Arjun S/o Vyjayanthi Trailer : ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సినిమా ట్రైలర్ ఈవెంట్ ను నేడు నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విజయశాంతి కీలకపాత్రలో కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో కనిపిస్తున్నారు. విజయశాంతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని లేడీ సూపర్ స్టార్ అని అనిపించుకున్నారు. ఇప్పుడు చాలా ఏళ్లు తర్వాత మళ్లీ తెలుగు స్క్రీన్ పై పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. తన కొడుగ్గా అర్జున్ విశ్వనాథ్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. ఇది ఒక పవర్ఫుల్ స్టోరీ ఉన్న పోలీస్ సినిమా అని అనిపిస్తుంది. ఇదివరకే కళ్యాణ్ రామ్ చేసిన పటాస్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ పోలీస్ పాత్రలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కనిపిస్తున్నారు.
ట్రైలర్ టాక్
ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ట్రైలర్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. మామూలుగా పోలీస్ సినిమాల్లో ఉండే హై ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఈ సినిమాలో ఉండేటట్లు ప్లాన్ చేశాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. కేవలం పోలీస్ స్టోరీ మాత్రమే కాకుండా ఒక మదర్ సెంటిమెంట్ ఉన్న స్టోరీగా కూడా ఇది కనిపిస్తుంది. శ్రీకాంత్ వాయిస్ ఓవర్ తో యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. అర్జున్ ఎలివేషన్ తో ఈ ఈ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ అంచనాలు క్రియేట్ చేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు క్రిమినల్ అవడం ఏంటి అనే క్వశ్చన్ తో ట్రైలర్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఎండా వానా…రాత్రి పగలు…ఎప్పుడైనా రా నీకు నీ చావుకి మధ్యలో సముద్రం ఒక్కటే అడ్డం! అని కళ్యాణ్ రామ్ అని చెప్పి డైలాగ్ మంచి హై ఇస్తుంది.
Also Read : Aishwarya Rajesh : హిట్ ని ఇలా వాడేస్తుంది… ఒక్క షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తే ఎన్ని కోట్లంటే?
పాజిటివ్ వైబ్స్
ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విజయశాంతి కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం విజయశాంతి నాలుగు నెలల వరకు టైం అడిగి దాదాపు 6 నుంచి 10 కిలోల వరకు బరువు కూడా తగ్గారట. సినిమా మీద ఇంత డెడికేషన్ ఉన్న యాక్టర్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆ లిస్టులో ఈ ఏజ్ లో కూడా లేడీస్ సూపర్ స్టార్ తన డెడికేషన్ చూపించటం అనేది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకులు ముందుకు రానుంది. బింబిసారా బింబిసారా తర్వాత ఇప్పటివరకు హిట్టు లేని కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ఏ స్థాయి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.