Jio Unlimited 5G Offers : దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న రిలయన్స్ జియో… ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే 4G, 5G సేవలను సరసమైన ధరలకు అందిస్తున్న జియో తాజాగా మరో కొత్త ప్లాన్ ను ప్రారంభించింది. ఈ ప్లాన్ తో ఏడాది పాటు అపరిమిత 5G డేటాను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ పై కొన్ని షరతులు సైతం విధించింది.
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజాగా అల్టిమేట్ 5G అప్‌గ్రేడ్ వోచర్ ను ప్రారంభించింది. ఈ వోచర్ ధర రూ. 601 (unlimited 5G upgrade for Rs 601) గా నిర్ణయించింది. ఇది సంవత్సరానికి అపరిమిత 5G డేటాను అందిస్తోంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లోని వినియోగదారులను లక్ష్యంగా ఈ ప్రమోషనల్ ప్లాన్ ను జియో ప్రారంభించింది. ఇందులో 1.5GB రోజువారీ డేటా ఉంటుంది. ఈ వోచర్‌తో 5G ప్లాన్ లేని వినియోగదారులు కూడా సరసమైన ధరతో అపరిమిత 5G కనెక్టివిటీని పొందే అవకాశం ఉంటుంది.
జియో తీసుకొచ్చిన ఈ వోచర్ ను మైజియో యాప్ లో పొందొచ్చు. ఇక ఈ వోచర్ ను గిఫ్ట్ గా ఇచ్చేయ్యెచ్చు. దీన్ని వినియోగదారులు యాప్ ద్వారా నేరుగా కొనుగోలు చేయవచ్చు. వేరే వాళ్లకు ఫార్వాడ్ చేయ్యెచ్చు. అయితే ఈ వోచర్ రూ. 299 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్‌లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని జియో తెలిపింది.
జూలై 3, 2024న వచ్చిన Jio టారిఫ్ పెంపును అనుసరించి ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఇది అపరిమిత 5G యాక్సెస్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్లాన్. ఇక గతంలో వినియోగదారులు జియో తీసుకొచ్చిన వెల్‌కమ్ ఆఫర్‌ను రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ ధరతో యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండేది. ఈ ప్లాన్ పై ఛార్జీలు పెంచేసిన తర్వాత రూ.349 ప్లాన్ వంటి 2GB లేదా అంతకంటే ఎక్కువ రోజువారీ డేటా కలిగిన ప్లాన్‌లకు అపరిమిత 5G డేటాను ఇచ్చే ఆఫర్స్ ను జియో తీసుకొచ్చింది.
ఇక జూలైలో ప్రవేశపెట్టిన కొత్త అప్‌గ్రేడ్ ప్లాన్‌లు, 5G యేతర ప్లాన్‌లలోని వినియోగదారులను అపరిమిత 5Gని పొందటానికి జియో అవకాశం కల్పించింది. వీటిలో రూ. 51, రూ. 101, రూ. 151 ధర గల బూస్టర్ ప్యాక్‌లు ఉన్నాయి. ప్రతి ప్లాన్ అపరిమిత 5G యాక్సెస్‌తో పాటు అదనపు 4G డేటాను అందిస్తుంది. ఉదాహరణకు రూ.51 ప్లాన్‌లో 3GB 4G డేటా, రూ.101 ప్లాన్‌లో 6GB 4G డేటా, రూ.151 ప్లాన్ లో 9GB 4G డేటాను అందిస్తుంది.
Jio సరసమైన ధరకే అన్ లిమిటెడ్ డేటాను అందిస్తుంది. ఇందులో భాగంగా రూ.11 ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇందులో ఒక గంట పాటు 10GB డేటాను పొందే అవకాశం ఉంటుంది. ఇక ఈ లైనప్‌లో రూ. 49, రూ. 175, రూ. 219, రూ. 289, రూ. 359 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ప్లాన్స లో వాయిస్, SMS ప్రయోజనాలు లేవు.
ALSO READ : ఈ మెయిల్ భద్రంగా ఉండాలా.. గూగుల్ అదిరే ఫీచర్ తీసుకొస్తోందిగా!