Bowel Cancer: మనిషి జీర్ణ వ్యవస్థలో పేగు అనేది కీలకపాత్ర పోషిస్తుంది. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి, శరీరానికి పోషకాలను అందించడంలో ఉపయోగపడుతుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పేగు క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది. ప్రతి ఏటా వేలాది మంది ఈ వ్యాధితో చనిపోతున్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్(IARC) నివేదిక ప్రకారం రానున్న కాలంలో ఈ సమస్య మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది. 2020 నుంచి 2040 వరకు రెండు దశాబ్దాల కాలంలో ఏకంగా 50 శాతానికి పైగా పేగు క్యాన్సర్ వ్యాధులు పెరుగుతాయని తేల్చింది. ఏడాదికి సుమారు 3 మిలియన్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వీలైనంత వరకు ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడంతో పాటు వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పేగు క్యాన్సర్ నిర్మూలన ఎలా?
పేగు క్యాన్సర్ నివారణలో ఆహారపు అలవాట్లు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. వీలైనంత వరకు తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలంటున్నారు. రెడ్ మీట్ తగ్గించడంతో పాటు చికెన్, చేపలు తీసుకోవడం మంచిదంటున్నారు. పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలంటున్నారు.
వ్యాయామంతో పేగు క్యాన్సర్ కు చెక్
పేగు క్యాన్సర్ నిర్మూలనలో వ్యాయామం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. రోజూ రెండుసార్లు వాకింగ్ చేయడం వల్ల పేగు క్యాన్సర్ ముప్పు తగ్గుతుందంటున్నారు. అంతేకాదు, ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్(WCRF) చేసిన పరిశోధన ప్రకారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో చురుకుగా ఉండం వల్ల పెద్దపేగు క్యాన్సర్ దరిచేరదని తేలింది. బ్రేక్ ఫాస్ట్ కు ముందు, రాత్రి భోజనానికి ముందు వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు. అంతేకాదు, రాత్రిపూట నిద్రకు ముందు వాకింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుందంటున్నారు. కదలకుండా కూర్చునే వారితో పోల్చితే, చురుగ్గా పని చేసే వారిలో పేగు క్యాన్సర్ ముప్పు చాలా తక్కువగా ఉందని తేలింది. “శారీరకంగా చురుగ్గా ఉండటం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యుకెలో పేగు క్యాన్సర్ సాధారణంగా మారిపోయింది. ప్రతి ఏటా 44 వేల కేసులు నమోదు అవుతున్నాయి” అని WCRF అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ హెలెన్ క్రోకర్ తెలిపారు.
Read Also: రాత్రిళ్లు ఫోన్ చూస్తున్నారా? ఇక ‘అది’ కష్టమే.. మరిచిపోండి, ఎవరు చెప్పినా వినరు కదా!
వర్కౌట్స్ కంటే వాకింగ్ బెస్ట్!
జర్మనీలోని రీజెన్స్ బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు మైఖేల్ లీట్జ్ మాన్ పేగు క్యాన్సర్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. “పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి శారీరక శ్రమ చాలా ముఖ్యం. అందుకే, చాలా మంది వర్కౌట్స్ చేస్తారు. కానీ, నడక అనేది ఈ సమస్యను మరింత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది. ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే వీలైనంత ఎక్కువగా నడవాలి” అని మైఖేల్ సూచించారు.
Read Also: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?