E-Paper
Advertisement

గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!

గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!
Advertisement

Radhamma Kuthuru:గాజులు గల గల అంటూ ఓవర్ నైట్ క్రేజ్ కొట్టేసిన రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య అటు ప్రశంసల తో పాటు ఇటు వివాదాల్ని కూడా మూట గట్టుకున్న సంగతి తెల్సిందే,ముఖ్యంగా భవానీ మాల వేసుకుని అలా పాటలు పాడటం ఏమిటి,ఆ ప్లాస్టిక్ పూలు ,లిప్స్టిక్ ఏంటి అంటూ సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడేస్తున్నారు నెటిజన్లు.ఇక వీటి పైనే ఒక ఇంటర్వ్యూలో తనదైన శైలిలో జవాబులు చెబుతూ కౌంటర్ ఇచ్చింది రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య.

డాన్స్  చేయొద్దు అని అనడానికి మీరంతా ఎవరు

Advertisement

తనకి చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టమని అలాంటి డాన్స్ ని చేయొద్దు అని అనడానికి మీరంతా ఎవరని మండిపడింది.నేను ఒక ఇన్ఫ్లూయెన్సర్ అని ,తను అమ్మవారి భక్తి పాటలే కాకుండా అన్ని రకాల పాటలు చేస్తానని తెలిపింది.అమ్మవారి మీద ఉన్న భక్తితో వారంలో రెండు లేదా మూడు సార్లు అమ్మవారి మీద రీల్స్ కాని వీడియోలు కానీ పెడతానని,మిగతా రోజుల్లో నచ్చిన డాన్స్ వీడియోలు పెట్టుకుంటా ,అసలు నన్ను డాన్స్ వీడియోలు చేయొద్దు అని చెప్పడానికి మీరెవరు అని ఫైర్ అయింది.

గుడి ముందు చేసిన వీడియో వల్లే

Advertisement

ఇక ఈ వివాదం ఎక్కడ మొదలైందన్న దానికి సమాధానం ఇస్తూ తాను విజయవాడలోని అమ్మవారి గుడి ముందు చేసిన వీడియో వల్లే ఈ వివాదం మొదలైందని చెప్పుకొచ్చింది.ఆ వీడియోలో మేము భవానీ మాల ధరించి అమ్మవారి కోసం ఎదురుచూస్తునామని ,రా అమ్మా ..దుర్గమ్మా అంటూ చేసిన వీడియో పై కల్యాణి అమ్మ రియాక్ట్ అయిందని తెలిపింది. అమ్మవారిని జగన్మాత ,లోకమాత అని పిలవాల్సింది పోయి ఇలా పిలవడం ఏంటి అని వీడియో చేస్తూ వార్నింగ్ ఇవ్వడంతోనే ఈ గొడవ అంత మొదలైందని వాపోయింది.అయితే ఆమె ఏజ్ ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ,ఏదైనా జరిగి హాస్పిటల్ కి వెళ్ళాల్సి వస్తే ఎలా వీడియోలు తీస్తారని తాను అన్నట్టు ఒప్పేసుకుంది.

తనని ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్

ఇక తాను పెట్టుకున్న ప్లాస్టిక్ పూలు ,లిప్స్టిక్ గురించి మాట్లాడుతూ పోయిన ఏడు కూడా మా ఊరులో పూలు దొరకని కారణంగా ఇలాగే ప్లాస్టిక్ పూలు అమ్మవారి వద్దకి వెళ్లానని ,అయితే ఈ సారి పాట మిలియన్ల కొద్ది వ్యూస్ దాటిపోవడంతోనే ఇలా అక్కసుతో ప్లాస్టిక్ పూలు ,లిప్స్టిక్ అంటూ నానా యాగీ చేస్తున్నారని మండిపడింది.ఇక సినిమాల్లో థర్మాకోల్ పై దేవుణ్ణి ముద్రిస్తారని,సినిమాలలో కూడా మాలలు వేసుకుని డాన్స్ లు చేసినవి చాలా ఉన్నాయని,అవన్నీ వదిలిపెట్టి తనని ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఫైర్ అయింది.

తనని వేశ్యతో పోలుస్తూ

ఇక చాలా మంది తనని ఒక అమ్మాయి అని కూడా చూడకుండా బూతులు వాడుతున్నారని,తనని వేశ్యతో పోలుస్తూ తన తలి గురించి కూడా బూతులు మాట్లాడారని,అవన్నీ చూసి తట్టుకోలేకనే అలా రియాక్ట్ అయ్యానని ,అయితే తన తల్లి వయసు ఉన్న కల్యాణి అమ్మ కి తాను చెప్పు చూపించలేదని,తనని ఎవరైతే బూతులతో ట్రోల్ చేశారో వాళ్ళకే అలా చెప్పు చూపించానని క్లారిటీ ఇచ్చింది.నేనేదైనా తప్పు చేస్తే అడిగే హక్కు అందరికి ఉంటుందని ,కాని ఇలా బూతులతో కామెంట్స్ చేయడం ఏమీ బాగోలేదని మండిపడింది.ఇక పట్నం పొల్ల అనే అమ్మాయికి తాను కల్యాణమ్మని తిట్టడం నచ్చలేదని చెప్పుకొచ్చింది.

కేవలం 5 వేల రూపాయలు మాత్రమే

ఇకపోతే తాను అన్ని మతాల దేవుళ్ళని గౌరవిస్తానని,దేవుడి పేరు మీద ఎందఱో ఎన్నో చేస్తున్నారని,ముందు వాళ్ళని ప్రశ్నించాలని మండిపడింది.ఇక పాట గురించి మాట్లాడుతూ తనవద్ద అప్పటికే ఈ లిరిక్స్ ఉన్నాయని, తనని సింహాద్రి అనే వ్యక్తి అప్రోచ్ అయినప్పుడు ఈ లిరిక్స్ పంపానని,ఇక సిరిసిల్లలో ఈ పాట పాడితే సిద్ధిపేటలో షూటింగ్ చేశారని,తనకి ఇంకో అమ్మాయికి కేవలం 5 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారని ,అంతే తప్ప ఈ పాట మీద తానేమీ కోట్లు సంపాదించలేదని ట్రోలర్స్ పై మండి పడింది.చూడాలి మరి వరుస వివాదాలతో నెట్టింట రచ్చ చేస్తున్న ఈ వ్యవహారానికి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో !

ALSO READ :గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Tags

Related News

సోషల్ మీడియాలో వేధింపులు.. ధనుంజయ్‌పై కేసు పెట్టిన రియాలిటీ షో నటి శ్రీదేవి

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

Big Stories

Advertisement
×