E-Paper
Advertisement

రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!

రూ.500 లోపు.. బెస్ట్ ఉమెన్స్ వాచ్ మోడల్స్!
Advertisement

Analog watches for women under 500: ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండ్‌లో చేతికి మంచి గడియారం పెట్టుకోవడం ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా అమ్మాయిలు తమ రోజువారీ ఔట్‌ఫిట్‌కు తగినట్లుగా సింపుల్, క్లాసీ లుక్ ఇచ్చే వాచ్‌లను కోరుకుంటారు. అయితే.. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా కేవలం రూ.500 లోపు బడ్జెట్‌లో లభించే బెస్ట్ అనలాగ్ వాచెస్ గురించి తెలుసుకోవాలని ఉందా? స్టైలిష్‌గా.. కనిపిస్తూ బడ్జెట్‌లో సరి పోయే టాప్ 5 ఉమెన్స్ అనలాగ్ వాచెస్‌ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

మినిమలిస్ట్ డైలీ స్టైలింగ్ ప్రాముఖ్యత:

Advertisement

ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ‘మినిమలిస్ట్’ లుక్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఎక్కువ హంగులు లేకుండా సింపుల్‌గా, ట్రెండీగా కనిపించడమే ఇప్పటి ట్రెండ్. ఆఫీస్‌కు వెళ్లే మహిళలు, కాలేజ్ స్టూడెంట్స్ రోజువారీ వాడకానికి భారీ డిజైన్ల కంటే.. సింపుల్ డయల్ గల అనలాగ్ వాచ్‌లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తక్కువ ధరలో.. ప్రీమియం లుక్‌ను అందించే ఇలాంటి వాచెస్ మన పర్సనాలిటీని మరింత అందంగా మారుస్తాయి. రూ.500 బడ్జెట్‌లో లభించే అద్భుతమైన ఐదు వాచ్ ఆప్షన్స్ ..

1.క్లాసిక్ లెదర్ స్ట్రాప్ అనలాగ్ వాచ్:

మహిళల ఫ్యాషన్‌లో.. లెదర్ స్ట్రాప్ వాచెస్ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. బ్రౌన్ లేదా బ్లాక్ కలర్ లెదర్ స్ట్రాప్‌తో .. వచ్చే సింపుల్ రౌండ్ డయల్ వాచ్ ఏ రకమైన డ్రెస్ మీదకైనా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆఫీస్ వేర్ లేదా క్యాజువల్ జీన్స్ టీ-షర్టులకు ఇది అద్భుతమైన లుక్‌ను ఇస్తుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.399 నుంచి రూ.499 మధ్యలో లభిస్తుంది.

2. రోజ్ గోల్డ్ మెటాలిక్ బ్రిస్లెట్ వాచ్:

Advertisement

ప్రస్తుతం రోజ్ గోల్డ్ కలర్‌కు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. చూడటానికి అచ్చం ఖరీదైన బ్రాండెడ్ వాచ్ లాగా అనిపించే ఈ మెటాలిక్ బ్రిస్లెట్ వాచ్ పార్టీలకు లేదా ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ ఛాయిస్.మణికట్టుపై చాలా అందంగా, హ్యాండ్ జ్యువెల్లరీ లాగా కనిపిస్తుంది.దీని ధర సుమారు రూ.450 వరకు ఉంటుంది. అంతే కాకుండా ఇది బడ్జెట్‌లో ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

3. మినిమలిస్ట్ మెష్ బెల్ట్ అనలాగ్ వాచ్:

చాలా సన్నని, అందమైన మెష్ టైప్ మెటల్ స్ట్రాప్‌తో.. వచ్చే ఈ వాచ్ మోడ్రన్ ట్రెండ్‌కు సరిగ్గా సరి పోతుంది. వైట్ లేదా సిల్వర్ డయల్‌తో వచ్చే.. ఈ వాచ్ చేతికి చాలా హుందాగా ఉంటుంది. కాలేజ్ అమ్మాయిలకు ఈ మోడల్ చాలా బాగా నచ్చుతుంది. దీని ధర అంచనా రూ.420 నుంచి రూ.499 లోపే ఉంటుంది.

4. వింటేజ్ స్క్వేర్ డయల్ వాచ్:

రౌండ్ డయల్ వాచ్‌లకు భిన్నంగా కొంచెం భిన్నమైన స్టైల్ కోరుకునే వారికి స్క్వేర్ లేదా రెక్టాంగిల్ డయల్ వాచ్‌లు గొప్ప ఆప్షన్. వింటేజ్ లుక్‌ను తలపించే .. ఈ వాచ్ చేతికి చాలా ట్రెండీగా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ , చక్కని కలర్ కాంబినేషన్‌తో లభించే ఈ వాచ్ ధర దాదాపు రూ.380 నుంచి రూ.450 మధ్యలో ఉంది.

Also Read: ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

5. సింపుల్ క్యాజువల్ సిలికాన్ స్ట్రాప్ వాచ్:

ఎక్కువగా రన్నింగ్, జిమ్ లేదా స్పోర్టివ్ లుక్ ఇష్టపడే.. అమ్మాయిల కోసం సిలికాన్ లేదా రబ్బర్ స్ట్రాప్ వాచెస్ చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇవి చెమట పట్టినప్పటికీ.. చెడిపోకుండా చాలా కాలం పాడవకుండా ఉంటాయి. రోజూవారీ హడావుడి జీవితంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్. దీని ధర కేవలం రూ.350 నుంచి రూ.450 లోపు లభిస్తుంది.

తక్కువ బడ్జెట్‌లో స్టైలిష్‌గా కనిపించాలనుకునేవారికి.. ఈ అనలాగ్ వాచెస్ బస్ట్ అని చెప్పొచ్చు. రూ.500 లోపు ధరలో లభించే ఈ వాచెస్ (ధరలు రూ.350 రూ.499 మధ్యలో అందుబాటులో ఉన్నాయి). మీ పర్సనల్ టేస్ట్‌కు తగ్గట్టుగా తగిన మోడల్‌ను ఎంచుకుని మీ రోజువారీ స్టైలింగ్‌ను మరింత మెరుగు పరచుకోండి!

Related News

వాట్సాప్ చాట్స్ డిలీట్ చేయకుండా.. స్టోరేజ్ ఎలా ఖాళీ చేయాలి?

రూ.1500లోపు అదిరిపోయే ఇయర్ బడ్స్..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

రోజుకు 3GB డేటా కావాలా? Airtelలో ఈ రెండే బెస్ట్ ప్లాన్స్.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సైతం ఉచితం!

ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

కొత్త ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? Asus తెచ్చిన ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

65 ఇంచుల టీవీపై మతిపోయే ఆఫర్..వెంటనే కొనేయండి

రూ.60వేలలోపు అదిరిపోయే లెనోవో i5 ల్యాప్ టాప్..స్పెషల్ ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×