OTT Movie : థియేటర్లలో వచ్చిన సినిమాలు ఓటిటిలో దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఈ సినిమాలోని చూసుకుని ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఎడారిలో దాగివున్న ఒక నిధి చుట్టూ తిరుగుతుంది. అక్కడ నిధి కోసం గుంతలు తవ్వుతూ ఉంటారు. ఈ సినిమా లో ఎక్కువగా చిన్న పిల్లలే ఉంటారు. ఇది సిటీకి దూరంగా ఉండే జువైనల్ హోమ్ లో జరుగుతూ ఉంటుంది. చివరి వరకు ఈ మూవీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
యూట్యూబ్ (Youtube) లో
ఈ అమెరికన్ కామెడీ డ్రామా మూవీ పేరు ‘హోల్స్’ (Holes). దీనికి ఆండ్రూ డేవిస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సిగౌర్నీ వీవర్, జోన్ వోయిట్, ప్యాట్రిసియా ఆర్క్వేట్, టిమ్ బ్లేక్ నెల్సన్, ఎర్తా కిట్, ఖ్లియో థామస్, డ్యూలే హిల్ నటించారు. ఈ సినిమా స్టాన్లీ యెల్నాట్స్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇందులో స్టాన్లీ యెల్నాట్స్ దొంగతనానికి పాల్పడినట్లు తప్పుగా ఆరోపిస్తారు. ఆ తర్వాత టెక్సాస్‌లోని బాల్య నిర్బంధ శిబిరం అయిన గ్రీన్ లేక్‌కి పంపిస్తారు. అక్కడ అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
స్టాన్లీ కుటుంబంలో ఉన్న ఒక శాపం కారణంగా, అతను కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటాడు. ఒక రోజు అతను స్నీకర్లు దొంగిలించినట్లు తప్పుగా ఆరోపణ ఎదుర్కుంటాడు. అది నిజమేనని నమ్మి అతనిని Green Lake అనే జువెనైల్ డిటెన్షన్ క్యాంప్‌కు పంపిస్తారు. అక్కడ, అతనితో పాటు ఇతర బాలురు కూడా, ఎడారిలో రోజూ రంధ్రాలు తవ్వవలసి ఉంటుంది. ఇది క్యాంప్ వార్డెన్ పర్యవేక్షణలో జరుగుతుంది. అతను చాలా క్రూరమైన వాడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పించు కుని పోయే సమస్యే లేదు. ఎందుకంటే ఆ ప్రాంతం సిటీ కి చాలా దూరంలో ఉంటుంది. ఇప్పుడు అందులో ఉన్న పిల్లలు అక్కడ గుంటలు తవ్వడం మొదలు పెడతారు. ఈ తవ్వకం వెనుక ఒక ఏదో రహస్యం ఉందని స్టాన్లీ కనుగొంటాడు. వార్డెన్ ఒక దాచిన సంపద కోసం ఇలా తవ్విస్తుంటాడు. స్టాన్లీ తన స్నేహితుడు Zero తో కలిసి క్యాంప్ నుండి తప్పించుకుంటాడు. వారు కలిసి ఈ రహస్యాన్ని కనిపెట్టడానికి వెళతారు. స్టాన్లీ పూర్వీకుల శాపం కూడా, ప్రస్తుత పరిస్థితులతో అల్లుకుపోతుంది. స్టాన్లీ అక్కడ కొన్ని సాహసాలు చేస్తాడు. చివరికి స్టాన్లీ అక్కడ దాగి ఉన్న సంపదను కనుగొంటాడా ? స్టాన్లీ తన కుటుంబంలో ఉన్న శాపానికి విరుగుడు కనిపెడతాడా ? వార్డెన్ వల్ల అక్కడ ఏం సమస్యలు వస్తాయి ? అనే ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒక్కొక్కరు కాదు ఒకే సారి ఐదు మంది… ఆగలేక అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయి