JBL Bar 1000MK2 review: ఇంట్లోనే సినిమా హాల్ రేంజ్ ఆడియో ఫీల్ పొందాలని ప్రతీ సినిమా అండ్ మ్యూజిక్ లవర్ కోరుకుంటారు! అయితే.. కేవలం టీవీ స్పీకర్లు లేదా సాధారణ సౌండ్‌బార్లతో ఆ కిక్ రాదు. సరిగ్గా ఇదే సమయంలో.. జేబీఎల్ నుంచి వచ్చిన ‘JBL Bar 1000MK2’ మార్కెట్లో మోతెక్కిస్తోంది. ఇది కేవలం ఒక ఆడియో సిస్టమ్ మాత్రమే కాదు, మీ లివింగ్ రూమ్‌ని కంప్లీట్ థియేటర్‌గా.. మార్చే అల్టిమేట్ ఆడియో సౌండ్ బార్! డిటాచబుల్ వైర్‌లెస్ స్పీకర్లు, 3D సరౌండ్ సౌండ్‌తో అలరిస్తున్న.. ఈ సౌండ్‌బార్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం!
ఈ సౌండ్ బార్ చూడటానికి చాలా క్లాసీ అండ్ మోడ్రన్ డిజైన్‌తో వస్తుంది. మీ పెద్ద స్క్రీన్ టీవీ కింద అమర్చితే.. మీ లివింగ్ రూమ్ లుక్కే మారిపోతుంది. దీని మ్యాట్ ఫినిషింగ్ బాడీ, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఇది ఒక హై-ఎండ్ ప్రీమియం డివైజ్ అని స్పష్టంగా నిరూపిస్తాయి. వైర్లు ఎక్కువ కనిపించకుండా.. చాలా నీట్‌గా సెటప్ చేసుకునేలా దీని డిజైన్ ఉంటుంది.
ఈ సౌండ్‌బార్‌లోని అత్యంత క్రేజీ ఫీచర్ దీని డిటాచబుల్ (ఊడతీసే) వైర్‌లెస్ సరౌండ్ స్పీకర్లు! మెయిన్ సౌండ్‌బార్ చివరల ఉన్న రెండు చిన్న స్పీకర్లను విడదీసి, మీ సోఫా వెనక లేదా రూమ్ చివరల్లో పెట్టుకోవచ్చు. వీటికి ఎలాంటి వైర్లు లేదా ప్లగ్ పాయింట్లు అవసరం లేదు. ఇన్-బిల్ట్ బ్యాటరీతో.. పని చేసే ఈ స్పీకర్లు రియల్ 3D థియేటర్ ఆడియో అనుభూతిని అందిస్తాయి. సినిమా చూసి అయిపోయాక మళ్లీ మెయిన్ బార్‌కి కనెక్ట్ చేస్తే.. ఆటోమేటిక్‌గా ఛార్జ్ అయిపోతాయి.
JBL Bar 1000MK2 లో డాల్బీ అట్మాస్, DTS:X ఆడియో సపోర్ట్ ఉంది. దీనిలోని అప్‌ఫైరింగ్ డ్రైవర్లు ఆడియోను సీలింగ్ (కప్పు) వైపు ప్రసరింపజేసి, పైనుంచి శబ్దం వచ్చేలా చేస్తాయి. హెలికాప్టర్ వెళ్తున్నా.. వర్షం పడుతున్నా, లేదా యాక్షన్ సీన్స్‌లో బుల్లెట్లు దూసుకెళ్తున్నా.. ఆ శబ్దాలు మీ చుట్టూ, మీ పైన ప్లే అవుతున్నట్లు అత్యంత సహజంగా అనిపిస్తుంది.
మ్యూజిక్ లవర్స్ అండ్ ఆక్షన్ మూవీ లవర్స్ కోసం ఇందులో భారీ 10-ఇంచీల వైర్‌లెస్ సబ్‌వూఫర్ ఇచ్చారు. దీని నుంచి వచ్చే డీప్ అండ్ పంచీ బాస్ మీ రూమ్‌ని వణికిస్తుంది. ఓపెన్ స్పేస్‌లో.. కూడా బాస్ ఎక్కడా తగ్గదు. డైలాగ్స్ చాలా క్లియర్‌గా వినబడేలా.. ఫ్యూర్ వాయిస్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపరిచారు, దీని వల్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత హెవీగా ఉన్నా క్యారెక్టర్ల వాయిస్ క్రిస్ప్‌గా ఉంటుంది.
ఈ సౌండ్‌బార్‌లో వైఫై, బ్లూటూత్, ఆపిల్ ఎయిర్‌ప్లే, క్రోమ్‌కాస్ట్ అండ్ ఇన్-బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. మీ ఫోన్ నుంచి హై-క్వాలిటీ మ్యూజిక్‌ని ఈజీగా స్ట్రీమ్ చేసుకోవచ్చు. HDMI eARC పోర్ట్ ద్వారా టీవీకి కనెక్ట్ చేస్తే.. అన్‌కంప్రెస్డ్ 4K డాల్బీ అట్మాస్ ఆడియో లభిస్తుంది. ‘JBL One’యాప్ ద్వారా సౌండ్ సెట్టింగ్స్, ఈక్వలైజర్‌ని మన అభిరుచికి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.
వైర్ల గోల లేకుండా, డిటాచబుల్ స్పీకర్ల ఫ్లెక్సిబిలిటీతో, థియేటర్ రేంజ్ 3D సౌండ్ అండ్ మైండ్ బ్లోయింగ్ బాస్ కోరుకునే వారికి ఈ సౌండ్ బార్ ఒక పర్ఫెక్ట్ అండ్ అల్టిమేట్ ఆడియో సిస్టమ్!