నాను. వాళ్ళ మెడికల్ ఖర్చులకు సంబంధించి కూడా నేను చూసుకుంటాను. వాళ్ళ ఫ్యామిలీకి భవిష్యత్తులో కూడా నేనుంటాను అనే భరోసా ఇచ్చారు అల్లు అర్జున్.
అల్లు అర్జున్ ఈ ఘటనపై కొంచెం లేటుగా స్పందించారు. ఈలోపే చాలా వెబ్సైట్లో చాలా కథనాలు కూడా వచ్చేసాయి. ఇక ప్రస్తుతం ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి చంచల్గూడా జైలుకు తరలించారు. 14 రోజులపాటు రిమాండ్ లో ఉండవలసి వస్తుంది అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈలోపే అల్లు అర్జున్ కు ఉన్న సర్కిల్ వలన కేవలం 24 గంటల్లోనే మద్యంతర బెయిల్ కూడా అల్లు అర్జున్ కు వచ్చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత చాలామంది తెలుగు సినిమా ప్రముఖులంతా అల్లు అర్జున్ ని తన నివాసం వద్ద నేరుగా కలిసి పలకరించారు. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్రమైన కలకలం రేపింది. అల్లు అర్జున్ ని ఒక కేసు నిమిత్తం అరెస్టు చేశారు. ఆ తర్వాత తను ఇంటికి రావడం జరిగింది. అయితే ఈ తరుణంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్లి పలకరించడం అనేది పద్ధతే, కానీ ఆ వీడియోలను సైతం లైవ్ టెలికాస్ట్ చేపించేలా ప్లాన్ చేశారు అల్లు అర్జున్ టీం. ఇప్పుడు అదే వాళ్ళ పాలిట శాపంగా మారింది.
ఒక కుటుంబం రోడ్డున పడిపోయి ఆ వ్యక్తిని కోల్పోయిన కూడా హాస్పిటల్ కి వెళ్లి పలకరించినటువంటి సినిమా ప్రముఖులు ఇలా ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు. అల్లు అర్జున్ కు ఏమైనా కాళ్లు పోయిందా.? కన్ను పోయిందా.? అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈరోజు మాట్లాడారు. ఆ తరువాత ఎంఐఎం ఎమ్మెల్యే అజారుద్దీన్ కూడా అల్లు అర్జున్ పైన తీవ్రమైన కామెంట్లు చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పైన చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటన్నిటి పైన స్పందిస్తూ అల్లు అర్జున్ నేడు మీడియాతో మాట్లాడనున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడు అని చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతానికి కోర్టులో నడుస్తూ ఉంది. ఈ తరుణంలో అల్లు అర్జున్ మాట్లాడటం వలన ఆ మాటల్లో ఏమైనా తప్పిదాలు దొర్లితే కేసు ఇంకొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉంది. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా అంత ఈజీగా ఈ కేసును వదిలేటట్టు కనిపించడం లేదు. అయితే అల్లు అర్జున్ మీడియాతో ముచ్చటించిన తర్వాత ఈ కేస్ ఎటువంటి మలుపులు తిరుగుతుందో అని కొంతమందికి క్యూరియాసిటీ కూడా ఉంది.
Also Read: CM Revanth Reddy – Allu Arjun : అంత ఈజీగా అబద్ధాలు ఎలా ఆడుతున్నావ్ అన్న