BigTV English

Postponed Movies in Tollywood: ఆ కారణంగా వాయిదాలు పడుతున్న సినిమాలు.. ఇప్పటికి ఎన్నంటే..?

Postponed Movies in Tollywood: ఆ కారణంగా వాయిదాలు పడుతున్న సినిమాలు.. ఇప్పటికి ఎన్నంటే..?

Reason Behand Several Tollywood Movies Postpone: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి నెలకొంది. దీంతో ఇప్పుడు రిలీజ్ కావాల్సిన సినిమాల్లో అన్నీ చిన్న హీరోలదే హవా నడవబోతుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క మూవీ వాయిదా పడుతూ వస్తున్నాయి. వీటికి కూడా ఓ ముఖ్య కారణం ఉంది. ఆ కారణం వల్లనే ఇప్పటికే రెండు మూడు సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మరొక సినిమా అదే బాటలోకి వచ్చింది. ఆ సినిమా ఏంటో, రిలీజ్‌ వాయిదాకి కారణాలేంటో తెలుసుకుందాం.


సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘శశివదనే’. ఈ మూవీ గత వారం రిలీజ్ కావాల్సింది. కానీ పోస్టపోన్ అయింది. అందుకు కారణం సెన్సార్ పనులు పూర్తి కాకపోవడమే అని తెలుస్తుంది. ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అధికారి విదేశాలకు వెళ్లడంతో సెన్సార్ పనులు కంప్లీట్ కాలేదని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

ఇక ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. నారా రోహిత్ నటిస్తున్న పొలిటికల్ డ్రామా ‘ప్రతినిధి 2’ మూవీ కూడా రీసెంట్‌గా వాయిదా పడింది. అయితే ఈ మూవీకి కూడా సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్లనే రిలీజ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మరి ఈ సెన్సార్ సమస్య ఎంతవరకు ఉంటుందో ఇంకా తెలియలేదు.


Also Read: బ్రేకింగ్.. ప్రతినిధి 2 రిలీజ్ వాయిదా

ఈ మూవీతో పాటు ఇప్పుడు మరొక మూవీ అదే బాటలోకి వచ్చింది. తాజాగా ఓ కొత్త మూవీ వాయిదా పడింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ఆశిష్ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా రూపొందిన కొత్త చిత్రం ‘లవ్ మి’. ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజు ఈ మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ అందించారు.

ఈ మూవీ రేపు (ఏప్రిల్ 25)న రిలీజ్ కాదంటూ తెలిపారు. ఈ మూవీ వాయిదా పడినట్లు వెల్లడించారు. అయితే కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ మేరకు ఈ చిత్రాన్ని మే 25కి పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీతో పాటు యంగ్ నటుడు నవదీప్ నటిస్తున్న ‘లవ్ మౌళి’ కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×