E-Paper
Advertisement

బంగారం-వెండి ధరలు భారీగా పతనం.. మళ్లీ రద్దీగా మారుతున్నగోల్డ్ షాపులు, డిసెంబర్ 9 వరకు తప్పదా?

బంగారం-వెండి ధరలు భారీగా పతనం.. మళ్లీ రద్దీగా మారుతున్నగోల్డ్ షాపులు, డిసెంబర్ 9 వరకు తప్పదా?
Advertisement

Gold Price Today: బంగారం-వెండి ధరలు మరో రెండు వారాల పాటు పతనం తప్పదా? ఆ తర్వాత ఇదే దూకుడు కంటిన్యూ అవుతుందా ? మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందా? మార్కెట్ వర్గాలు మాత్రం డిసెంబర్ సెకండ్ వీక్ వరకు పతనం తప్పదని అంటున్నాయి. ధరలు పతనంతో బంగారం షాపులు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

బంగారం-వెండి ధరలు భారీగా పతనం

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు బులియన్ మార్కెట్ పై పడింది. ఫలితంతా బంగారం-వెండి ధరలు భారీగా పతనం అవుతున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడం, ధరలు పతనంతో బంగారం షాపులు కొనుగోలుదారులతో రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంగా అమ్మకాలు పెరగడం మొదలైంది. చాలామంది కొనుగోలుదారులు ధరలు ఇంకా పతనం అవుతాయని భావిస్తున్నారు.

Advertisement

మంగళవారం దేశీయ మార్కెట్ సెలవు వచ్చినా బంగారం, వెండి ధరలు దాదాపు 3 వేల వరకు ధరలు పతనమయ్యాయి. బుధవారం కూడా అదే జోరు కంటిన్యూ అవుతుందో. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పసిడి రూ.1.24 లక్షలకు దిగొచ్చింది. మునుపటి రోజుతో పోల్చితే దాదాపు రూ. 3 వేలకు పైగానే తగ్గింది.

డిసెంబర్ 9 వరకు పతనం తప్పదా?

22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.2,950 మేరా పతనం అయ్యింది. ప్రస్తుతం 10 గ్రాముల రేటు రూ.1,14,200గా లావాదేవీలు జరుగుతున్నాయి. మంగళవారంతో పోల్చితే కిలో వెండి ధర రూ.10 వేల వరకు తగ్గింది. ప్రస్తుతం రూ.1.65 లక్షలకు అటు ఇటుగా ట్రేడింగ్ జరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సుకు 3550 డాలర్లకు పతనమైంది.

Advertisement

వెండి గురించి చెప్పాల్సిన పని లేదు. ఔన్సు ధర 40.83 డాలర్ల వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. కమొడిటీ ఎక్స్ఛేంజ్‌లో గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాముల ధర రూ.1,21,875 వద్ద కొనసాగుతోంది. సిల్వర్‌ ఫ్యూచర్స్‌ కేజీ ధర రూ. 1,44,547 వద్ద లావాదేవీలు జరుగుతున్నాయి. డిసెంబర్ 9 వరకు బంగారం-వెండి ధరలు ఈ విధంగా ఉంటుందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు ఫెడ్ వడ్డీ రేట్లపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే బంగారం-వెండి ధరలు పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో పెట్టుబడుదారులు బంగారం కంటే, బ్రాండ్లు, డాలర్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

ALSO READ: రెండున్నర దశాబ్దాల తర్వాత.. Gold Spot రీఎంట్రీ, కాంపా టార్గెట్‌గా అడుగులు

Related News

దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు..ఫారెన్ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో, తారాజువ్వలా సెన్సెక్స్-నిఫ్టీ సూచీలు

రెండున్నర దశాబ్దాల తర్వాత.. Gold Spot రీఎంట్రీ, కాంపా టార్గెట్‌గా అడుగులు

SSYలో ఈ విధంగా పెట్టుబడి పెడితే 71 లక్షలకు పైగా… ఎలా సాధ్యం అంటే ?

30 ఏళ్ల వయస్సులో SIP స్టార్ట్ చేస్తున్నారా ? 15 ఏళ్లలోనే కోటీశ్వరులను చేసే లెక్క ఇదే

నెలకు 10000 SIPతో కోటీశ్వరులు కావడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?

అప్పులతో అల్లాడుతున్నారా ? 50:30:20 గోల్డెన్ రూల్ తో లైఫ్ బిందాస్

4 లక్షలకు కొంటే నేడు 3200 కోట్ల సామ్రాజ్యం… భారత్ మార్కెట్ ను శాసిస్తున్న బిస్లరీ అసలు కథ ఇదే

Big Stories

Advertisement
×