E-Paper
Advertisement

జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? 300GB డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లిస్ట్ చాలా పెద్దదే బాస్!

జియోలో ఈ ప్లాన్ గురించి తెలుసా? 300GB డేటా, నెట్ ఫ్లిక్స్, అమెజాన్.. లిస్ట్ చాలా పెద్దదే బాస్!
Advertisement

Jio Postpaid Plan: దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను తీసుకొస్తోంది. అటు ప్రీపెయిడ్ యూజర్లను.. ఇటు పోస్ట్ పెయిడ్ కస్టమర్లను బ్యాలెన్స్ చేస్తూ వారి ఆసక్తులకు అనుగుణంగా సాలిడ్ ప్లాన్లను రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం తీసుకొచ్చిన రూ.1549 ప్లాన్ బెనిఫిట్స్ పరంగా అందరినీ ఆకర్షిస్తోంది. కొండంత డేటాతో పాటు మోస్ట్ ట్రెండింగ్ ఓటీటీలు ఈ ప్లాన్ లో యూజర్లకు లభిస్తున్నాయి.

రూ. 1,549 ప్లాన్ ప్రత్యేకతలు

జియో అందిస్తున్న ఈ నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు బోలెడన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా వినోదం కోసం నెట్‌ఫ్లిక్స్ (మొబైల్), అమెజాన్ ప్రైమ్ లైట్, హాట్ స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఇందులో ఉచితంగా అందిస్తున్నారు. ఇక డేటా విషయానికొస్తే.. ఈ ప్లాన్‌లో మొత్తం 300GB హై స్పీడ్ (4G) డేటాను యూజర్లు పొందొచ్చు. అంతేకాకుండా 5G నెట్‌వర్క్ పరిధిలో ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటాను సైతం జియో అందిస్తోంది.

దేశంలో ఎక్కడికైనా ఫ్రీ కాల్స్

Advertisement

రూ.1549 ప్లాన్ కింద ఉచితంగా ఫ్రీ కాల్స్ చేసుకునే వెసులుబాటును జియో కల్పిస్తోంది. దేశంలోని ఏ నెట్ వర్క్ కైనా ఫోన్ చేసుకొని రోజులో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. దీంతో పాటు ప్రతీ రోజూ 100 ఎస్ఎంఎస్ లు యూజర్లు చేసుకోవచ్చు. ఇక అదనపు ప్రయోజనాల కింద జియో ఏఐ క్లౌడ్ (Jio AI Cloud) ద్వారా 50GB ఉచిత స్టోరేజ్ లభిస్తుంది. వీటన్నింటికీ మించి రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ఏఐ ప్రో (Google Gemini AI Pro) సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందుబాటులో ఉంది. మరోవైపు అమెరికా, యూఏఈ దేశాలకు వెళ్లే వారికి ప్రత్యేక రోమింగ్ బెనిఫిట్స్ సైతం ఈ ఇందులో ఉన్నాయి.

Also Read: ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

పోస్ట్‌పెయిడ్ విభాగంలో ఇదే టాప్!

Advertisement

ప్రస్తుతం రిలయన్స్ జియో అందిస్తున్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్లన్నింటిలోకి ఇదే అత్యంత ఖరీదైన ప్లాన్ కావడం గమనార్హం. దీని తర్వాత స్థానంలో రూ. 749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌లో 100GB డేటాతో పాటు కుటుంబ సభ్యుల కోసం అదనపు సిమ్ కార్డుల సౌకర్యం కూడా ఉంది. అయితే భారీ డేటాతో పాటు ప్రీమియం ఏఐ, ఓటీటీ సేవలను కోరుకునే వారికి రూ. 1,549 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ జియో వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి నమ్మలేని నిజాలు.. పోలీసులే షాక్!

Tags

Related News

చలి వణికిస్తోందా?రూ.1,499కే దొరికే ఈ రూమ్ హీటర్‌తో ఇల్లు వెచ్చగా మార్చుకోండి

రూ.17,490కే బ్రాండెడ్ డిష్‌వాషర్..ఇక మీ కిచెన్ కష్టాలకు ఫుల్ స్టాప్

ఎయిర్‌టెల్ ‘ఇన్‌సైడర్’ ప్రోగ్రామ్.. యూజర్లకు రూ.30,000కు పైగా బెనిఫిట్స్.. ఎలా పొందాలంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!

సైబర్ నేరగాళ్ల కొత్త అస్త్రం SIM Swap.. ఓటీపీ చెప్పకపోయినా మీ అకౌంట్ జీరో అవుతుంది! జాగ్రత్త పడండిలా..

రూ.15 వేలలోపే ఇంటిని మినీ థియేటర్‌గా మార్చేసే 4 బెస్ట్ సౌండ్‌బార్స్ ఇవే!

బర్త్ డే విషెస్ కోసం రాత్రి 12 గంటలకు నిద్రలేవాల్సిన పనే లేదు..వాట్సాప్ మెసేజ్‌ షెడ్యూల్ చేయండిలా!

Big Stories

Advertisement
×