Clean up WhatsApp storage: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ .. వాడే ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే .. గ్రూపుల్లో వచ్చే అన్‌వాంటెడ్ ఫోటోలు, వీడియోల వల్ల ఫోన్ స్టోరేజ్ త్వరగా ఫుల్ అయిపోతుంది. ముఖ్యమైన చాట్స్ డిలీట్ కాకుండా స్టోరేజ్ క్లీన్ చేయడం ఎలా అనే టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. మీ చాట్ హిస్టరీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. కేవలం అనవసరమైన మీడియా ఫైళ్లను తొలగించి వాట్సాప్ స్పేస్‌ను ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం రోజూ వాడే వాట్సాప్‌లో వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్‌లు, డాక్యుమెంట్లు వచ్చి చేరుతుంటాయి. ముఖ్యంగా.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయ్యే మెసేజ్‌ల వల్ల ఫోన్ మెమరీ ఇట్టే ఫుల్ అయిపోతుంది. దీని వల్ల ఫోన్ స్పీడ్ తగ్గిపోయి హ్యాంగ్ అవ్వడం ప్రారంభమవుతుంది. అయితే.. మనకు ఎంతో ఇష్టమైన పాత చాట్స్ లేదా మెసేజ్‌లను డిలీట్ చేయకుండానే కేవలం అనవసరమైన ఫైళ్లను తొలగించడం ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను చాలా వరకు ఫ్రీ చేసుకోవచ్చు.
వాట్సాప్‌లో మన ఫోన్ స్పేస్‌ను క్లీన్ చేయడానికి కంపెనీ ఒక అద్భుతమైన ఇన్‌బిల్ట్ టూల్‌ను అందించింది. దీనిని ఉపయోగించడం చాలా ఈజీ. ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. అక్కడ Storage and Data ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత Manage Storage మీద క్లిక్ చేస్తే, మీ ఫోన్‌లో వాట్సాప్ ఎంత స్పేస్ ఆక్రమించిందో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఏ చాట్ లేదా గ్రూప్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుందో లిస్ట్ వారర్‌గా చూపిస్తుంది. దీని ద్వారా చాట్స్ డిలీట్ చేయకుండానే కేవలం హెవీ మీడియాను మాత్రమే తొలగించవచ్చు.
మారిన ట్రెండ్‌కు తగినట్లుగా వాట్సాప్ మేనేజ్ స్టోరేజ్ టూల్‌లో .. ‘Larger than 5MB’ అనే సెక్షన్ ఉంటుంది. దీని ద్వారా 5 మెగాబైట్ల కంటే.. ఎక్కువ సైజు ఉన్న పెద్ద పెద్ద వీడియోలు, డాక్యుమెంట్లు అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. వీటిలో మనకు అసలు అవసరం లేని వీడియోలను.. సెలెక్ట్ చేసి సింగిల్ క్లిక్‌తో డిలీట్ చేయొచ్చు. దీని వల్ల ఒక్క సారిగా భారీ మొత్తంలో ఫోన్ స్టోరేజ్ ఖాళీ అవుతుంది.
చాలా సార్లు ఒకే వీడియో లేదా జోక్ వివిధ గ్రూప్‌ల నుంచి పదే పదే ఫార్వర్డ్ అవుతుంటుంది. దీని వల్ల ఫోన్ మెమరీలో ఒకే ఫైల్ డూప్లికేట్ కాపీలుగా సేవ్ అయిపోతుంది. మేనేజ్ స్టోరేజ్‌లోని Forwarded many times ఆప్షన్‌లోకి వెళ్లి ఇలాంటి అనవసరమైన ఫార్వర్డ్ మెసేజ్‌లను ఒకేసారి డిలీట్ చేయొచ్చు. దీని ద్వారా మీ చాట్ హిస్టరీకి ఎలాంటి నష్టం జరగదు.
వాట్సాప్ స్టోరేజ్ మళ్లీ మళ్లీ నిండిపోకుండా ఉండాలంటే. ‘ఆటో-డౌన్‌లోడ్’ ఫీచర్‌ను ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. దీనికోసం..
సెట్టింగ్స్‌లోని Storage and Dataలోకి వెళ్లాలి. అక్కడ Media Auto-Download కింద ఫోటోలు, ఆడియో, వీడియోలను ‘No Media’కు సెట్ చేయాలి. దీనివల్ల అవతలి వారు పంపిన ఏ ఫైల్ కూడా మీ అనుమతి లేకుండా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ కాదు. మీకు ఏది అవసరమో దానిని మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!
మీకు నచ్చిన నిర్దిష్టమైన వ్యక్తి లేదా గ్రూప్ చాట్ లోపలికి వెళ్లి కూడా స్పేస్ క్లియర్ చేసుకోవచ్చు. ఆ చాట్ ప్రొఫైల్ ఓపెన్ చేసి ‘Media, links, and docs’లోకి వెళ్లి అనవసరమైన ఫోటోలను లేదా వీడియోలను సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మెసేజ్‌లు అలాగే ఉంటాయి కానీ అనవసరమైన మీడియా ఫైల్స్ తొలగిపోతాయి.
చాట్స్ లేదా మెమరీ లాస్ అవుతామనే.. భయం లేకుండా పైన తెలిపిన సింపుల్ పద్ధతుల ద్వారా మీ వాట్సాప్ స్టోరేజ్‌ను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్స్ పాటించడం ద్వారా మీ ఫోన్ వేగంగా పనిచేయడమే కాకుండా స్టోరేజ్ ఫుల్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.