BigTV English

YS Sharmila: పాస్టర్ ప్రవీణ్ కేసు.. షర్మిల సంచలన కామెంట్స్, కీలక విషయాలు బయటపెట్టిన పీఏ

YS Sharmila: పాస్టర్ ప్రవీణ్ కేసు.. షర్మిల సంచలన కామెంట్స్, కీలక విషయాలు బయటపెట్టిన పీఏ

YS Sharmila: పాస్టర్ ప్రవీణ్ మరణం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కాదన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయన్నారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిందని వ్యాఖ్యానించారు. ప్రవీణ్ పగడాల మృతి‌పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపి, నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు.


మరోవైపు ప్రవీణ్ పగడాల మృతిపై వైస్ విమలా రెడ్డి నోరు విప్పారు. తన బిడ్డలకు ఎవరైనా హాని కలిగిస్తే ఆ దేవుడు క్షమించరని అన్నారు. ప్రవీణ్ ఎన్నో సేవలు చేశారని, ఏనాడూ గర్వంతో ఉండలేదన్నారు. ఎంత మందికి వీలైతే అంతమందికి సహాయం చేసేవారని గుర్తు చేశారు. ప్రవీణ్‌కు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు బిగ్ టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల పీఏ స్వర్ణలత నోరు విప్పారు. ఘటన గురించి సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలిసిందని తెలిపింది. గుడ్ ఫ్రైడే నేపథ్యంలో 45 రోజులకు సంబంధించి ప్రతీరోజు తనకు వాయిస్ రికార్డు చేసి పంపించేవారని తెలిపింది. మంగళవారం షెడ్యూల్‌కు సంబంధించి ఆయన వాట్సాప్‌కు తాను మెసేజ్ పెట్టానన్నారు. సింగిల్ టిక్ రావడంతో డౌట్ వచ్చిందన్నారు.

ఫోన్ కాల్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని, ఎప్పుడూ  అన్న ఫోన్ స్విచ్చాఫ్ అయ్యే ఛాన్స్ లేదని తెలిపింది. ఎవరు ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతారని తెలిపింది. కాసేపటికే ప్రవీణ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయని, వెంటనే అన్న భార్యకు తాను ఫోన్ చేశారని వెల్లడించింది. అప్పటికే ప్రవీణ్‌కు యాక్సిడెంట్ అయ్యిందని, గాయాలు తగిలాయని, ప్రార్థన చేయాలంటూ వేరే సిస్టర్ చెప్పి ఫోన్ కట్ చేశారని గుర్తు చేసింది.

ప్రవీణ్ కార్యక్రమాలను తాను దగ్గరుండి చూస్తున్నానని తెలిపింది స్వర్ణలత.  కొన్ని ప్రొగ్రాం గురించి తనకు చెప్పరని బయటపెట్టింది. సోమవారం ఉదయం కొవ్వూరులోని చర్చ్ లో ఓ కార్యక్రమానికి అన్న హాజరయ్యారని వెల్లడించింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు టూ వీలర్స్ మీద వచ్చారని,  ఇప్పుడేకాదు చాలాసార్లు  బైక్ పై  జర్నీ చేసిన సందర్భాలను బీగ్ టీవీకి వివరించింది ఆమె.

బైక్ డ్రైవింగ్ అంటే ప్రవీణ్‌కు ఇష్టమని, దీనికితోడు ఏప్రిల్ షెడ్యూల్ అంతా తూర్పు గోదావరిలో ఉన్నాయని వెల్లడించింది. దీనివల్ల మిగతా ప్రాంతాలకు వెళ్లడానికి తేలికవుతుందని చెప్పింది. ప్రవీణ్ ఎప్పుడూ హైదరాబాద్‌లో ఉంటారని, ప్రొగ్రాం వల్ల ఏపీకి వెళ్లారని తెలిపింది. తనకు బెదిరింపులు వస్తున్నాయని పలుమార్లు ప్రవీణ్ చెప్పిన విషయాన్ని పీఏ గుర్తు చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటావు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పినట్టు వివరించింది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×