BigTV English
Advertisement

Budget 5G Smartphone: బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్..ధర, ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు..

Budget 5G Smartphone: బడ్జెట్‌లో బెస్ట్ 5G ఫోన్..ధర, ఫీచర్లు చూస్తే షాక్ అవుతారు..

Budget 5G Smartphone: ఇప్పుడంతా 5G యుగం. ఫాస్ట్ ఇంటర్నెట్, లాగ్‌లెస్ స్ట్రీమింగ్, మెరుగైన గేమింగ్ అనుభవం కోసం అనేక మంది 5G ఫోన్‌ కోసం చూస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలంటే ఫోన్ స్పీడ్, పనితీరు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే 5G ఫోన్లు ఎక్కువ ఖరీదుగా ఉండటంతో, బడ్జెట్ ఫోన్ వినియోగదారులకు ఇది సవాల్‌గా మారింది. కానీ, ఇప్పుడు తక్కువ ధరలోనే ఐటేల్ కంపెనీ P55 5G స్మార్ట్‌ఫోన్ను అందిస్తుంది.


తక్కువ ఖర్చుతో అధిక ఫీచర్లు..
తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న ఈ ఫోన్ మార్కెట్లో దుమ్ము రేపుతోంది. Dimensity 6080 ప్రాసెసర్, 50MP AI కెమెరా, 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం ఈ ఫోన్ 40% తగ్గింపుతో కేవలం రూ. 7,799కే అమెజాన్లో లభిస్తోంది. అయితే ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం

డిజైన్ & డిస్‌ప్లే
ఐటేల్ P55 5G డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మింట్ గ్రీన్ కలర్.. ఫోన్‌కు అదనపు అందాన్ని ఇస్తుంది. ఫోన్ చేతిలో సౌకర్యంగా పట్టుకునేలా ఉంటుంది.


డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు
-6.6-inch HD+ డిస్‌ప్లే – పెద్ద స్క్రీన్‌తో సినిమాలు, వీడియోలు చూడటానికి చాలా బాగుంటుంది.
-120Hz రిఫ్రెష్ రేట్ – స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
-ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లే – పెద్ద స్క్రీన్‌తో మరింత ఎంజాయ్‌మెంట్.
-ఇది IPS LCD ప్యానెల్‌తో వస్తుంది. కాబట్టి బ్రైట్‌గా కనిపించే డిస్‌ప్లేతో వస్తుంది

ప్రాసెసర్ & పనితీరు
ఫోన్ పర్‌ఫార్మెన్స్ ఎంత ఫాస్ట్‌గా ఉందో చెప్పేది ప్రాసెసర్. ఐటేల్ P55 5G ఫోన్ Dimensity 6080 5G చిప్‌సెట్‌తో వస్తుంది.

ప్రాసెసర్ స్పెసిఫికేషన్లు
-Dimensity 6080 5G ప్రాసెసర్ – 5G నెట్‌వర్క్ సపోర్ట్ చేస్తుంది.
-Octa-Core CPU – ఫాస్ట్ & స్మూత్ మల్టీటాస్కింగ్.
-Mali-G57 GPU – మంచి గ్రాఫిక్స్ & గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్

-ఈ ప్రాసెసర్ హై-ఎండ్ యాప్స్, మల్టీటాస్కింగ్, గేమింగ్‌కి చాలా బాగుంటుంది. PUBG, Free Fire, BGMI లాంటి గేమ్స్‌ను ల్యాగ్ లేకుండా ఆడొచ్చు.

Read Also: Spam Calls: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్..స్పామ్ కాల్స్ ..

బ్యాటరీ & ఛార్జింగ్
బ్యాటరీ బ్యాకప్ బాగాలేకపోతే, ఎన్ని ఫీచర్లున్నా ఫోన్ వాడటానికి కష్టమే. కానీ, 5000mAh బ్యాటరీతో ఈ ఫోన్ చాలా వరకు సంతృప్తిని కలిగిస్తుంది.

బ్యాటరీ & ఛార్జింగ్ స్పెసిఫికేషన్లు
5000mAh బ్యాటరీ – ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 1.5 రోజులు ఈజీగా ఉపయోగించొచ్చు.
18W Type-C ఫాస్ట్ ఛార్జింగ్ – 50% ఛార్జింగ్ కేవలం 30 నిమిషాల్లో.
Type-C పోర్ట్ – వేగంగా ఛార్జ్ అవుతుంది.
రోజంతా ఫోన్ వాడేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్.

ప్రీమియం లుక్ ఫోటోలు
ఇటేల్ P55 5G 50MP AI డ్యూయల్ కెమెరాతో వస్తుంది. దీని ద్వారా తీసుకునే ఫోటోలు క్లారిటీగా, అందంగా ఉంటాయి.

కెమెరా ఫీచర్లు:
-50MP ప్రైమరీ కెమెరా – AI మోడ్ & నైట్మోడ్ తో షార్ప్ & బ్రైట్ ఫోటోలు.
-8MP సెల్ఫీ కెమెరా – నేచురల్ & క్లీన్ సెల్ఫీలు.
-నైట్ మోడ్ – తక్కువ వెలుతురులోనూ మంచి ఫోటోలు తీయవచ్చు.
-సాధారణంగా ఈ ధరలో 50MP కెమెరా ఇవ్వడం చాలా అరుదు.

సూపర్ ఫాస్ట్ మల్టీటాస్కింగ్
-ఐటేల్ P55 5G 4GB RAM + 64GB స్టోరేజ్ తో వస్తుంది. అదనంగా Memory Fusion టెక్నాలజీ ద్వారా 8GB వరకు RAM పొందవచ్చు.
-4GB RAM (+4GB Virtual RAM) – 8GB వరకు పెంచుకోవచ్చు.
-64GB స్టోరేజ్ – ఫోటోలు, వీడియోలు, యాప్స్ స్టోర్ చేసుకోవడానికి సరిపోతుంది.
-256GB వరకు microSD కార్డ్ సపోర్ట్ – ఎక్కువ డేటా స్టోర్ చేసుకోవచ్చు.
-RAM పొడిగింపు ఫీచర్ వల్ల ఫోన్ మరింత ఫాస్ట్‌గా పని చేస్తుంది.

భద్రత & ఇతర ఫీచర్లు
-సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ – సెక్యూరిటీ & ఫాస్ట్ అన్‌లాక్
-Android 13 OS – అందుబాటులో లేటెస్ట్ ఫీచర్స్
-5G డ్యూయల్ SIM సపోర్ట్ – వేగవంతమైన 5G కనెక్షన్

Related News

Huawei Mate 70 Air: ఐఫోన్ ఎయిర్‌కి పోటిగా హవాయ్ కొత్త స్లిమ్ ఫోన్.. పెద్ద 7 ఇంచ్ డిస్‌ప్లే‌తో మేట్ 70 ఎయిర్ లాంచ్

Google Maps: గూగుల్ మ్యాప్స్ నుంచి క్రేజీ ఫీచర్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Google Pixel 10: గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా రూ.15 వేలు తగ్గింపు, వెంటనే ఈ క్రేజీ డీల్‌ పట్టేయండి!

Smartphone Comparison: వివో Y19s 5G vs iQOO Z10 Lite 5G vs మోటో G45 5G.. రూ.12,000లోపు బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Oppo Reno 13 Pro+: ఫ్లాగ్‌షిప్‌లను ఢీ కొట్టే రెనో 13 ప్రో ప్లస్.. ఆఫర్ ధర వింటే ఆశ్యర్యపోతారు..

Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

EV charging Highway: ఈవీ కార్లను ఛార్జింగ్ చేసే రోడ్డు.. డ్రైవింగ్ చేసే సమయంలోనే వాహనాలు ఛార్జ్.. ఎలాగంటే

Google Maps Offline: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Big Stories

×