BigTV English

Tollywood: ఒకే నెలలో హీరో – హీరోయిన్ పెళ్లి.. జంటగా మాత్రం కాదండోయ్..!

Tollywood: ఒకే నెలలో హీరో – హీరోయిన్ పెళ్లి.. జంటగా మాత్రం కాదండోయ్..!

Tollywood: ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు మరో హీరో, హీరోయిన్ పెళ్లికి సిద్ధమవుతుండడంతో వారి అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అయితే హీరో , హీరోయిన్ పెళ్లి ఒకే కానీ జంటగా మాత్రం కాదు.. వీరిద్దరూ కూడా విడివిడిగా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోబోతున్నారు. మరి ఆ హీరో, హీరోయిన్ ఎవరు? ఎప్పుడు వారి పెళ్లి? అనే విషయం ఎప్పుడు చూద్దాం..


పెళ్లి పీటలెక్కనున్న అయ్యగారు..

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లికి సిద్ధమయ్యారు. గత ఏడాది నాగచైతన్య(Naga Chaitanya), శోభిత ధూళిపాల (Shobhita dhulipala) పెళ్లి సమయంలో వీరు ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇప్పుడు వివాహ ముహూర్తం ఖరారయింది. జూన్ 6వ తేదీన అక్కినేని అఖిల్ వివాహం జరగబోతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ప్రముఖ బిజినెస్ మాన్ జుల్ఫీ రవ్ డ్జీ వారసురాలు జైనబ్ తో అఖిల్ ఏడడుగులు వేయబోతున్నారు. ఇకపోతే గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా.. ఇప్పుడు పెళ్లి పీటలెక్క బోతున్నట్లు సమాచారం. అంతేకాదు నాగార్జున రెసిడెన్సి లోనే ఈ వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అఖిల్ అక్కినేని ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.


పెళ్లి పీటలెక్కనున్న రామ్ చరణ్ బ్యూటీ..

రామ్ చరణ్ (Ram Charan) కెరియర్ లో కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిన సినిమాలలో ‘ఆరెంజ్’ కూడా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) అద్భుతంగా తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ లో రామ్ చరణ్ – జెనీలియా జంటగా నటించారు. అలాగే మరో హీరోయిన్ గా షాజాన్ పదం సీ (Shazahn Padamsee) నటించింది. సినిమాల్లో బాగా హైలైట్ గా నిలిచిన పాత్రలలో ఈమె కూడా ఒకటి. ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ ప్రియురాలు రూబా గా ఒదిగిపోయింది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారును ఆకట్టుకుంది. మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె “రాకెట్ సింగ్ : సేల్స్ మాన్ ఆఫ్ ది ఇయర్” సినిమాతో చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత కనిమొళి అనే తమిళ చిత్రంలో నటించిన ఈమె అక్కడ తన నటనతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగులో ఆరెంజ్ తర్వాత విక్టరీ వెంకటేష్ (Venkatesh) , రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్లో వచ్చిన ‘మసాలా’ సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఆ తర్వాతే ఇండస్ట్రీకి దూరమై బాలీవుడ్ వైపు అడుగులు వేసింది . ప్రస్తుతం ఈమె కూడా ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈమె తన ప్రియుడు వ్యాపారవేత్త అయిన ఆశిష్ కనకియా తో ఏడు అడుగులు వెయ్యబోతోంది. గత ఏడాది నవంబర్లో ఆశిష్ తనకు ప్రపోజ్ చేసినట్లు తెలిపిన ఈమె.. ఈ ఏడాది జనవరిలో రోకా వేడుక ఘనంగా జరుపుకున్నారు . ఇక జూన్ లో వీరి పెళ్లి వేడుక జరగనున్నట్లు సమాచారం.
ఇలా మొత్తానికి అయితే హీరో, హీరోయిన్ జూన్ నెలలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ALSO READ:Aamir Khan: ఓటీటీలను బాయ్ కాట్ చేసిన అమీర్ ఖాన్… ఇండస్ట్రీలో ఇది గ్రేట్ డెసిషన్.!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×