Ind vs Eng, 4th T20I: Ind vs Eng, 4th T20I: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇవాళ నాలుగో టీ 20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగో టీ 20 మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ మొదటి నుంచి చూస్తే… టీమిండియా కచ్చితంగా ఓడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్లు అందరూ మ్యాజిక్ చేశారు. దీంతో… ఉత్కంఠంగా మారిన… నాలుగో టి20 మ్యాచ్… టీమిండియా చేతిలోకి వెళ్ళింది. నాలుగో t20 మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టి… సిరీస్ కూడా కైవసం చేసుకుంది టీమిండియా. T20 సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే పాకిస్థాన్ టీం ఇదే.. కెప్టెన్ ఎవరంటే ?
ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేసింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా… నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది. ఈ టార్గెట్ ఇంగ్లాండ్ ప్లేయర్ల ముందు పెట్టేందుకు చాలా కష్టాలు పడింది టీమిండియా. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మ ఇద్దరు డక్ అవుట్ అయినప్పటికీ… ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే… ఇద్దరు దుమ్ము లేపారు. ఇద్దరు చలో 53 పరుగులు చేసి… టీమిండియా కు ఆ మాత్రం స్కోర్ అందించగలిగారు.
అయితే… ఆ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు టీమిండియా బౌలర్లు కూడా చాలా బ్రహ్మాండంగా బౌలింగ్ చేయడం జరిగింది. దీంతో 19.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయింది. 166 పరుగులకు చాప చుట్టేసింది ఇంగ్లాండు. దీంతో… టి20 సిరీస్ ను 3-1 తేడాతో గెలుచుకుంది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ లో… చివరి క్షణంలో శివం దుబే స్థానంలో జట్టులోకి వచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా…. అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా లివింగ్ స్టన్ వికెట్ తీసిన తర్వాత గౌతమ్ గంభీర్… సెలబ్రేషన్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
Also Read: Ind vs Eng, 4th T20I: టాస్ ఓడి బ్యాటింగ్ చేయనున్న టీమిండియా..రింకూ ఇన్.. షమీ అవుట్ !
ఎందుకంటే హర్షిత్ రానా… జట్టులోకి తీసుకురావాలని బీసీసీఐ తో గొడవపడ్డారట టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కానీ చాలామంది హర్షిత్ రానా ను వ్యతిరేకించారు. కానీ చివరికి గౌతమ్ గంభీర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈ తరుణంలోనే ఇంగ్లాండ్ టూర్ కు హర్షిత రానా సెలెక్ట్ అయ్యాడు. అయితే ఇవాల్టి మ్యాచ్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో… గౌతమ్ గంభీర్ చాలా ఖుషి గా కనిపించాడు. నేను సెలెక్ట్ చేసిన బౌలర్ అంటే ఇలాగే ఉంటుందని… చెప్పుకుని చెప్పాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. దీంతో హర్షిత్ రానా ను వ్యతిరేకించిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య చిట్టచివరి t20 మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. ఈ టి20 సిరీస్ అయిపోయిన తర్వాత… ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేల సిరీస్ కూడా ప్రారంభం కానుంది.
Gandbhir reaction:-
When harshit Rana When dube
Took wicket😍 scored 50🤢 pic.twitter.com/ojOQNxYxGm— Prdp (@Pradip_again) January 31, 2025
Harshit Rana, the concussion substitute for Shivam Dube, strikes with his 2nd ball in T20I cricket 🔥
Liam Livingstone departs for 9⃣
📸: Disney+Hotstar#INDvsENG #HarshitRana #LiamLivingstone #CricketTwitter pic.twitter.com/x2iJ3udYvv
— InsideSport (@InsideSportIND) January 31, 2025