BigTV English

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Jio Recharge Plan : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్ – మరో సరికొత్త ​ప్లాన్​ తో వచ్చేసిన టెలికాం దిగ్గజం

Jio Recharge Plan : ప్రముఖ టెలికాం దిగ్గజం జియో తన వినియోగదారుల కోసం అనేక రీఛార్జ్‌ ప్లాన్‌లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్, వీ (వొడాఐడియా) టారిఫ్‌ ఛార్జీలను పెంచడంతో చాలా మంది ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన BSNL సహా ఇతర నెట్‌వర్క్‌లకు పోర్ట్​ అవుతున్నారు. దీంతో వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు వీలుగా తాజాగా కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను జియో తమ కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే దిద్దిబాటు చర్యగా తమ కస్టమర్లను నిలుపుదల చేసుకునేందుకు కొత్త రీఛార్జ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ ద్వారా ఏకంగా 98 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ 5Gని కూడా పొందవచ్చని తెలిపింది జియో. మరి ఈ ప్లాన్ ధర, వ్యాలిడిటీ, డేటా సహా ఇతర ప్రయోజనాల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.


Jio RS 999 Recharge Plan – జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ధర రూ.999. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా కాలింగ్‌, 4G డేటా, 5G డేటా సహా ఇతర ప్రయోజనాలను వినియోగించుకోవచ్చు. ఇంకా అన్ ​లిమిటెడ్ వాయిస్ కాల్స్​, ప్రతిరోజు 100 ఎస్​ఎమ్​ఎస్ లను వినియోగించుకోవచ్చు. ఒకవేళ 5G అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ 4Gడేటా స్పీడ్ తో ప్రతిరోజు 2GB డేటా పొందవచ్చు.

ఇంకా ఈ కొత్త జియో ప్లాన్ ద్వారా యూజర్స్​ మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. జియో పాపులర్ యాప్స్​ జియో క్లౌడ్‌, జియో సినిమా, జియో టీవీ వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ ప్యాకేజ్ ద్వారా మంచి ఎంటర్​టైన్మెంట్​ ను కూడా పొందేలా జియో సదుపాయాలను కల్పించింది.


ఈ ప్లాన్​ యాక్టివేట్​ చేసుకోవడం చాలా సింపుల్. స్మార్ట్ ఫోన్స్​లో జియో వెబ్‌సైట్‌ లేదా MyJio యాప్‌ ద్వారా ఈ కొత్త ప్లాన్ రీఛార్జ్‌ చేసుకోవచ్చు. లాంగ్ టెర్మ్​ వ్యాలిడిటీ, హై స్పీడ్ డేటా కావాలనుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. మొత్తంగా ఈ ప్లాన్ బెస్ట్ ఆన్​ లైన్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది.

దీంతో పాటు యూజర్స్​ మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు సరికొత్త ప్లాన్స్ ను తీసుకువచ్చింది. 84 రోజులు వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చిన జియో… ఈ ప్లాన్ ధర రూ.1,049, రూ. 1,299గా నిర్ణయించింది. ఈ కొత్త ప్లాన్​ లో డైలీ 2GB డేటా, అన్​లిమిటెడ్​ వాయిస్ కాల్స్ వస్తాయి. అలాగే రూ.1,049 ప్లాన్​లో అయితే సోనీ లివ్, జీ5 సబ్​స్క్రిప్షన్​ కూడా పొందవచ్చు. రూ.1,299 ప్లాన్​లో అయితే నెట్ ఫ్లిక్స్ మొబైల్ సబ్​స్క్రిప్షన్​ 480pలో పొందవచ్చు.

ALSO READ : రూ.10వేలకే శాంసాంగ్ 5G ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ఇంకా బడ్జెట్​ ఫ్రెండ్లీలో జియో రూ.175 ఆఫర్ ప్లాన్​ కూడా ప్రవేశపెట్టింది. 28 డేస్ వ్యాలిడిటీతో 10 GB డేటా పొందవ్చచు. ఇంకా పలు రకాల ఓటీటీ ప్లాట్​ఫామ్స్ సబ్​స్క్రిప్షన్ ను ఇది అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ 5, జియో సినిమా ప్రీమియమ్​ ఉంటాయి. ప్రీమియమ్ కంటెంట్​, షార్ట్ టెర్మ్ వ్యాలిడిటీ ​ కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

వీటితో పాటు రూ.949, రూ.1029 ప్లాన్స్​ను తీసుకొచ్చింది జియో. ఇందులో మొదటిది 90 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ + హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రాగా, మరొకటిది 84 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇంకా వీటిలో అన్​లిమిటెడ్​ 5G డేటా, రోజువారీ 100 SMSలు, అన్​లిమిటెడ్​ కాలింగ్​ వంటి సదుపాయాలు ఉన్నాయి.

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×