BigTV English

Samsung Galaxy S25 Plus vs OnePlus 13 vs iPhone 16 Plus : ఈ మెుబైల్స్ లో ఏది బెస్ట్..!

Samsung Galaxy S25 Plus vs OnePlus 13 vs iPhone 16 Plus : ఈ మెుబైల్స్ లో ఏది బెస్ట్..!

Samsung Galaxy S25 Plus vs OnePlus 13 vs iPhone 16 Plus : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మరి ఏ మెుబైల్ బెటర్ ఆఫ్షన్ ఎంచుకోలేకపోతున్నారా.. ఇంకెందుకు ఆలస్యం.. టాప్ కంపెనీలు తీసుకొచ్చిన Samsung Galaxy S25 Plus తో పాటు OnePlus 13, iPhone 16 Plus మెుబైల్స్ లో ఏది బెస్టో సెలక్ట్ చేసేసుకోండి.


రూ. 1,00,000 బెస్ట్ మెుబైల్ కొనాలనుకుంటే టాప్ ఆఫ్షన్స్.. Samsung Galaxy S25 Plus, OnePlus 13, iPhone 16 Plus. ఇక వీటిని ఎంచుకోవాలంటే టాప్ 5 ఫీచర్స్ ను పరిశీలించాల్సిందే.

OnePlus 13 క్వాడ్-కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.82-అంగుళాల 2K 120Hz LTPO స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే Galaxy S25 Plus కూడా 6.7 అంగుళాల స్క్రీన్ తో 2K రిజల్యూషన్ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. iPhone 16 Plus 6.7-అంగుళాల FHD+ రిజల్యూషన్ తో 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది.  Galaxy S25 Plus, OnePlus 13 పంచ్-హోల్ ఫీచర్ తో ఎక్కువ స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉన్నాయి. అయితే iPhone 16 ప్లస్ లో ఫేస్ ID రికగ్నైజేషన్ ఉంది. కర్వ్డ్ డిస్‌ప్లేతో OnePlus 13 లాంఛ్ అయితే.. Galaxy S25 Plus ఫ్లాట్ డిస్ ప్లేతో వచ్చేసింది. ఇక ఐఫోన్ 16 ప్లస్‌ వీటికి భిన్నంగా ఉంది.


ఈ మెుబైల్స్ అన్నీ ప్రీమియం గ్లాస్-మెటల్ శాండ్‌విచ్ డిజైన్‌ను కలిగి ఉన్నాయి. అయితే Galaxy S25 Plus, iPhone 16 Plus డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68  రేటింగ్‌ను కలిగి ఉండగా, OnePlus 13 IP69 రేటింగ్‌ను అందిస్తుంది.

OnePlus 13 ట్రిపుల్ కెమెరా సెటప్ తో Galaxy S25, iPhone 16 Plus కంటే బెటర్ గా ఉంది. OnePlus 13లో హై-రిజల్యూషన్ 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్, టెలిఫోటో లెన్స్‌తో ఉన్నప్పటికీ Galaxy S25 Plusలో సాలిడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. iPhone 16 Plus డ్యూయల్ కెమెరా సెటప్ తో వీడియోగ్రఫీలో హై క్వాలిటీను కలిగి ఉంది.

OnePlus 13, Galaxy S25 Plus 8K రిజల్యూషన్ వీడియోస్ రికార్డ్ చేయగలిగినప్పటికీ, iPhone 16 Plus 4K 60fps అవుట్‌పుట్ మెరుగైన కలర్స్ లో ఫ్రేమ్ డ్రాప్‌లతో వచ్చేసింది. ఇంకా 3D వీడియోలను కూడా షూట్ చేయగలదు. OnePlus 13లో పోర్ట్రెయిట్ ఫీచర్, AI జూమ్ ఫీచర్‌ కూడా ఉంది. Galaxy S25 Plusలో మెురుగైన ఫీచర్స్ ఉన్నప్పటికీ iPhone 16 Plus ఏ లైటింగ్ లోనైనా మంచి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది.

ఈ మూడింటిలో OnePlus 13 ధర కాస్త తక్కువ. దీని ప్రారంభ ధర రూ. 69,999. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 79,900 కాగా, గెలాక్సీ ఎస్25 ప్లస్ 12 GB RAM + 256 GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌ ధర రూ. 99,999. ఐఫోన్ 16 ప్లస్ బేస్ వేరియంట్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తుంది. అదే OnePlus 13, Galaxy S25 Plus మెుబైల్స్ 256 GB స్టోరేజ్‌తో ప్రారంభమవుతాయి. 256 GBతో iPhone 16 Plus ధర రూ. 84,900. OnePlus 13 మెుబైల్ 24 GB RAM + 1 TB వేరియంట్ ధర రూ. 89,999.

Related News

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Vivo new phones 2025: ఈ నెలలో వివో లాంచ్ చేసిన 4 కొత్త ఫోన్లు.. ధరలు తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ సిఈ5.. ఈ ఫోన్‌కి పోటీదారులే లేరు!

Samsung Galaxy: స్మార్ట్‌ఫోన్ పై మైండ్‌బ్లోయింగ్ ఆఫర్! 22 వేల ఫోన్ ఇప్పుడు 13 వేలకే దొరుకుతుంది!

Amazon Festival Laptops: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లైవ్.. ప్రైమ్ మెంబర్స్‌కు ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

Big Stories

×