Big Stories

Shivam Dube : టీ 20 వరల్డ్ కప్‌కు శివమ్‌ను ఎంపిక చేయండి.. అగార్కర్ కు రైనా విన్నపం

Shivam Dube : జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ 20 వరల్డ్ కప్ ప్రాబబుల్స్ ఎంపిక చేసే సమయం దగ్గరలోనే ఉంది. ఎందుకంటే వరల్డ్ కప్ నకు ముందుగానే, అంటే మే మొదటి వారంలో ప్రపంచకప్ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ సమయంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ ప్రధాన ఆయుధంగా మారిన హార్డ్ హిట్టర్ శివమ్ దుబెను ఎంపిక చేయమని సురేశ్ రైనా ఏకంగా అగార్కర్ కు విన్నవించడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

- Advertisement -

ఒక జట్టు గెలవచ్చు, లేదా ఓడవచ్చు. కానీ అందులో కొందరి ఆటగాళ్ల ఆటతీరు మాత్రం చాలామందికి నచ్చుతుంటుంది. అలాంటి వారిలో శివమ్ దుబె ఒకరని చెప్పాలి. ఐపీఎల్ 2024 సీజన్ మొదలైన దగ్గర నుంచి తన దూకుడైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆల్రడీ బీసీసీఐ సెలక్టర్ అజిత్ అగార్కర్, టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అందరూ ఆటగాళ్ల ఆటతీరును దగ్గరుండి గమనిస్తున్నారు. ఆల్రడీ రింకూ సింగ్, శివమ్ దుబె పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.

- Advertisement -

Also Read : సచిన్‌కు బర్త్ డే విషెస్, లవ్ స్టోరీ లోతుల్లోకి వెళ్తే..

ఈ క్రమంలో అగార్కర్ ను ఉద్దేశించి సురేశ్ రైనా చేసిన ట్వీట్ పై అందరిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అంతేకాదు ఇంతవరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో కలిపి 311 పరుగులు చేశాడు. చెన్నయ్ టీమ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తర్వాత అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు.

ఓవరాల్ గా చూస్తే టాప్ 6లో ఉన్నాడు. అవకాశం ఉంది కాబట్టి, తను ఆరెంజ్ క్యాప్ అందుకుంటాడనే నమ్మకం నెట్టింట పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే శివమ్ దుబె పైన ఉన్నవాళ్లందరూ కూడా 300 పైనే ఉన్నారు. విరాట్ కొహ్లీ (379), రుతురాజ్ (349), ట్రావిస్ హెడ్ (324), సంజు శాంసన్ (314) తన ముందున్నారు.

ఒకవేళ ఆరెంజ్ క్యాప్ అందుకుంటే మాత్రం తిరుగులేకుండా టీ 20 ప్రపంచకప్ లో ఉంటాడని అందరూ అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News