BigTV English

CM Revanth Reddy: చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ సర్కార్.. ఒకేరోజులో 6,87,677 మందికి లబ్ధి..

CM Revanth Reddy: చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్ సర్కార్.. ఒకేరోజులో 6,87,677 మందికి లబ్ధి..

CM Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వం ఒకే రోజు 4 పథకాలు ప్రారంభించి చరిత్ర సృష్టించింది. ఇందిరమ్మ రాజ్యం అందిస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అది కూడ ఏకంగా 6,87,677 మంది లబ్ధిదారులకు మేలు చేకూర్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో ఒకే రోజు నాలుగు పథకాలతో చరిత్ర సృష్టించారు. ఈ పథకాల అమలులో పారదర్శకత లోపించకుండ, గ్రామసభలను అధికారులు నిర్వహించారు. అనంతరం అర్హులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


అంతేకాదు దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఉపాధి హ‌మీ కూలీల ఖాతాల్లోకి ఇందిర‌మ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేయడం విశేషం. రైతన్నలకే కాదు.. కూలీలకు కూడ లబ్ది చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రభుత్వానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఆస్థి లేని కూలీల‌కు భ‌రోసాగా తెలంగాణ స‌ర్కార్ రెక్కల క‌ష్టాన్ని న‌మ్ముకున్న ఉపాధి కూలీల‌కు పెద్దన్నగా ప్రభుత్వం నేడు 18,180 కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది.

రైతు భరోసా..
మొదటి రోజునే రాష్ట్ర ప్రభుత్వం రూ.569 కోట్ల రైతు భరోసా విడుదల చేసింది. మొత్తం 32 జిల్లాల్లో 563 గ్రామాలలో 4,41,911 మంది రైతులకు ఎకరానికి తొలి విడతగా రూ. 6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించింది. ఒక్క రోజులోనే మొత్తం రూ.569 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. మొదటి రోజునే 9,48,333 ఎకరాల విస్తీర్ణంలోని భూమికి రైతు భరోసాను చెల్లించింది. 26వ తేదీన బ్యాంకులకు సెలవు దినం కావటంతో 27వ తేదీ ఉదయం నుంచి ఈ రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి.


ఇందిరమ్మ ఆత్మీయ భరోసా..
తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి విడతగా రూ.6 వేలు చెల్లించింది. తొలి రోజున దాదాపు 18180 వేల వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఈ నగదు సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకానికి తొలి రోజునే ఆర్థిక శాఖ రూ.10.91 కోట్లు విడుదల చేసింది.

కొత్త రేషన్ కార్డులు..
గత పదేండ్లుగా కొత్త రేషన్ కార్డులకు ఎదురుచూసిన తెలంగాణ ప్రజల నిరీక్షణ ఫలించింది. ప్రజా ప్రభుత్వం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ ప్రారంభించింది. వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసింది. తొలి రోజున 531 గ్రామాల్లో 15414 కొత్త కార్డులు ఇచ్చింది. వీటిలో 51912 మంది కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు. వీటితో పాటు అదనపు సభ్యులను చేర్చాలంటూ 1.02 లక్షల మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు.

ఏళ్లకేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించింది. ఇప్పటికే ఉన్న కార్డుల్లో అదనంగా 1,03,674 మంది కుటుంబ సభ్యులను నమోదు చేసింది. వచ్చే నెల నుంచి వీరికి రేషన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయనుంది. అంతేకాదు గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తొలి రోజునే అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 72 వేల మంది పేదలకు ఇళ్ల పత్రాలను అందించింది.

Also Read: Rythu Bharosa Scheme: ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ.. జిల్లాల వారీ వివరాలివే.. ఓసారి చెక్ చేసుకోండి

ఇలా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగానే, ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయాన్ని అప్పటికప్పుడే వారి ఖాతాల్లో జమ చేసింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేసింది. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించింది. రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేసింది. పాత కార్డుల్లో అదనంగా సభ్యులను నమోదు ప్రక్రియను పూర్తి చేసింది. దీనితో తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు, కూలీలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

Related News

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Big Stories

×