iQOO 13 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో కు సబ్ బ్రాండ్ అయినా ఐక్యూ త్వరలోనే మరో కొత్త మొబైల్ ను లాంఛ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతున్న ఈ మొబైల్ ఎప్పుడెప్పుడు వస్తుందో అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్తూ ఐక్యూ 13 రిలీజ్ డేట్ ను ఆ సంస్థ వెల్లడించింది. ఈ మొబైల్ డిసెంబర్లో మార్కెట్లోకి రానుందని తెలిపింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలని ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది చివరలో ఐక్యూ, సామ్ సాంగ్, వివో నుంచి బెస్ట్ మొబైల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఈ నెలలో Oppo Find X8 series, Realme GT 7 Pro, Asus ROG Phone 9 series, iQOO 13 మెుబైల్స్ రాబోతున్నాయి. వివో, సామ్ సాంగ్ మొబైల్స్ సైతం బెస్ట్ వెర్షన్ లో రాబోతున్న నేపథ్యంలో ఐక్యూ సైతం డిసెంబర్లో ఐక్యూ 13 మొబైల్ ను లాంఛ్ చేయనున్నట్లు తెలిపింది.
ఐక్యూ మెుబైల్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఈ సంస్థ.. తాజాగా మరో కొత్త మొబైల్ లాంఛింగ్ కు సిద్ధమైంది. iQOO 13ను డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 30న చైనాలో ఈ మెుబైల్ ను లాంఛ్ చేసిన ఐక్యూ భారత్ లో ఈ ఏడాది చివరలో లాంఛ్ చేస్తుంది. ఈ మెుబైల్ ఫీచర్స్ సైతం అద్భుతంగా ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 చిప్‌సెట్‌తో రాబోతుంది. 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, BOEతో తయారైన సరికొత్త ప్యానల్ ను జోడించారు.
ALSO READ : గ్జియోమీ అరాచకం.. రూ. 8499కే అదిరే ఫీచర్ మెుబైల్ లాంఛ్.. మార్కెట్లోకి వచ్చేది ఆ రోజే
iQOO 13 మెుబైల్ 16GB RAM + 512GB స్టోరేజ్ తో రాబోతుంది. ఇక పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌కు బదులు మూడు 50MP సెన్సార్స్ తో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వచ్చేస్తుంది. ప్రైమరీ లెన్స్, అల్ట్రా వైడ్, 2x టెలిఫోటో లెన్స్ తో పాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 MP ఫ్రంట్ కెమెరా సైతం కలిగి ఉంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6150mAh బ్యాటరీ ఉంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్ ను కలిగి ఉంది. ఈ మెుబైల్ లో మెటల్ ఫ్రేమ్, స్టైలిష్ హాలో లైట్ స్ట్రిప్ కూడా ఉంది. ధర సైతం ఫీచర్స్ కు తగినట్లే ఐక్యూ నిర్ణయించింది.
ఇక ఈ మెుబైల్ ధర ఇప్పటికీ తెలియనప్పటికీ రూ. 55వేలు ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఐక్యూ నుంచి వచ్చిన మొబైల్స్ తో పోలిస్తే ఐక్యూ 13లో లేటెస్ట్ అప్డేట్స్ ఉండనున్నాయి. ఇక ఏది ఏమైనా ఐక్యూ తీసుకొస్తున్న ది బెస్ట్ మొబైల్స్ లో ఐక్యూ 13 ఒకటని తెలుస్తోంది.