Redmi A4 5G : ఎప్పుడెప్పుడా అంటూ టెక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెడ్ మీ A4 5G (Redmi A4 5G) మొబైల్ లాంఛ్ తేదీని తాజాగా గ్జియోమీ కంపెనీ వెల్లడించింది. ఈ ఫోన్ నవంబర్ 20న మార్కెట్లోకి రానందని ఆ సంస్ధ తెలిపింది. ఈ మెుబైల్ తో పాటు Redmi Note 14 సిరీస్ సైతం డిసెంబర్లో మార్కెట్లోకి రాబోతున్నట్లు గ్జియోమీ వెల్లడించి టెక్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పేసింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ గ్జియోమీ అతి తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేస్తుంది. రెడ్ మీ A4 5G మొబైల్ ను తీసుకురానున్నట్టు గత నెలలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో తెలిపింది. అయితే ఈ మొబైల్ తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ తో రాబోతుందని గ్జియోమీ అప్పుడే వెల్లడించింది. ఇక ఈ మొబైల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వినియోగదారులకు గుడ్ న్యూస్ చెబుతూ ఈ నెల 20వ తారీఖున మొబైల్ మార్కెట్ లోకి లాంఛ్ కానుందని చెప్పేసింది.
Redmi A4 5G మెుబైల్ Snapdragon 4s Gen 2తో రాబోతుంది. ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. Redmi A4 5G ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీను కలిగి ఉండనుంది. ఈ మెుబైల్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో రాబోతుంది. బ్యాటరీ 18W వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 50MP ప్రైమరీ రియర్ సెన్సార్, 8MP సెల్ఫీ షూటర్‌తో రాబోతుంది. ఇందులో HyperOS 1.0 తో Android 14లో రన్ అవుతుందని.. ఇందులో హై సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైతం ఉంది.
ALSO READ : ఇచ్చిపడేసిన అమెజాన్.. తాజాగా లాంఛ్ అయిన ఫోన్ పై ఏకంగా రూ.45వేల డిస్కౌంట్
ఇక ఈ మెుబైల్ ధర రూ.10వేలలోపే ఉంటుందని ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో తెలిపిన గ్జియోమీ.. ఆ మాట ప్రకారం అతి తక్కువ ధరకే మెుబైల్ ను లాంఛ్ చేస్తుంది. ఇందులో రూ. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 8,499గా నిర్ణయించింది. ఇక ఈ మెుబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్స్ సైతం అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది.
ఇక Redmi Note 14 సిరీస్ సైతం డిసెంబర్ లో మార్కెట్లోకి రాబోతున్నట్లు గ్జియోమీ తెలిపింది. Redmi Note 14 Pro+, Note 14 Pro అధునాతన ఫీచర్స్ తో రాబోతున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల OLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 3 Dimensity 7300 Ultra చిప్‌సెట్ తో మెుబైల్ ను తీసుకొస్తుంది గ్జియోమీ. ఈ రెండు మోడల్ మెుబైల్స్ లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. Note 14 Pro+ 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ టెలిఫోటో కెమెరాతో రాబోతుంది. ప్రో+ మోడల్‌లో 6,200mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఉంది. అయితే ప్రో మోడల్‌లో 5,500mAh బ్యాటరీ 44W ఛార్జింగ్ సదుపాయం ఉంది.