E-Paper
Advertisement

ఎవరైనా కెమెరా గ్లాసెస్ పెట్టుకుని మీకు దగ్గర్లో ఉంటే.. ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది!

ఎవరైనా కెమెరా గ్లాసెస్ పెట్టుకుని మీకు దగ్గర్లో ఉంటే.. ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది!
Advertisement

Zuckoff App: స్మార్ట్ గ్లాసెస్ ఇప్పుడు కేవలం ఫ్యాషన్ యాక్సెసరీలు మాత్రమే కాదు.. వాటితో ఫొటోలు, వీడియోలు కూడా సులభంగా తీయొచ్చు. అయితే మన చుట్టూ కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్ పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? ఇదే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది Zuckoff అనే కొత్త ఐఫోన్ యాప్. చుట్టుపక్కల ఉన్న బ్లూటూత్ సిగ్నల్స్‌ను స్కాన్ చేసి, కెమెరా కలిగిన కొన్ని స్మార్ట్ గ్లాసెస్ దగ్గర్లో ఉన్నాయా అనే విషయాన్ని అంచనా వేస్తుంది. ఇది రికార్డింగ్ జరుగుతోందని ఖచ్చితంగా చెప్పకపోయినా.. మన చుట్టూ ఉన్న టెక్నాలజీపై ఓ ముందస్తు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది.

యాప్ ఎలా పనిచేస్తుంది?

Zuckoff‌ను పోలాండ్‌కు చెందిన డెవలపర్ Pawel Szydlowski రూపొందించారు. ఆయన కొన్ని స్మార్ట్ గ్లాసెస్ మోడల్స్ కొనుగోలు చేసి, వాటి బ్లూటూత్ గుర్తింపులను పరిశీలించి డేటాబేస్ తయారు చేసినట్లు సమాచారం. ఫోన్ చుట్టూ ఉన్న బ్లూటూత్ సిగ్నల్స్‌ను యాప్ స్కాన్ చేసి, తెలిసిన డివైస్ వివరాలతో పోలుస్తుంది. సిగ్నల్ ఎంత బలంగా ఉందో దాన్ని బట్టి ఆ గ్లాసెస్ ఎంత దగ్గర్లో ఉండొచ్చో అంచనా వేస్తుంది.

రికార్డింగ్ జరుగుతోందని కాదు..

Advertisement

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. Zuckoff ఎవరో మనల్ని రికార్డ్ చేస్తున్నారని నిర్ధారించదు. గ్లాసెస్ ఎవరివో, అవి ఖచ్చితంగా ఎక్కడున్నాయో కూడా చెప్పలదు. ఫొటోలు, వీడియోలు లేదా ఆడియోను యాప్ చూడదు, వినదు. బ్లూటూత్ సిగ్నల్ కనిపించింది అంటే.. అలాంటి డివైస్ దగ్గర్లో ఉండే అవకాశం ఉందని మాత్రమే అర్థం.

Also Read: వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌కు ఒకే సబ్‌స్క్రిప్షన్.. Meta One వచ్చేసింది!

మెటా గ్లాసెస్‌పై ప్రశ్నలు..

Advertisement

Meta ఇప్పటికే AI ఫీచర్లతో స్మార్ట్ గ్లాసెస్‌ను సాధారణ వినియోగంలోకి తీసుకెళ్తోంది. Ray-Ban, Oakley మోడల్స్‌లో కెమెరా పనిచేస్తున్నప్పుడు బయట కనిపించే క్యాప్చర్ LED ఉంటుందని కంపెనీ చెబుతోంది. అయినా పక్కన ఉన్న వ్యక్తికి రికార్డింగ్ జరుగుతోందా లేదా అనే సందేహం ఉండొచ్చు. అలాంటి సమయంలో Zuckoff లాంటి యాప్‌లు ప్రైవసీపై చర్చను మరింత ముందుకు తీసుకెళ్తున్నాయి.

ప్రైవసీపై కొత్త ఆలోచన:

లాంచ్ తర్వాత Zuckoff‌కు సుమారు 5,000 మంది యూజర్లు వచ్చినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. పెయిడ్ ప్రో వెర్షన్ బ్యాక్‌గ్రౌండ్ నోటిఫికేషన్లు కూడా అందిస్తుంది. ఇది పూర్తిస్థాయి ప్రైవసీ రక్షణ కాదు. కానీ కెమెరా ఉన్న వేరబుల్స్ పబ్లిక్ ప్లేసుల్లో పెరుగుతున్న సమయంలో, మన చుట్టూ ఉన్న టెక్నాలజీ గురించి మనకే సమాచారం ఉండాలి అనే కొత్త ఆలోచనను మాత్రం ఇది ముందుకు తెస్తోంది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలు, కేఫ్‌లు, షాపింగ్ మాల్స్, ఈవెంట్స్‌లో టెక్నాలజీపై ఆసక్తి పెరగొచ్చు.

ఇదొక హెచ్చరిక మాత్రమే:

అయితే ప్రతి బ్లూటూత్ సిగ్నల్ ఒకే రకమైన గ్లాసెస్‌దే అని భావించడం సరైనది కాదు. యాప్ గుర్తింపు దాని డేటాబేస్‌లో ఉన్న వివరాలపై ఆధారపడి ఉంటుంది. కొత్త మోడల్స్ లేదా గుర్తించని డివైస్‌లను ఇది గుర్తించకపోవచ్చు. అందుకే దీన్ని ఒక హెచ్చరికగా చూడటం మంచిది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దాన్ని ఉపయోగించే వారి హక్కులతో పాటు ప్రైవసీ గురించి మాట్లాడాల్సిన అవసరం పెరుగుతోంది. ప్రైవసీపై చిన్న సందేహానికైనా ఇది ఉపయోగపడే ఒక సూచనగా నిలవొచ్చు.

Also Read: విదేశీ ప్రయాణమా? ఈ ఒక్క పాలసీ ఉంటే ఎన్నో సమస్యల నుంచి రక్షణ పొందొచ్చు!

Tags

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×