Sridevi Chowdary:రియాలిటీ షో నటి, ప్రముఖ వ్యాపారవేత్త నెక్కంటి శ్రీదేవి చౌదరి తనని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన,అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారంటూ జూబ్లిహిల్స్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు.అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే రియాలిటీ షో ది ట్రైటర్స్ లో పాల్గొన్నప్పటి నుంచి కొందరు వ్యక్తులు తనని టార్గెట్ చేస్తూ బ్యాడ్ కామెంట్స్ తో తనపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని,ముఖ్యంగా తన గౌరవ ప్రతిష్టలను దెబ్బతీసేలా ట్రోల్ చేయడంతో పాటు బ్యాడ్ మీమ్స్ యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు.
అయితే ఈ వివాదంలో రియాలిటీ షోలోని తోటి కంటెస్టెంట్ ధనుంజయ్‌తో పాటు మరికొందరి పేర్లు కూడా ప్రధానంగా తెరపైకి వచ్చాయి. షోలో జరిగిన కొన్ని సంఘటనలను మనసులో ఉంచుకుని, సోషల్ మీడియాలో తనపై కావాలనే ఈ రకంగా బ్యాడ్ కామెంట్స్ తో తనపై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని శ్రీదేవి తన కంప్లైంట్ లో రాసినట్టు తెలుస్తుంది.ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు, ట్రోల్స్ కారణంగా తాను మెంటల్ గా సఫర్ అవుతున్నానని, సమాజంలో తనకున్న గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దానికి కారణమైన వారిపై వెంటనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఇక శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు పై జూబ్లీహిల్స్ పోలీసులు వెంటనే రియాక్ట్ అయి కేసు నమోదు చేశారని సమాచారం. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 79 తో పాటు, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద కేసు పెట్టి పూర్తిస్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది. iసోషల్ మీడియాలో సెలెబ్రిటీలని ,అందునా ముఖ్యంగా మహిళలను, టార్గెట్ గా చేసుకుని ఇలాంటి నెగెటివ్ ట్రోల్స్ చేయడం గత కొంత కాలంగా ఎక్కువ జరగడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇక ఈ ట్రైటర్స్ లోని పోటీ దారుల విషయానికి వస్తే హర్షవర్ధన్ సినీ నటుడు రచయిత, సినీనటి ప్రగతి, ప్రముఖ యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహ, ఇషా వ్లాగ్స్ స్నో అక్క ఫేమ్ మౌనిష చౌదరి , లేడీ కమెడియన్ విధ్యులేఖ రామన్, ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్ శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ,అభినవ కవి , ర్యాపర్ ప్రవణ్ చాగంటి , గేమర్ పుష్పాల ధనుంజయ్ , బిజినెస్మే రహత్ అచట, ప్రముఖ యూట్యూబ్ వర్ష డిసౌజా, కొరియోగ్రాఫర్ ఫల్గుణి, నటి ఆషికా, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ స్వేకర్ అగస్తి, షోస్ డైరెక్టర్ ఎస్ ఎస్ వర్ధన్, ప్రముఖ సినీ నటుడు సాయి రోనక్, కంటెంట్ క్రియేటర్ గౌరవ్ సునీల్, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, కమెడియన్ విష్ణువు, ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద అంటూ 20 మంది కంటెస్టెంట్లతో ఈ ప్రోగాం మొదలైన సంగతి తెల్సిందే.చూడాలి మరి రియాలిటీ షో నటి, ప్రముఖ వ్యాపారవేత్త నెక్కంటి శ్రీదేవి చౌదరి పెట్టిన ఈ కేసులో ఎలాంటి నిజానిజాలు బయటికి వస్తాయో !
ALSO READ :గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!