Jio : ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio).. తన యూజర్స్ కు గట్టి షాక్ ఇచ్చింది. రెండు డేటా ఫ్లాన్స్ వ్యాలిడిటీను కుదించి బేస్ ప్లాన్ సదుపాయాన్ని తొలగించింది.
టాప్ బ్రాండ్ టెలికాం సంస్థ జియో (Jio).. ఎప్పటికప్పుడు తన యూజర్స్ కోసం లేటెస్ట్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో లేటెస్ట్ ప్లాన్స్ లో పలు మార్పులు తీసుకువచ్చింది. ఇక గత ఏడాది జియోతో పాటు ప్రముఖ టెలికాం సంస్థలన్నీ తమ టారిఫ్ చార్జీలను వివరీతంగా పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే తక్కువ ధరతో పలు ప్లాన్స్ తొలగించిన జియో.. తాజాగా మరోసారి యూజర్స్ కు షాక్ ఇచ్చింది. రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను తగ్గించింది. రూ.69, రూ.129 డేటా ప్యాక్స్ వాలిడిటీని కేవలం 7 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. గతంలో ఇవి యూజర్ బేస్ ప్లాన్ తో పనిచేసేవి. అంటే ప్రస్తుత ప్యాక్ ముగియటానికి ఇంకా సమయం ఉంటుండగా ఈ డేటా ప్యాక్స్ తో రీఛార్జ్ చేసుకుంటే వ్యాలిడిటీ పూర్తయ్యే వరకు డేటాను ఉపయోగించే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం తీసుకొచ్చిన మార్పులతో జియో ఈ అవకాశాన్ని తొలగించింది. కేవలం వారం రోజులకే వ్యాలిడిటీని పరిమితం చేసింది.
ఇప్పటివరకు ప్రముఖ టెలికాం సంస్థలన్నీ తీసుకొచ్చిన ప్లాన్స్ లో ప్రస్తుత ప్రీపెయిడ్ ప్లాన్ లో డేటా పూర్తయిన తర్వాత డేటా బూస్టర్ తో రీఛార్జ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. జియో కూడా ఇదే రూల్ ఫాలో అవుతూ పలు ప్లాన్స్ ను అమలు చేస్తుంది. రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6GB డేటా, రూ.139 ప్లాన్‌పై 12జీబీ డేటా లభించేది. కానీ ప్రస్తుతం ప్లాన్స్ లో మార్పులతో వీటి వాలిడిటీ కేవలం వారం రోజులకు మాత్రమే గుర్తించింది. ఇక వీటితో పాటు రూ.11 ప్లాన్, 1 రోజు వ్యాలిడిటీతో రూ.19 డేటా ప్లాన్లు జియోలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మధ్యకాలంలోనే తొలగించిన రూ.189 ప్లాన్‌ను కూడా జియో తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS వంటి ప్రయోజనాలతో వస్తోంది.
జియోతో పాటు వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం సంస్థలన్నీ ఎప్పటికప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ ను పెంచేస్తున్న నేపథ్యంలో యూజర్స్ మండిపడుతున్నారు. విపరీతంగా పెరిగిపోతున్న టారిఫ్ చార్జీలతో సతమతమవుతున్నారు. ఇక గత ఏడాది కాలంగా ఈ టారిఫ్ చార్జీలు మరింత ఎక్కువగా పెరిగాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ప్రైయివేట్ టెలికాం సంస్థల నుంచి ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ వైపు యూజర్స్ ఆసక్తి చూపించారు. గత ఏడాది చివర్లో జియోతో పాటు ఎయిర్టెల్ సైతం లక్షల్లో యూజర్స్ ను కోల్పోయింది. అయినప్పటికీ టెలికాం సంస్థల చార్జీల్లో పెంపు మాత్రం తగ్గడం లేదు. మరి ఈ నేపథ్యంలో యూజర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ALSO READ : బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కొనాలా..! టాప్ ఆఫ్షన్స్ ఇవే