iQOO Neo 10| ఐకూ (iQOO) సంస్థ భారతదేశంలో తమ కొత్త స్మార్ట్‌ఫోన్ ఐకూ నియో (iQOO Neo)10ని విడుదల చేసింది. ఇది Neo 10 సిరీస్‌లో భాగంగా వచ్చిన కొత్త మోడల్, అలాగే Neo 7 తర్వాత మళ్లీ వచ్చిన వనిల్లా మోడల్. ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్‌తో ధూళి, నీటి నిరోధకత, 7,000mm² వేపర్ కూలింగ్ చాంబర్ వంటి అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 8.09mm, బరువు 206 గ్రాములు.
ధర వివరాలు
iQOO Neo 10 ధరలు ఇలా ఉన్నాయి:
8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 31,999
8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 33,999
12GB RAM + 256GB స్టోరేజ్: రూ. 35,999
16GB RAM + 512GB స్టోరేజ్: రూ. 40,999
కొన్ని బ్యాంక్ కార్డులతో రూ. 2,000 తగ్గింపు ఉంది. ఈ ఫోన్ ఇన్‌ఫెర్నో రెడ్, టైటానియం క్రోమ్ అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. మే 26, 2025 నుండి ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది, మరియు జూన్ 3 నుండి అమెజాన్, iQOO ఇండియా ఈ-స్టోర్‌లలో అమ్మకాలు మొదలవుతాయి. ప్రీ-బుకింగ్ చేసినవారికి iQOO TWS 1e ఉచితంగా లభిస్తుంది.
ఫీచర్లు
iQOO Neo 10లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్, 5,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, 4,320Hz PWM డిమ్మింగ్‌ని అందిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, Q1 గేమింగ్ చిప్‌తో నడుస్తుంది. ఈ ఫోన్‌లో 16GB LPDDR5X RAM, 512GB UFS 4.1 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 (FuntouchOS 15) ఉన్నాయి.
కెమెరా విషయానికొస్తే, ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ కంపెనీ ప్రైమరీ సెన్సార్ (OIS, f/1.79 అపెర్చర్), అలాగే 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ (f/2.2) ఉన్నాయి. ముందువైపు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా (f/2.45) ఉంది. రెండు కెమెరాలు 4K వీడియోని 60fpsలో రికార్డ్ చేయగలవు.
గేమింగ్ కోసం, 7,000mm² వేపర్ కూలింగ్ చాంబర్, 144fps గేమింగ్ సపోర్ట్, బైపాస్ ఛార్జింగ్, 3,000Hz టచ్ శాంప్లింగ్ రేట్, మరియు నైట్ విజన్ మోడ్ ఉన్నాయి. 7,000mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP65 రేటింగ్ ఉన్నాయి. ఇందులో బ్లూటూత్ 5.4, 5G, వై ఫై 7 (Wi-Fi 7), యుఎస్‌బి టైప్ సి (USB Type-C), జిపిఎస్ (GPS), ఎన్ఎఫ్‌సి (NFC), వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.
Also Read: ఫొటో స్కామ్.. ఫొటో డౌన్ లోడ్ చేస్తే బ్యాంకు అకౌంట్ ఖాళీ..
ఈ స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్, అద్భుతమైన డిస్‌ప్లే, గేమింగ్ తో ఫోటోగ్రఫీ ప్రియులకు అనువైన ఫీచర్లతో మంచి ఎంపికగా నిలుస్తుంది.