E-Paper
Advertisement

ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!

ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటికీ సపోర్ట్ చేసే JioTag 2 వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలు!
Advertisement

JioTag 2: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో భారత మార్కెట్లోకి తమ కొత్త ట్రాకింగ్ డివైజ్ JioTag 2nd Genను లాంచ్ చేసింది. గతంలో వచ్చిన జియోట్యాగ్‌కు కొనసాగింపుగా.. మరిన్ని అధునాతన మార్పులతో దీనిని తీర్చిదిద్దారు. వాలెట్లు, తాళాలు లేదా ఇతరు కీలక వస్తువులను సులభంగా వెతికి పట్టుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

మన దేశంలో JioTag 2 అసలు ధర రూ.1,249గా ఉంది. అయితే ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లతో వినియోగదారులు దీనిని రూ.1,199కే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఎయిర్‌ట్యాగ్ వంటి ఖరీదైన ట్రాకర్లతో పోలిస్తే ఇది సాధారణ వినియోగదారులకు ఎంతో అందుబాటులో ఉండే ధర. ఈ కొత్త పరికరం ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Advertisement

Also Read: పవర్‌ఫుల్ ప్రాసెసర్, 50MP కెమెరా ఉన్న Oppo ఫోన్‌పై ఏకంగా రూ.12,000 తగ్గింపు!

జియో ఈసారి తమ డివైజ్ రూపంలో కీలక మార్పులు చేసింది. సరికొత్త ఆకారంతో పాటు మరింత స్టైలిష్‌గా దీనిని డిజైన్ చేశారు. పటిష్టమైన పాలి కార్బోనేట్ మెటీరియల్‌తో తయారైన ఈ జియోట్యాగ్ 2 బ్లాక్, రెడ్, ఇంకా గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. అంతేకాకుండా.. ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది కాబట్టి ధూళి, నీటి చినుకుల నుండి సులభంగా రక్షణ పొందుతుంది.

Advertisement

JioTag 2లో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ (iOS) ఆపరేటింగ్ సిస్టమ్‌లు రెండింటిలోనూ సపోర్ట్ చేస్తుంది. పాత వెర్షన్‌లో ఈ సదుపాయం లేదు. ఇది గూగుల్ ఫైండ్ హబ్, యాపిల్ ఫైండ్ మై నెట్‌వర్క్‌ల ద్వారా లొకేషన్‌ను అందిస్తుంది. బ్లూటూత్ పరిధిలో ఉన్నప్పుడు దీనిలోని 120dB స్పీకర్ శబ్దం ద్వారా వస్తువులను గుర్తుపట్టవచ్చు. బ్లూటూత్ పరిధి దాటినప్పుడు మ్యాప్స్ ద్వారా రూట్ డైరెక్షన్స్ పొందే వీలుంది.

Also Read: 50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!

Related News

ఎవరైనా కెమెరా గ్లాసెస్ పెట్టుకుని మీకు దగ్గర్లో ఉంటే.. ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది!

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులు తరబడి టెన్షన్ ఫ్రీ

వాట్సాప్ చాట్స్ డిలీట్ చేయకుండా.. స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!

రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!

ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

Big Stories

Advertisement
×