BigTV English

iQOO Z10 5G launch: బడ్జెట్ ధరకు బాహుబలి ఫోన్లు..స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్ల పండుగ!

iQOO Z10 5G launch: బడ్జెట్ ధరకు బాహుబలి ఫోన్లు..స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ ఫీచర్ల పండుగ!

iQOO Z10 5G launch: స్మార్ట్ ప్రియులకు మరో కీలక అలర్ట్ వచ్చేసింది. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో iQOO బ్రాండ్ ఈసారి పాపులర్ Z సిరీస్‌ నుంచి రెండు కొత్త iQOO Z10 5G, iQOO Z10x 5G ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లు కొత్త డిజైన్, పెద్ద బ్యాటరీ, టాప్ క్లాస్ ప్రాసెసర్, మల్టీ-లెన్స్ కెమెరాలతో టెక్ ప్రియుల మనసు దోచేలా ఉన్నాయి. అనేక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్లు బడ్జెట్ ధరల్లో వస్తుండటం విశేషం. అయితే ఈ రెండు ఫోన్‌ల ప్రత్యేకతలు, ధరలు, లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


iQOO Z10 5G
-Z10 5G పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, వేగవంతమైన చిప్‌సెట్‌తో పాటు స్టైలిష్ లుక్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది.
-6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే
-120Hz రిఫ్రెష్‌రేట్
-అత్యధికంగా 5,000 నిట్‌ల బ్రైట్‌నెస్. ఇది హైసన్ లైటింగ్ కండిషన్లలోనూ క్లియర్ విజిబిలిటీని అందిస్తుంది

ప్రాసెసర్, బ్యాటరీ & ఛార్జింగ్
-Qualcomm Snapdragon 7s Gen 3 చిప్‌సెట్ – గేమింగ్, మల్టీటాస్కింగ్‌కి సిద్ధం!
-7,300mAh బ్యాటరీ – ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు చక్కగా పని చేసేలా ఉంటుంది
-90W ఫాస్ట్ ఛార్జింగ్ – వేగంగా ఛార్జ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది


కెమెరా సెటప్
-వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా – డే లైట్, నైట్ ఫొటోగ్రఫీకి అదుర్స్
-ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా
-కెమెరా సెటప్‌కి సహాయంగా ఉండే AI ఫీచర్లు & పోర్ట్రెయిట్ మోడ్

అదనపు ఫీచర్లు
-In-display Fingerprint Sensor – స్మూత్ & సురక్షితమైన అనుభవం
-IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
-Android 15 OS తో ఫన్‌టచ్ UI 15 – క్లీనర్, కస్టమైజబుల్ ఇంటర్‌ఫేస్

ధరలు
-128GB వేరియంట్ – రూ.21,999
-256GB వేరియంట్ – రూ.25,999

-లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.2,000 తగ్గింపు అందుబాటులో ఉంది
-రంగులు: గ్లేసియర్ సిల్వర్, స్టెల్లర్ బ్లాక్

Read Also: YouTube AI Music Tool: వాయిస్ నీది, బీట్ …

iQOO Z10x 5G
Z10x 5G చిన్న స్క్రీన్‌తో, తక్కువ ధరతో వచ్చినప్పటికీ, మంచి ఫీచర్లను ప్యాక్ ద్వారా వచ్చింది. ఇది తక్కువ బడ్జెట్ వినియోగదారులకు పర్‌ఫెక్ట్ ఆప్షన్.

డిస్‌ప్లే:
-6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే
-కాంపాక్ట్ & హ్యాండీ – వన్ హ్యాండ్ యూజ్‌కు అనుకూలంగా

ప్రాసెసర్, బ్యాటరీ & ఛార్జింగ్:
-MediaTek Dimensity 7300 చిప్‌సెట్ – డైలీ యూజ్, స్ట్రీమింగ్, లైట్ గేమింగ్‌కు సరిపోతుంది
-6,500mAh బ్యాటరీ – లాంగ్ లాస్టింగ్ పెర్ఫార్మెన్స్
-44W ఫాస్ట్ ఛార్జింగ్ – తక్కువ టైంలో ఎక్కువ ఛార్జ్

కెమెరా సెటప్:
-వెనుక 50MP ప్రధాన కెమెరా
-ముందు 8MP సెల్ఫీ కెమెరా – క్లియర్ వీడియో కాల్స్ & సోషల్ మీడియా కోసం సరైనది

అదనపు ఫీచర్లు:
-IP64 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
-Android 15 ఆధారిత FunTouch OS 15

ధరలు:
-బేసిక్ వేరియంట్ రూ.13,499 నుంచి ప్రారంభం
-లాంచ్ ఆఫర్‌ క్రింద రూ. 1,000 తక్షణ క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది

-రంగులు: అల్ట్రామెరైన్ బ్లూ, టైటానియం గ్రే

అందుబాటులో ఉండే తేదీ & అమ్మకాల వివరాలు
ఈ రెండు డివైస్‌లు ఏప్రిల్ 16, 2025 నుంచి Amazon India, iQOO అధికారిక eStoreలో అందుబాటులో ఉంటాయి. ముందస్తుగా బుకింగ్ చేసుకునే వారికి బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉంటాయి.

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×