Oppo K13 Turbo Pro 5G: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ల ధరలు క్రమంగా పెరుగుతున్న తరుణంలో.. ఒప్పో ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అందుబాటులోకి వచ్చింది. ఒప్పో తమ లేటెస్ట్ మోడల్ ‘Oppo K13 Turbo Pro 5G’పై అదిరిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. భారీ బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌ను ఇప్పుడు MRP కంటే చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.41,999 కాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఏకంగా 26 శాతం నేరుగా డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.30,999కి తగ్గిపోయింది. అంటే.. ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే దాదాపు రూ.11,000 వరకు బెనిఫిట్ లభిస్తుంది.
Also Read: 50MP జైస్ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్న ఆ ఫోన్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఛాన్స్ మిస్ కావద్దు!
కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. దీనిపై అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మరో రూ.1,500 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ.29,499కి తగ్గుతుంది. మొత్తంమీద MRPపై రూ.12,000 కంటే ఎక్కువే ఆదా చేసుకోవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.80 ఇంచుల LTPS అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ బ్రైట్‌నెస్ కలవు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ డివైజ్.. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్‌ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది.
ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని 7,000mAh భారీ బ్యాటరీ. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. 5G, వైఫై 7, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read: స్క్రీన్‌తో వస్తున్న Apple HomePod.. వాయిస్ కంట్రోల్‌కి గుడ్‌బై చెప్పాల్సిందేనా?